favourite
-
తెలుగులో ఆ రెండు సినిమాలే నా ఫేవరేట్: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవర ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్‌తో అభిమానులను అలరించాడు. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటించారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే కేరళలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లిచూపులు హిట్ తర్వాత నా ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్ నుంచే.. త్రివిక్రమ్ సార్ నన్ను ఆఫీస్‌కు పిలిచి అందించారు. ఆయనను కలవడం నా జీవితంలో బిగ్ మూమెంట్ అన్నారు. నా ఫేవరేట్ సినిమాలు మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అని విజయ్ తెలిపారు. ఎవరైనా ఖలేజా సినిమా బాగలేదంటే వారితో గొడవపడేవాడిని అని విజయ్ దేవరకొండ అన్నారు.కాగా..వీడీ 12 తర్వాత మరో రెండు చిత్రాల్లో విజయ్ నటించనున్నారు. రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. వీడీ12 వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్ కానుంది. #Trivikram గారు డబ్బులతో ధైర్యం ఇచ్చారు, #Athadu & #Khaleja are my most favourite films - @TheDeverakonda #VijayDeverakonda #VD12 #LuckyBaskhar #TeluguFilmNagar pic.twitter.com/6I5vkmfkOL— Telugu FilmNagar (@telugufilmnagar) October 27, 2024 -
రతన్ టాటా ఎలాంటి వంటకాలు ఇష్టపడేవారంటే..!
టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్ మోటార్ సైకిల్ గ్యారెజ్ వాళ్లకు పేరుగాంచింది.కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్ రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్ ఫుడ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు. (చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!) -
సచిన్ నుంచి విరాట్ కోహ్లీ వరకు దిగ్గజ క్రికెటర్లు ఇష్టపడే ఫుడ్స్ ఇవే..!
ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో దక్కించుకున్న విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆటగాళ్లను ప్రత్యేకంగా కలిసి మరీ అభినందించారు. 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి కూడా. ఈ సందర్భంగా మైదానంలో విధ్వంసరకర బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించే భాతర దిగ్గజ ఆటగాళ్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఏంటో సివివరంగా తెలుకుందామా..!విరాట్ కోహ్లీ: మైదానం విరాట్ సంచలనం. అలాంటి వ్యక్తి హెల్స్ పట్ల చాలా కాన్షియస్తో ఉంటాడు. అలాగే అతని ఆహారశైలి పౌష్టికరమైనది, చాలా స్ట్రిట్‌గా వ్యవసహరిస్తాడు. విరాట్‌కి తరుచుగా జపనీస్ వంటకాలను ఇష్టపడుతుంటాడు. అతనికి చేపలంటే ఇష్టం. ఒక మంచి చోలే భాతురే, సంప్రదాయ పంజాబీ వంటకాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. సచిన్ టెండూల్కర్: ఆయనకి సీఫుడ్ అంటే మహా ఇష్టం. ఈ లెజెండరీ క్రికెటర్‌కి సీఫుడ్ అంటే మహా ఇష్టం. తీరప్రాంత నగరమైన ముంబైలో పెరిగిన సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ఫేవరెట్ డిష్ రొయ్యల కూర. అతను దీన్ని వేడి అన్నంలో ఇష్టంగా తీసుకుంటాడు.ఎంఎస్ ధోని: చాలా కూల్‌గా వ్యవహరించే ధోని ఇంట్లో వండే భోజనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అతడు కతియావాడి వంటకాలను ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇష్టమైన వంటకం ఖిచ్డీ కధీ. హార్దిక్ పాండ్య: డైనమిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్ వివిధ రకాల వంటకాలను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడా. అయితే అతడు ప్రత్యేకంగా ఇష్టపడి తినే ఫుడ్ ఐటెం చీజ్ పావ్ భాజీ.రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్‌గా పిలుచుకునే హార్డ్‌కోర్ బ్యాట్స్ మ్యాన్ రోహిత్ శర్మకు స్వీట్స్ అంటే మహా ప్రీతి. అతనికి ఇష్టమైన స్వీట్ క్లాసిక్ రసగుల్లా, స్టఫ్డ్ బ్రెడ్ , ఆలు పరాఠా వంటివి ఇష్టంగా ఆస్వాదిస్తాడు. కేఎల్ రాహుల్: స్టైలిష్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన కేఎల్ రాహుల్, దక్షిణ భారత వంటకాలకు ప్రాధాన్యత ఇస్తాడు. కర్నాటకలో పెరిగిన అతను బిసి బేలే బాత్ అంటే మహా ఇష్టం. అలాగే టాంగీ రైస్ డిష్ రాహుల్‌కి ఆల్ టైం ఫేవరెట్ ఫుడ్.జస్ప్రీత్ బుమ్రా: ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చికెన్ బిర్యానీని మహా ఇష్టం. ఒక ఇంటర్యూలో సైతం దీన్ని చీట్మీల్గా భావించి ఇష్టంగా ఆరగిస్తానని చెప్పాడు కూడా. శిఖర్ ధావన్: ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్‌కు ఉత్తర భారత వంటకాలంటే అమితమైన ప్రేమ. అతనికి ఇష్టమైన వంటకం బటర్ చికెన్. ఇది పంజాబీ వంటకాల్లో ప్రముఖంగా ఉండే రిచ్ క్రీము చికెన్ కర్రీ.(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!) -
అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..
మనదేశం రుచికరమైన ఆహారం విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందరూ ఎంతగానో ఇష్టపడే వంటకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అప్పడం రుచి ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు ఎంతో ఇష్టం. అప్పడం భారతీయ వంటకాలలో ముఖ్యమైనదిగా పేరొందింది. వివాహ వేడుక అయినా, విందు అయినా పాపడ్ భారతీయులకు పాపడ్ ఉండాల్సిందే. క్రంచీ, స్పైసీతో కూడిన పాపడ్ ఇతర ఆహారపు రుచులను మరింతగా పెంచుతుంది. అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే పాపడ్ ఎలా పుట్టిందో, భారతీయుల ఆహారంలో అది ఎలా ప్రధాన భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. పాపడ్‌కు ఘన చరిత్ర చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో మక్కువతో పాపడ్‌ను తింటారు. ఆహారపు రుచిని పెంచే ఈ కరకరలాడే పాపడ్ చరిత్ర 500 బీసీ అంటే 2500 సంవత్సరాల నాటిదని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం ఆహార చరిత్రకారుడు, రచయిత కెటి ఆచార్య రాసిన 'ఎ హిస్టారికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్'లో కనిపిస్తుంది. మినప్పుప్పు, పెసర పప్పుతో చేసిన పాపడ్ గురించి అతని పుస్తకంలో ప్రస్తావించారు. మరోవైపు భారతదేశంలో దాని చరిత్ర గురించి చెప్పాలంటే ఇక్కడ పాపడ్‌కు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. పాపడ్ తయారీకి అనువైన సింధ్ అప్పడానికి సంబంధించిన తొలి ప్రస్తావన జైన సాహిత్యంలో కనిపిస్తుంది. పాపడ్ అనేది మార్వార్ జైన సమాజంలో కనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రయాణాల్లో పాపడ్‌ను తీసుకెళ్లేవారు. పాపడ్ ఇండియాకు రావడం అనే విషయానికొస్తే ఇది మన పొరుగు దేశం పాకిస్తాన్ నుండి ఇక్కడకు చేరుకుంది. పాపడ్ తయారీకి సింధ్ (పాకిస్తాన్) సరైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ గాలి, అధిక ఉష్ణోగ్రత పాపడ్ తయారీకి అనువైనవి. 1947లో దేశ విభజన జరిగినప్పుడు చాలా మంది సింధీ హిందువులు భారతదేశానికి వలస వచ్చారు. వారు తమతో పాటు అప్పడాలు తీసుకువచ్చారు. అప్పడానికి ఊరగాయ జతచేసి.. ఆ సమయంలో అది అక్కడి ప్రజల ప్రధాన ఆహారంగా మారింది. ఎందుకంటే పాపడ్ శరీరంలో నీటిని నిలిపివుంచడంతో పాటు తాజాదనాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని భావించేవారు. రోజురోజుకు పాపడ్ వినియోగం పెరుగుతుండటంతో చాలామంది అప్పడాలను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ డబ్బు సంపాదించసాగారు. పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సింధీలు తమ జీవనోపాధి కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితిలో పలువురు మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పడాలు, ఊరగాయలు విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. అప్పడానికి ఎన్నో పేర్లు మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు అనేక రకాల పాపడ్లు పలు రుచులతో అందుబాటుకి వచ్చాయి. వీటిలో బియ్యం పాపడ్, రాగి పాపడ్, సజ్జ, బంగాళాదుంప, పప్పు, ఖిచియా పాపడ్ మొదలైనవి కూడా ఉన్నాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆహారంలో అప్పడం అనేది ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వివిధ దేశాలలో అప్పడాలను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తమిళనాడులో అప్పలమని పిలిస్తే, కర్ణాటకలో హప్పల అని అంటారు. కేరళలో పాపడమ్, ఒరిస్సాలో పంపా, ఉత్తర భారతదేశంలో పాపడ్ అని పిలుస్తారు. ఇది కూడా చదవండి: స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే.. -
నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు. చదవండి: Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి.. పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి. ఆవకాయకు బహుబాగు కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో
Ranveer Singh About His Favourite Song Is Samantha Oo Antava: బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల కపిల్ దేవ్ బయోపిక్ '83' చిత్రంతో అలరించాడు. తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న విభిన్న చిత్రం 'జయేశ్‌భాయ్ జోర్దార్'. దివ్యాంగ్ ఠక్కర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలినీ పాండేతోపాటు అనన్య నాగల్ల కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు రణ్వీర్ సింగ్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ రణ్వీర్ సింగ్‌ను 'తెలుగులో మీకు నచ్చిన పాట ఏది ?' అని అడిగాడు. దీనికి అల్లు అర్జున్ హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప: ది రైజ్'లోని 'ఊ అంటావా మావా' అనే సాంగ్ ఇష్టమని తెలిపాడు రణ్వీర్. దీని గురించి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ 'ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట ఊ అంటావా మావా. ఆ సాంగ్ ప్లే అయినప్పుడు ఐయామ్ గోయింగ్ మ్యాడ్. ఆ పాట మీనింగ్ నాకు తెలియదు. కానీ నా మనసుకు మాత్రం బాగా నచ్చింది. అందుకే ఆ పాటంటే అంత ఇష్టం నాకు. 'అని పేర్కొన్నాడు. పుష్ప మూవీలో సమంత నర్తించిన ఈ స్పెషల్ సాంగ్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. చదవండి: ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే.. Oo antava from Pushpa is one of my favourite song in recent time: Ranveer Singh 🎧🎺🎻🎸🎶🎵🎼🎹🥁@alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/6yi5osOwuk — Sreedhar Marati (@SreedharSri4u) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తాప్సీ ఫేవరెట్ బుక్ ‘పర్వీన్‌బాబీ: ఏ లైఫ్’
‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన తాప్సీ పన్ను ‘గేమ్ ఓవర్’ ‘తప్పడ్’ ‘బద్లా’... మొదలైన సినిమాలతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి పర్వీన్‌బాబీ: ఏ లైఫ్ బుక్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... చిత్రమేమిటంటే బాబీ గురించి మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ ఏమీ తెలియదు! గాసిప్‌ల నుంచి ఆమె జీవితాన్ని కాచి వడబోయలేం కదా! ఏదో ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి కదా.... సరిగ్గా ఈ ప్రయత్నమే పర్వీన్‌బాబీ: ఏ లైఫ్ బుక్. ఫిల్మ్ జర్నలిస్ట్ కరిష్మ ఉపాధ్యాయ్ ఈ పుస్తకాన్ని రాశారు. తన రిసెర్చ్‌లో భాగంగా పాత ఇంటర్య్వూలను సేకరించడంతో పాటు బాలీవుడ్ ప్రముఖులు డానీ, కబీర్‌బేడి, మహేష్భట్లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేశారు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అనే భయంతో మొదట మాట్లాడడానికి నిరాకరించారు చాలామంది. వారిని ఒప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. సినిమా వ్యక్తులనే కాదు అహ్మదాబాద్‌లో బాబీ చదివిన కాలేజికి వెళ్లారు. ఆమెకు పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడారు. కెరీర్ మొదలైన రోజుల్లో బాబీ నటించిన ‘చరిత్ర’ కమర్శియల్ సినిమా ఏమీ కాదు. ఒక బాధిత యువతి పాత్రలో ఇందులో నటించింది. ‘ఇందులో నటించిన అమ్మాయికి గర్వం తలకెక్కపోతే భవిష్యత్‌లో మంచి నటి అవుతుంది’ అని రాసింది ఒక పత్రిక. ఆమెకు గర్వం తలకెక్కిందా లేదా అనేది వేరే విషయంగానీ, బాలీవుడ్‌ను ఊపేసిన కథానాయికగా ఎదిగింది. గ్లామర్‌డాల్‌గా మాత్రమే సుపరిచితమైన బాబీలో మరోకోణం...ఆమె గుడ్ స్టూడెంట్. మంచి చదువరి. రచనలు చేస్తుంది. పెయింటింగ్స్ వేస్తుంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు బానిస కావడమే ఆమె మానసిక సమస్యలకు కారణమనే వాదాన్ని కరిష్మ ఖండిస్తారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లు అపోహలు, వాస్తవాలను వేరు చేసే క్లోజప్ వెర్షన్ ఈ పుస్తకం. -
ఈ పుస్తకమంటే శ్రియాకు ఎంతో ఇష్టమట
‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఆమెకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటి ది ఎనార్కి. ‘వైట్ మొగల్’ ‘ది లాస్ట్ మొగల్’...మొదలైన పుస్తకాలతో పాఠకుల ఆదరణ పొందిన స్కాటిష్ చరిత్రకారుడు, రచయిత, కళా విమర్శకుడు విలియం డాల్‌ర్లింపుల్ రాసిన పుస్తకం ఇది. ఈస్టిండియా కంపెనీపై రాసిన ‘ది ఎనార్కి’ పరిచయం సంక్షిప్తంగా.... ఈస్టిండియా కంపెనీపై రాసిన పుస్తకం అనగానే కలిగే తొలి సందేహం...అసలు కొత్తగా రాయడానికి ఏముంది? రాజకీయ, ఆర్థిక, సైనిక కోణాలలో చాలామంది రాశారు కదా! అని. ‘నా ఉద్దేశం కంపెనీ సంపూర్ణచరిత్ర తెలియజేయడం కాదు. కంపెనీ వ్యాపారదక్షతకు సంబంధించిన ఆర్థికవిశ్లేషణ కూడా కాదు. రాజకీయాలు, పాలనతో ఏమాత్రం సంబంధం లేని ఒక కంపెనీ అత్యంత బలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా మట్టికరిపించగలిగింది? వినయవిధేయతలు ఉట్టిపడే కంపెనీగా ప్రవేశించి సామ్రాజ్యవాదశక్తిగా ఎలా ఎదిగింది? అనే కోణంలో రాసిన పుస్తకం’ అంటాడు రచయిత. 1599లో కంపెనీ పుట్టుక నుంచి పుస్తకం మొదలవుతుంది. ‘భారతదేశ«ం నుంచి ఇంగ్లిష్ భాషలోకి చేరిన తొలి పదం...లూట్’ అనే ఒకేవాక్యంలో ఎన్నో విషయాల సారం చెప్పాడు డాల్‌ర్లింపుల్. క్వీన్ ఎలిజబెత్1 బ్రిటీష్ రాణిగా ఉన్న కాలంలో 1600లో ఈస్టిండియా కంపెనీ ఆసియాలోకి అడుగుపెట్టింది. తమ కంపెనీలో పనిచేయడం, తమ వస్తువును కొనడంపై మోజు పెంచింది. వ్యాపారపరమైన ఏకఛత్రాధిపత్యంతో పాటు ఇతర విషయాలలోనూ దాని జ్యోకం పెరిగింది. వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉన్న కంపెనీకి రాజకీయాలు అవసరమా? అనే విషయంలో బ్రిటీష్ పార్లమెంట్లో వాడివేడిగా చర్చ జరిగింది. ఈస్టిండియా వైఖరిని బ్రిటీష్ పత్రికలు ఘాటుగా విమర్శించాయి. భారతదేశంలో ఈస్టిండియా పాలనను క్రమబద్ధీకరిస్తూ పార్లమెంట్లో రెగ్యులెటింగ్ చట్టం కూడా చేశారు. భారతఉపఖండంలోని సంపన్నప్రాంతాలను కైవసం చేసుకున్న కంపెనీ మొగల్ పాలకులపై పాలనాధికారి పాత్ర పోషిచింది. కంపెనీ అనూహ్యంగా దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. బ్రిటీష్ వారిపై తిరగుబాటు నినాదం వినిపించడంలో పేరున్న సిరాజ్–ఉద్–దౌలా గురించి భిన్నమైన స్వరం వినిపిస్తుంది. ‘ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఉర్దూ, బెంగాలీలలో సిరాజ్ గురించి గట్టి ఆధారాలు దొరుకుతాయి. అతడి గురించి చెప్పుకోవడానికి ఒక్క మంచి పదం దొరకదు’ అంటాడు రచయిత. ప్లాసీ యుద్ధం తరువాత ఈస్డిండియా కంపెనీ అత్యంత సంపన్న శక్తిగా ఎలా ఎదిగింది? మొఘల్ సామ్రాజ్యానికి షా అలం పేరుకు మాత్రమే రాజు ఎందుకు అయ్యాడు? అతడిని ‘చదరంగ రాజు’ అని మరాఠాలు, బెంగాల్ నవాబులు వెక్కిరించడానికి కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు పుస్తకం సమాధానం చెబుతుంది. ఈ పుస్తకంలో బాగా ఆసక్తి కలిగించే ఘట్టం గులామ్ ఖదీర్. ఇతడి తండ్రి ఢిల్లీపై పోరాడి ఓడిపోతాడు. పదిసంవత్సరాల వయసులో ఖదీర్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు షా ఆలామ్. అందంగా, చురుగ్గా ఉండే ఈ బాలుడిపై మొగల్ పాలకుడికి ప్రత్యేక ప్రేమ. ‘నా ప్రత్యేకమైన కుమారుడు’ అని స్వయంగా ప్రకటిస్తాడు కూడా. అలాంటి కుమారుడు పెరిగి పెద్దయ్యాక కనివిని ఎరగని అరాచకాలకు ఎలా పాల్పడ్డాడు?...ఇవి పుస్తకంలో చదవాల్సిందే. ఎవరికీ తెలియని ఆధారాలను వెలికి తీసి రాసిన ఈ పుస్తకానికి ఇప్పటి వరకు ఈస్టిండియా కంపెనీపై వచ్చిన పుస్తకాల జాబితాలో తప్పకుండా ప్రత్యేక స్థానం ఉంటుంది. మై ఫెవరెట్ బుక్: ది ఎనార్కి రచన: విలియం డాల్‌ర్లింపుల్ -
చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై తన ఇష్టాన్ని చాటుకున్నాడు. మిగతా లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్ ఆడే సందర్భంలోనే తనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్లో చివరివరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకే ప్రాతినిధ్యం వహించడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. ‘నేను మీ ముందు ఒక్కటి అంగీకరించాలి. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) కన్నా కూడా ఐపీఎల్ సమయంలోనే నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడేటపుడు భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటాయి. గత ఆరు సీజన్లుగా కోల్‌కతాకే ప్రాతినిధ్యం వహిస్తున్నా. అక్కడి అభిమానుల ప్రేమ అనిర్వచనీయం. నేను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా... మూడో మ్యాచ్‌కు వారు నన్ను అదే రీతిలో స్వాగతిస్తారు. అందుకే నా చివరి మ్యాచ్ వరకు కేకేఆర్ జట్టుకే ఆడతా’ అని రసెల్ వివరించాడు. -
ఇప్పటికీ ఇంగ్లండ్ ఫేవరెటే: ఆసీస్ బౌలర్
లండన్: రెండు వరుస పరాజయాలు చవిచూసినంత మాత్రాన టైటిల్ రేసు నుంచి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తప్పుకోలేదని ఆస్ట్రేలియా పేసర్ జాసన్ బెహ్రాన్‌డార్ఫ్ అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఆసీస్ టైటిల్ వేటలో ముందంజలో ఉందన్నాడు. అయితే ఓటములు చెందినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనవేయడానికి వీల్లేదని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఆసీస్‌తో పాటు ఇప్పటికీ ఇంగ్లండ్ కూడా ఫేవరేట్ జట్టేనని తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నాడు. ‘అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు దక్కించుకోవడం అందులోనూ ప్రపంచకప్‌లో ఈ ఘనత అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచకప్ అరంగేట్రపు మ్యాచ్‌లో శ్రీలంకపై అంతగా రాణించకపోవడంతో నన్ను పక్కకు పెట్టారు. అయితే ఈ సమయంలో కృంగిపోకుండా జట్టులోకి ఎలా తిరిగి రావాలిన ఆలోచించాను. దేశం తరుపున ఆడే అవకాశం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని అనుకునే వాడిని. అవకాశం వచ్చింది. నా వంతు పాత్ర పోషించాను’అంటూ బెహ్రాన్‌డార్ఫ్ పేర్కొన్నాడు. మంగళవారం క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 64 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఇది మూడో ఓటమి. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్, పూర్వవైభవం లేక బలహీన పడ్డ శ్రీలంక జట్లపై ఓడిపోవడంతో పాటు తాజాగా ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడంతో ఆ జట్టుపై అంచనాలు తగ్గాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్లోనే ఓడిపోవడంతో గమనార్హం. చదవండి: ఆసీస్ విలాసం ఇంగ్లండ్ విలాపం మ్యాక్స్‌వెల్.. వెరీవెల్ -
టీనేజర్ల ఫేవరెట్ ఫేస్బుక్
ముంబై: టీనేజర్లకు, సోషల్ మీడియాకు విడదీయలేని బంధం. నవ యువతరానికి ఇదో వ్యాపకంగా మారింది. అయితే సోషల్ మీడియాలో టీనేజర్లు ఎక్కవుగా ఫాలో అయ్యేది ఫేస్బుక్. ట్విటర్‌ది గూగుల్ ప్లస్ తర్వాత మూడో స్థానం కావడం ఆశ్చర్యకరమైన విషయం. దేశ వ్యాప్తంగా 14 ప్రముఖ నగరాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 8 నుంచి 12వ తరగతుల వరకు చదివే 12365 మంది విద్యార్థులను ప్రశ్నించారు. దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఫేస్‌బుక్‌ను లైక్ చేస్తున్నట్టు చెప్పారు. 65 శాతం మంది గూగుల్ ప్లస్, 44.1 శాతం మంది ట్విటర్‌కు ఓటేశారు. 45.5 శాతం మంది విద్యార్థులు సోషల్ మీడియాను పూర్తిగా స్కూల్ అసైన్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. టీనేజర్లు చాలా వరకు వికీపీడియా, ఆన్లైన్ వీడియోస్, ఆన్లైన్ షాపింగ్..ఇక అప్లికేషన్లలో వాట్సప్‌ను వాడుతున్నట్టు చెప్పారు.