ఇటీవల టీమిండియా టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్‌లో దక్కించుకున్న విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆటగాళ్లను ప్రత్యేకంగా కలిసి మరీ అభినందించారు. 13 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి కూడా. ఈ సందర్భంగా మైదానంలో విధ్వంసరకర బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించే భాతర దిగ్గజ ఆటగాళ్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఏంటో సివివరంగా తెలుకుందామా..!
విరాట్ కోహ్లీ: మైదానం విరాట్ సంచలనం. అలాంటి వ్యక్తి హెల్స్ పట్ల చాలా కాన్షియస్‌తో ఉంటాడు. అలాగే అతని ఆహారశైలి పౌష్టికరమైనది, చాలా స్ట్రిట్‌గా వ్యవసహరిస్తాడు. విరాట్‌కి తరుచుగా జపనీస్ వంటకాలను ఇష్టపడుతుంటాడు. అతనికి చేపలంటే ఇష్టం. ఒక మంచి చోలే భాతురే, సంప్రదాయ పంజాబీ వంటకాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాడు.
సచిన్ టెండూల్కర్: ఆయనకి సీఫుడ్ అంటే మహా ఇష్టం. ఈ లెజెండరీ క్రికెటర్‌కి సీఫుడ్ అంటే మహా ఇష్టం. తీరప్రాంత నగరమైన ముంబైలో పెరిగిన సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్‌ఫేవరెట్ డిష్ రొయ్యల కూర. అతను దీన్ని వేడి అన్నంలో ఇష్టంగా తీసుకుంటాడు.
ఎంఎస్ ధోని: చాలా కూల్‌గా వ్యవహరించే ధోని ఇంట్లో వండే భోజనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. అతడు కతియావాడి వంటకాలను ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇష్టమైన వంటకం ఖిచ్డీ కధీ.
హార్దిక్ పాండ్య: డైనమిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్ వివిధ రకాల వంటకాలను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడా. అయితే అతడు ప్రత్యేకంగా ఇష్టపడి తినే ఫుడ్ ఐటెం చీజ్ పావ్ భాజీ.
రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్‌గా పిలుచుకునే హార్డ్‌కోర్ బ్యాట్స్ మ్యాన్ రోహిత్ శర్మకు స్వీట్స్ అంటే మహా ప్రీతి. అతనికి ఇష్టమైన స్వీట్ క్లాసిక్ రసగుల్లా, స్టఫ్డ్ బ్రెడ్ , ఆలు పరాఠా వంటివి ఇష్టంగా ఆస్వాదిస్తాడు.
కేఎల్ రాహుల్: స్టైలిష్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన కేఎల్ రాహుల్, దక్షిణ భారత వంటకాలకు ప్రాధాన్యత ఇస్తాడు. కర్నాటకలో పెరిగిన అతను బిసి బేలే బాత్ అంటే మహా ఇష్టం. అలాగే టాంగీ రైస్ డిష్ రాహుల్‌కి ఆల్ టైం ఫేవరెట్ ఫుడ్.
జస్ప్రీత్ బుమ్రా: ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చికెన్ బిర్యానీని మహా ఇష్టం. ఒక ఇంటర్యూలో సైతం దీన్ని చీట్‌మీల్‌గా భావించి ఇష్టంగా ఆరగిస్తానని చెప్పాడు కూడా.
శిఖర్ ధావన్: ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్‌కు ఉత్తర భారత వంటకాలంటే అమితమైన ప్రేమ. అతనికి ఇష్టమైన వంటకం బటర్ చికెన్. ఇది పంజాబీ వంటకాల్లో ప్రముఖంగా ఉండే రిచ్ క్రీము చికెన్ కర్రీ.
(చదవండి: అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!)
Comments
Please login to add a commentAdd a comment