టీనేజర్ల ఫేవరెట్ ఫేస్బుక్
ముంబై: టీనేజర్లకు, సోషల్ మీడియాకు విడదీయలేని బంధం. నవ యువతరానికి ఇదో వ్యాపకంగా మారింది. అయితే సోషల్ మీడియాలో టీనేజర్లు ఎక్కవుగా ఫాలో అయ్యేది ఫేస్బుక్. ట్విటర్ది గూగుల్ ప్లస్ తర్వాత మూడో స్థానం కావడం ఆశ్చర్యకరమైన విషయం.
దేశ వ్యాప్తంగా 14 ప్రముఖ నగరాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 8 నుంచి 12వ తరగతుల వరకు చదివే 12365 మంది విద్యార్థులను ప్రశ్నించారు. దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఫేస్బుక్ను లైక్ చేస్తున్నట్టు చెప్పారు. 65 శాతం మంది గూగుల్ ప్లస్, 44.1 శాతం మంది ట్విటర్కు ఓటేశారు. 45.5 శాతం మంది విద్యార్థులు సోషల్ మీడియాను పూర్తిగా స్కూల్ అసైన్మెంట్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. టీనేజర్లు చాలా వరకు వికీపీడియా, ఆన్లైన్ వీడియోస్, ఆన్లైన్ షాపింగ్..ఇక అప్లికేషన్లలో వాట్సప్ను వాడుతున్నట్టు చెప్పారు.