Candrakumar
-
గ్రామాలను కాపాడుకోవాలి జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: ఉత్పత్తికి మూలకారణమైన గ్రామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పరిపాలనలో వికేంద్రీకరణ జరిగినప్పుడే గ్రామాలకు అధికారాలు దక్కుతాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు పెంచినప్పుడు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు వారికి రూ.12 వేల పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత పెద్దిరెడ్డి, యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి, గద్దర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, చంద్రన్న, ఫోరం ప్రధాన కార్యదర్శులు ఎ.రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కెప్టెన్ కసరత్తు
సాక్షి, చెన్నై : పార్టీని, కేడర్‌ను నిలుపుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో డీఎండీకేను రక్షించడం లక్ష్యంగా పోటీ సర్వసభ్య సమావేశానికి సన్నద్ధం అవుతున్నట్టు చంద్రకుమార్ ప్రకటించారు. డీఎండీకేలో ముసలం బయలు దేరిన విషయం తెలిసిందే. విజయకాంత్ సతీమణి ప్రేమలత చేతిలోకి చేరిన పార్టీని కైవసం చేసుకునేందుకు చంద్రకుమార్ నేతృత్వంలోని బృందం తీవ్ర కసరత్తుల్లో మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎండీకే వర్గాల మద్దతు సేకరించే పనిలో చంద్రకుమార్ నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో పోటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రేమలత గుప్పెట్లో ఉన్న డీఎండీకేను రక్షించుకుంటామని చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. విజయకాంత్ చేతి నుంచి డీఎండీకే ప్రేమలత చేతిలోకి చేరినందుకే, తాము తిరుగు బాటుతో ముందుకు సాగుతున్నామని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం ఉంటుందని గురువారం చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదో తేదిన తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు చంద్రకుమార్ ఉరకలు తీస్తుంటే, మరో వైపు అదే రోజున అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, అదే రోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశానికి ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. ఇక, ధర్మపురి, కోయంబత్తూరు, నాగపట్నం జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యే విజయకాంత్‌ను కలిసి, ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చే విధంగానిర్ణయం తీసుకోవాలని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించి, డీఎంకేలోకి చేరుదామంటూ కన్నీళ్ల పర్యంతంతో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, విజయకాంత్ ఏమాత్రం తగ్గని దృష్ట్యా, ఆ నలుగురు చంద్రకుమార్ జట్టులోకి దూకేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, డీఎండీకేలో ముసలం బయలు దేరిన సమయంలో ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి పరుగులు తీశారు. అక్కడ విజయకాంత్‌తో సమాలోచించారు. తదుపరి తన వెంట వచ్చిన కొన్ని పార్టీల నేతల్ని విజయకాంత్‌కు పరిచయం చేసి, వారి మద్దతును స్వీకరించారు. ఎస్ఎంకేలోనూ : ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు రావాలని విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా డీఎండీకేలో తిరుగు బాటు సాగుతుంటే, మరో వైపు అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)లో తిరుగు బాటు బయలు దేరింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కాళిదాసు, నాయకుడు ఆదియమాన్ శరత్‌కుమార్ తీరును ఖండిస్తూ తిరుగు బాటు చేపట్టారు. అన్నాడీఎంకేలో అత్యధిక స్థానాలు ఆశించకుండా, కేవలం తన వరకు మాత్రం శరత్‌కుమార్ చూసుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ కూటమి నుంచి బయటకు రావాలని ఈ నేతలు నినదించడం గమనార్హం. కూటమిలోనే గరం గరం: డీఎంకే అధినేత కరుణానిధిపై ఎండీఎంకే నేత వైగో చేసిన వ్యాఖ్యలను ప్రజా సంక్షేమ కూటమిలో ఉన్న పార్టీలు ఖండిస్తుండడం గమనార్హం. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదని సీపీఎం నేత జి రామకృష్ణన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యల్ని వీసీకే నేతలు తిరుమావళవన్, రవికుమార్‌లు ఖండించారు. ఇక, సీపీఐ నేత ముత్తరసన్ సైతం ఆ వ్యాఖ్యల్ని అంగీకరించ లేమని వ్యాఖ్యానించారు. ఇక, జీకే వాసన్ సైతం వైగో తీరును తప్పుబట్టారు. వ్యక్తిగత విమర్శలు వైగో మానుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై హితవు పలికారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వైగోకు వ్యతిరేకంగా డీఎంకే నిరసనలు రాజుకున్నాయి. దీంతో జీవిత కాలంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఇది అని, కరుణానిధి వద్ద బహిరంగ క్షమాపణ కోరుతున్నట్టుగా వైగో ఓ ప్రకటన విడుదల చేశారు. -
అధికారంలో ఉన్నవారు చెప్పేవే చట్టాలు
న్యాయ దినోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్ : అధికారంలో ఉన్నవారు చెప్పినవే చట్టాలవుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ దేశంలో 80 శాతం ఉన్నవారిని కాదనీ ఇరవైశాతం వారే అధికారం చలాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తపరిచారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థలోనూ, నిజాం కళాశాల ఆడిటోరియంలో వేర్వేరుగా జరిగిన ‘లా దినోత్సవం’ (లా డే) కార్యక్రమాల్లో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. దళిత, హరిజన, గిరిజన, బీసీలు మరింత చైతన్యవంతమై అ అధికారాన్ని చేజిక్కించుకొన్నపుడు ప్రజాస్వామ్యానికి అసలైన అర్థమన్నారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలు దశాబ్దాలుగా దొరల పల్లకీ మోస్తునే ఉన్నారన్నారు. ఇకనైనా వారు తమ వారసుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చైతన్య పథాన నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. చంద్రయ్య, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. రామస్వామిలు కూడా ప్రసంగించారు. వేచ్ఛా, సమానతల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ కాగా నిజాం కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ భారతదేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన మహా వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధిలేమి వల్లే సమానత్వం, స్వేచ్ఛ ప్రజలకు అందడం లేదన్నారు. -
అంతరించిపోతున్న విలువలు
జస్టిస్ చంద్రకుమార్ నాంపల్లి: నేటి సమాజంలో మానవీయ విలువలు అంతరించి పోతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రచయిత డాక్టర్ ప్రసాదమూర్తి రచించిన నాల్గవ కవితా సంపుటి ‘‘పూలండోయ్ పూలు’’ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో జరిగింది. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభకు జస్టిస్ బి.చంద్రకుమార్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. విలువలు పతనమైపోతున్న తరుణంలో స్పందించే మనుషులు అవసరమన్నారు. క్రాసింగ్‌ల వద్ద చిన్న రైల్వేగేటును ఏర్పాటు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తంచేశారు. స్వాతంత్య్రం వచ్చి 62 ఏళ్లు గడిచినా ఇలాంటి చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. భోలక్‌పూర్ ప్రాంతంలోని పలు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున బాలకార్మికులు పనిచేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళ వ్యక్తం చేశారు. నేటి యువతరంలో స్ఫూర్తిని నింపే కవిత్వాలను రాయాలని ఆయన సూచించారు. తొలి ప్రతిని భారత్ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ సామంతపూడి బాలకృష్ట్టంరాజు స్వీకరించారు. ప్రముఖ కవి సీతారం పుస్తక సమీక్షా చేశారు. ప్రజా కవి గోరటి వెంకన్న, ప్రముఖసినీ నటుడు ఎం.ఎస్.నారాయణ, కవి ఆచార్య సిఖామణి,నేటి నిజం ఎడిటర్ బి.దేవదాసు, 10టీవీ సీఈవో అరుణ్‌సాగర్, కవి ఖాదర్మోయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం
వివాహ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్న జస్టిస్ చంద్రకుమార్ సాక్షి,సిటీబ్యూరో: ‘వివాహానికి ముందు... తరువాత జంటలకు కౌన్సెలింగ్ చేయాలి. వివాహ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలపై అవగాహన కల్పించాలి. తద్వారా కలిగే ప్రయోజనాలు వెలకట్టలేం. చిన్నచిన్న కారణాలతో ఇప్పుడు జంటలు పెళ్లయిన ఏడాది లోపే విడిపోతున్నాయి’ అన్నారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ రవీంద్రభారతిలో శుక్రవారం ‘వివాహ విజ్ఞాన సదస్సు’ నిర్వహించింది. ఇందులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ‘ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే విడాకులు పెరగడానికి కారణం. తిరుపతిలో ఓ జువైనల్ హోమ్ సందర్శిస్తే... అందులో 83 శాతం మంది పిల్లలు భార్యాభర్తలు విడిపోయి వదిలేసినవారే. చిన్నచిన్న గొడవలకే విడాకులు తీసుకొని పిల్లలకు ద్రోహం చేయడం తగదు. తల్లిదండ్రులు ప్రేమను దూరం చేసి లేత మనసులు గాయపరచకూడదు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లల హక్కు’ అన్నారు. మాజీ డీజీపీ అరవిందరావు, వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్, గంపా నాగేశ్వరరావు, ఆకెళ్ల రాఘవేంద్ర, రవికుమార్, ఆధ్యాత్మిక వక్త సత్యవాణి తదితరులు ప్రసంగించారు. శివశంకరి, గీతాంజలి పాడిన పెళ్లి పాటలు అలరించాయి. -
బాలికపై లైంగిక దాడికి యత్నం
ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేయలేదని వదిలేసిన పోలీసులు దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : బాలికపై లైంగికదాడికి యత్నించిన కామాంధుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..శ్రీనగర్ నివాసి చంద్రకుమార్(25) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సర్కిల్లో పానీ పూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి కుమార్తె (10) బుధవారం సాయంత్రం కెంపేగౌడ నగర్‌లోని ట్యూషన్‌కు కాలినడకన బయల్దేరింది. ఆ సమయంలో చంద్రకుమార్ వచ్చి బాలికను ఆటోలో ఎక్కించుకున్నాడు. తెలిసిన వ్యక్తే కావడంతో బాలిక అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత చంద్రకుమార్ ఆటోను కెంపేగౌడ నగర్‌కు కాకుండా పట్టణ శివారులోని స్కౌట్ క్యాప్ సమీపంలో ఉన్న నిర్జనప్రదేశానికి తీసికెళ్లాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావని బాలిక నిలదీస్తుండగానే నోరు నొక్కి లైంగి దాడికి యత్నించాడు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి బాలికను రక్షించి చంద్రకుమార్‌ను శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు కామాంధుడిని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. చెప్పులు, పరకలతో చితకబాదారు. పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయలేదని చెబుతూ నిందితుడిని గురువారం వదిలేశారు. -
వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు
నల్లకుంట,న్యూస్‌లైన్: మనిషి వ్యక్తిత్వాన్ని బట్టే మానవ సంబంధాలు ఏర్పడుతాయని, ప్రస్తుతం మానవ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. నిజాయితీ, దయాగుణం, ఇతరులకు సాయం చేయాలనుకునే వారిని సమస్యలు దరిచేరవని చెప్పారు. ఆదివారం విద్యానగర్ సాయినగర్‌కాలనీలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో సంస్థాన్ అధ్యక్షుడు కె.సాయిబాబా అధ్యక్షతన ‘మహోన్నత మానవ సంబంధాలు’ అనే అంశంపై వ్యక్తిత్వవికాస శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్యవక్తగా విచ్చేసిన కమర్షియల్‌ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై.సత్యనారాయణ మాట్లాడుతూ మని షిని మనిషిగా గుర్తించి, సాటిమనిషి వ్యక్తిత్వా న్ని గౌరవించే వారికి సమస్యలు రావన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రమౌళి, ప్రముఖ వ్యక్తిత్వ నిపుణులు నాగేశ్వర్రావు, ప్రొ.జయసింహ, సంస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిత్వ శిక్షణ తరగతికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి..: బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం బౌరంపేటలోని వీఎన్ఆర్ సీనియర్ సిటిజన్స్ హోం వార్షికోత్సవానికి జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టేందుకు స్వచ్ఛందసంస్థలు ముందుకురావాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, రాష్ట్ర వెలమ సంఘం అధ్యక్షుడు,ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, హోం చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్‌రావు, నారాయణరావు, రామ్మోహన్రావు, వడ్డేపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.