హైదరాబాద్: ఉత్పత్తికి మూలకారణమైన గ్రామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ పరిపాలనలో వికేంద్రీకరణ జరిగినప్పుడే గ్రామాలకు అధికారాలు దక్కుతాయన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతాలు పెంచినప్పుడు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసల జీవన స్థితిగతులను మెరుగుపర్చేందుకు వారికి రూ.12 వేల పెన్షన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత పెద్దిరెడ్డి, యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి, గద్దర్, జాజుల శ్రీనివాస్ గౌడ్, చంద్రన్న, ఫోరం ప్రధాన కార్యదర్శులు ఎ.రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment