‘ఈ పాపడ్‌తో కరోనా పరార్‌’ | Union Minister Launches Bhabhi Ji Papad | Sakshi
Sakshi News home page

భాబీజీ పాపడ్‌ను లాంఛ్‌ చేసిన కేంద్ర మంత్రి

Published Fri, Jul 24 2020 1:22 PM | Last Updated on Fri, Jul 24 2020 1:56 PM

Union Minister Launches Bhabhi Ji Papad - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను భాబీజీ పాపడ్‌ పారదోలుతుందని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ అన్నారు. ఈ పాపడ్‌ను ఆయన మార్కెట్‌లో ప్రవేశపెడుతున్న వీడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మేఘ్వాల్‌ కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో మేఘ్వాల్‌ భాబీజీ పాపడ్‌ను చూపుతూ కనిపించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ప్రేరేపించేందుకు ఊతమిచ్చేలా ఈ ఉత్పత్తిని పాపడ్‌ తయారీదారులు ప్రజల ముందుకుతీసుకువచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ఉత్పత్తిని చేపట్టిన తయారీదారులను తాము అభినందిస్తున్నామని ప్రశంసించారు. తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు చెందిన కంపెనీ పేర్కొంది . కాగా, మహమ్మారిపై పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌పై సుమోటోగా చర్యలు చేపట్టాలని ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఓ నెటిజన్‌ కోరారు. చదవండి : కోవిడ్‌-19 : మార్కెట్‌లోకి సిప్లా ఔషధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement