కుమార్తెపై తండ్రి లైంగిక దాడి | Daughter, father of sexual assault | Sakshi
Sakshi News home page

కుమార్తెపై తండ్రి లైంగిక దాడి

Nov 2 2014 3:06 AM | Updated on Sep 2 2017 3:43 PM

కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కసాయిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై కొన్ని నెలలుగా లైంగిక దాడి చేశాడు.

  • నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
  • విజయవాడ: కుమార్తెను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట కసాయిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై కొన్ని నెలలుగా లైంగిక దాడి చేశాడు. సభ్యసమాజం తలదించుకునే విధంగా మానవ సంబంధాలను మంటగలుపుతూ ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. మైనర్ అయిన కుమార్తెకు  కొన్ని నెలలుగా నిద్రమాత్రలు ఇచ్చి లైంగికదాడి చేస్తున్నట్లు సమాచారం.

    నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన  జరిగింది.  విషయం తెలుసుకున్న బాలిక తల్లి.. కుమార్తెను తీసుకుని నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ కె.వరప్రసాద్ వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ అందించిన సమాచారంతో ఏసీపీ లావణ్యలక్ష్మి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని నిందితుడిని విచారణ చేస్తున్నారు.
     
    వివరాల వెల్లడి సాధ్యం కాదు : ఏసీపీ

    మానవ సంబంధాలకు విఘాతం కలిగించే ఇలాంటి అవాంఛనీయ ఘటనలపై నమోదైన  కేసుల్లో వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి విలేకరులకు తెలిపారు. అత్యంత సున్నితమైన ఇలాంటి కేసులో బాధితురాలి గౌరవం, భద్రత దృష్ట్యా నిందితుడి వివరాలను సైతం వెల్లడించలేమని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును అత్యంత గోప్యంగా జరుపుతామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement