బాలికపై లైంగిక దాడికి యత్నం | Project girl was sexually assaulted | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడికి యత్నం

Published Fri, Mar 28 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

Project girl was sexually assaulted

  • ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి
  •  నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •  బాధితులు ఫిర్యాదు చేయలేదని  వదిలేసిన పోలీసులు
  •  దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : బాలికపై లైంగికదాడికి యత్నించిన కామాంధుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..శ్రీనగర్ నివాసి చంద్రకుమార్(25) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రైల్వేస్టేషన్ సర్కిల్‌లో పానీ పూరి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి కుమార్తె (10) బుధవారం సాయంత్రం కెంపేగౌడ నగర్‌లోని ట్యూషన్‌కు కాలినడకన బయల్దేరింది.   ఆ సమయంలో చంద్రకుమార్ వచ్చి బాలికను ఆటోలో ఎక్కించుకున్నాడు.
     
    తెలిసిన వ్యక్తే కావడంతో బాలిక అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత చంద్రకుమార్ ఆటోను  కెంపేగౌడ నగర్‌కు కాకుండా పట్టణ శివారులోని స్కౌట్ క్యాప్ సమీపంలో ఉన్న నిర్జనప్రదేశానికి తీసికెళ్లాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావని బాలిక నిలదీస్తుండగానే నోరు నొక్కి లైంగి దాడికి యత్నించాడు.

    అటుగా వెళ్తున్న కొందరు గమనించి బాలికను రక్షించి చంద్రకుమార్‌ను శ్రీనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ స్థానికులు కామాంధుడిని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేశారు. చెప్పులు, పరకలతో చితకబాదారు. పట్టణ పోలీసులు అక్కడకు చేరుకొని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయలేదని చెబుతూ నిందితుడిని గురువారం వదిలేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement