
జైపూర్ : నగరాల్లోని బస్టాప్‌ల్లో, కూడళ్లలో అప్పడాలు, పిండివంటలు అమ్ముకుంటూ చాలామంది కనిపిస్తారు. వారిని చాలామంది పట్టించుకోరు. అవసరముంటే వారి వద్దకు వెళ్లి కొంటారు. అంతే.. కానీ జైపూర్‌లో ఇలా అప్పడాలు అమ్మిన ఓ వ్యక్తి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. పాత్రలో ఒదిగిపోయిన అతని ఫొటోలు చూసి నెటిజన్లు విస్మయపోతున్నారు.
ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే.. బాలీవుడ్ గ్రీకుదేవుడు హృతిక్ రోషన్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘సూపర్ 30’.. బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా వికాస్ బల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హృతిక్ ఇలా ఎవరూ గుర్తుపట్టనంతగా మారిపోయి.. జైపూర్‌లోని కూడళ్లలో సైకిల్ మీద అప్పడాల బుట్ట పెట్టుకొని.. వీధి, వీధి తిరిగి అమ్మాడు. సైకిల్ మీద అప్పడాలు అమ్ముతూ అతను వీధుల్లో తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు. తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఈ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. పాత్రలోకి సంపూర్ణంగా లీనమై నటించడంలో హృతిక్‌కు హృతికే సాటి అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment