టాటా సన్స్ మాజీ చైర్మన్, భారతీయ పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా (86) బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి వార్త విని వ్యాపార దిగ్గజాలే కాకుండా సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. పరోపకారి, మూగజీవాల ప్రేమికుడు కూడా. కేవలం సంపదను సృష్టించడమే కాకుండా ఎన్నో దాతృత్వ సేవలతో అందరి మనుసులను దోచుకున్న మహనీయుడు. నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త. అలాంటి గొప్ప వ్యక్తి ఇక మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు. ఇంట్లో వండిన ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే ఆయన తన సోదరి చేసే సంప్రదాయ వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అయితే రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయనే ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.
పర్వేజ్‌కు టాటా పరిశ్రమలతో దీర్థకాల అనుబంధం ఉంది. అంతలా పర్వేజ్ రతన్‌టాటాకు ఇష్టమైన చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముంబైలో పుట్టి పెరగిన పర్వేజ్ ప్రస్థానం గ్యారెజీ రెస్టారెంట్ నుంచి మొదలయ్యింది. తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది. మొదట్లో అతడి రెస్టారెంట్ మోటార్ సైకిల్ గ్యారెజ్ వాళ్లకు పేరుగాంచింది.
కాలక్రమేణ పార్సీ ఆహార ప్రియులకు హాట్‌స్పాట్‌గా మారింది. సాంప్రదాయ పార్సీ వంటకాలపై పర్వేజ్‌కి ఉన్న ప్రావీణ్యం టాటా గ్రూప్‌తో సహా పలువురిని ఆకర్షించింది. అలా ఆయన టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్‌లో వంటలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన వ్యక్తిగత చెఫ్‌గా మారాడు. అంతేగాదు ఒక ఇంటర్వ్యూలో పర్వేజ్ రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమని తెలిపాడు. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం తదితారాలంటే ఫేవరెట్ ఫుడ్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక పర్వేజ్ వివిధ నగరాల్లో పార్సీ వంటకాలను అందించారు. అలాగే ఐటీసీ ఫుడ్ ఫెస్టివల్స్‌లో భాగంగా చాలామందికి పార్శీ సంప్రదాయ ఆహారాన్ని పరిచయం చేశారు.
(చదవండి: ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!)
Comments
Please login to add a commentAdd a comment