Arjun Ram Meghwal
-
ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నా: మేఘ్వాల్
కోల్‌కతా: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయని గుర్తుచేశారు. ఆదివారం కోల్‌కతాలో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోలో యూసీసీని ప్రస్తావించామని ఆయన గుర్తు చేశారు. -
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కి మరోసారి జాక్‌పాట్!
రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానానికి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను భారతీయ జనతా పార్టీ వరుసగా మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానానికి ఆయన పోటీ చేయడం ఇది వరుసగా నాలుగోసారి. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత బికనీర్ చేరుకున్న మేఘ్వాల్కు పార్టీ మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. మేఘ్వాల్ 2009లో తొలిసారిగా బికనీర్ నియోజకవర్గం నుండి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు . 2019 లోక్‌సభ ఎన్నికల్లో అర్జున్ రామ్ మేఘ్వాల్ తన బంధువు, కాంగ్రెస్ నాయకుడు మదన్ గోపాల్ మేఘ్వాల్ను ఓడించి బికనీర్ స్థానాన్ని గెలుచుకున్నారు . తనపై నమ్మకం ఉంచి నాలుగోసారి సీట్ ఇచ్చినందుకు అర్జున్ రామ్ మేఘ్వాల్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు, ఒక పారాలింపియన్ ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మహేంద్రజిత్ మాల్వియా, జ్యోతి మిర్ధాలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, సిట్టింగ్ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు కూడా పార్టీ ఝలావర్ బరన్ నుంచి మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. -
దేశాన్ని విడదీసే కుట్రలు సాగనివ్వం
న్యూఢిల్లీ: గోమూత్ర రాష్ట్రాలు అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బుధవారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించాయి. అధికార బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటలకు సభకు పునఃప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సెంథిల్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు ఆమోదిస్తున్నారా? అని నిలదీశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశంగా విడదీసే కుట్రలను సాగనివ్వబోమని తేలి్చచెప్పారు. సెంథిల్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని మేఘ్వాల్ డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని, దేశం పట్ల వారి తీర్పును వెలువరించారని అన్నారు. టీఆర్ బాలు స్పందిస్తూ.. సెంథిల్ కుమార్ అలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. సెంథిల్‌ను తమ ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారని తెలిపారు. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు. సభలో సెంథిల్ కుమార్ క్షమాపణ తను వ్యాఖ్యల పట్ల డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం లోక్‌సభలో క్షమాపణ కోరారు. ప్రజల మనోభావాలను గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అనుకోకుండానే ఈ మాట ఉపయోగించానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని సెంథిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఆయన మంగళవారం క్షమాపణ కోరుతూ ‘ఎక్స్’లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని కించపర్చే కుట్ర ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ సంస్కృతిని, గుర్తింపునకు కించపర్చేందుకు కుట్ర పన్నిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు అన్వేíÙంచకుండా దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కుయుక్తులు సాగిస్తోందని ధ్వజమెత్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాతే ఉత్తర–దక్షిణ భారతదేశం అనే విభజనను తెరపైకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. -
రాజస్తాన్‌లో అప్పుల భారం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
జైపూర్: రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారం పెంచిందని∙కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణ రిలీఫ్ క్యాంపుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆక్షేపించారు. రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జీడీపీ దారుణంగా పడిపోయిందని మంత్రి మేఘ్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, దుష్పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని, నేరాలు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. చదవండి: ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
బిల్లు ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి రామ్ మెఘ్వాల్
-
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జూలై 5న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. జస్టిస్ ఠాకూర్ ప్రస్తుతం బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. -
యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి. ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
కేంద్ర కేబినెట్లో మార్పులు.. కిరణ్ రిజిజుకు షాకిచ్చిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ను నియమించారు. కిరన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు. కాగా అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. చదవండి: Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్ కన్నుమూత -
2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్
మాదాపూర్: ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుందని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ అన్నారు. మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మనదేశం నెంబర్‌వన్‌గా నిలుస్తుందన్నారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయన పట్టాలను అందజేశారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు నిర్వహించే జీ–20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిన్ మిత్రా మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన సీఏ ఉత్తీర్ణులైన విద్యా ర్థుల్లో 42% మహిళలే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ఐసీఏఐ కౌన్సిల్ సభ్యులు శ్రీధర్ ముప్పాల, ప్రతినిధులు సుశీల్‌కుమార్ గోయల్, ప్రసన్నకు మార్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
పాపడాలు తినమన్న మంత్రికి కరోనా
న్యూఢిల్లీ: పాపడ్ తింటే కరోనా పోతుందని ఉచిత సలహా ఇచ్చి విమర్శలపాలైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇప్పుడదే వైరస్ బారిన పడ్డారు. శనివారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తనకు కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. మొదటి సారి నెగెటివ్ వచ్చినప్పటికీ రెండోసారి చేసిన పరీక్షలో పాజిటివ్ వచ్చిందన్నారు. తనను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. (మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్) కాగా అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఆయన.. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ కంపెనీ తయారు చేసిన పాపడ్ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి అమాంతం పెరిగి కరోనాను పోగొడుతుందంటూ మాట్లాడిన ఓ వీడియో గతంలో విపరీతంగా వైరల్ అయింది. ఇదిలా వుండగా మరో కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి కూడా కరోనా బారిన పడ్డారు. (నవనీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్) చదవండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’ -
భాబీజీ పాపడ్‌ను లాంఛ్ చేసిన కేంద్ర మంత్రి
-
‘ఈ పాపడ్‌తో కరోనా పరార్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను భాబీజీ పాపడ్ పారదోలుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఈ పాపడ్‌ను ఆయన మార్కెట్లో ప్రవేశపెడుతున్న వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేఘ్వాల్ కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో మేఘ్వాల్ భాబీజీ పాపడ్‌ను చూపుతూ కనిపించారు. ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ప్రేరేపించేందుకు ఊతమిచ్చేలా ఈ ఉత్పత్తిని పాపడ్ తయారీదారులు ప్రజల ముందుకుతీసుకువచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఉత్పత్తిని చేపట్టిన తయారీదారులను తాము అభినందిస్తున్నామని ప్రశంసించారు. తమ ప్రోడక్ట్‌లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు చెందిన కంపెనీ పేర్కొంది . కాగా, మహమ్మారిపై పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అర్జున్‌రామ్ మేఘ్వాల్పై సుమోటోగా చర్యలు చేపట్టాలని ఈ వీడియోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ కోరారు. చదవండి : కోవిడ్-19 : మార్కెట్లోకి సిప్లా ఔషధం -
ఉత్సాహంగా ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’
-
ఇప్పటివరకు 1317 కుటుంబాలకు మాత్రమే పునరావాసం..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 56,495 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఇప్పటివరకు 1317 ఎస్టీ కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం రాజ్యసభకు తెలిపారు. పోలవరం నిర్వాసిత ఎస్టీ కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు జాతీయ ఎస్టీ కమిషన్ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక వాస్తవమేనా అని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. అదే విధంగా పునరావాసం కల్పించిన కుటుంబాలకు సేద్యానికి పనికిరాని భూములు పంపిణీ చేశారా, దీని ద్వారా వారు జీవనోపాధి కోల్పోయిన విషయం వాస్తవం కాదా అనే ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులైన ఎస్టీ కుటుంబాలకు సేద్యానికి యోగ్యమైన భూములనే పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మేఘవాల్ పేర్కొన్నారు. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులైన గిరిజనులు అనే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ ప్రత్యేక నివేదిక రూపొందించింది వాస్తమేనని మంత్రి అంగీకరించారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం, రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలను ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలిపారు. నిర్వాసిత గిరిజన కుటుంబాలకు సాగు యోగ్యమైన భూముల పంపిణీ, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ప్రాజెక్టు ప్రారంభానికి ముందుగానే ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాని అందజేసిన నివేదికలో సిఫార్సు చేసిందని అన్నారు. ఆర్ అండ్ ఆర్ పనుల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని వెల్లడించారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సమీక్షపై కమిటీ.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనల సడలింపు అంశాన్ని సమీక్షించి, పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబిచ్చారు. సీఆర్‌జెడ్ కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, భాగస్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తీర ప్రాంతం కలిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్ళను ఈ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. 2018లో విడుదల చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ముసాయిదా ప్రకటనలో ఏపీ తీర ప్రాంతాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు. -
పోలవరం పనుల్లో అక్రమాలు నిజమే : కేంద్రమంత్రి
న్యూ ఢిల్లీ : పోలవరం కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తోపాటు కాగ్ నివేదిక నిర్ధారించిన విషయం వాస్తవమేనని జల వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అంగీకరించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చెల్లింపులను వారి నుంచి తిరిగి రాబట్టాలని కూడా పీపీపీ సూచించిందని మంత్రి తెలిపారు. ఈ అక్రమ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ, త్వరితగతిన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయించే హడావిడిలోనే భూ సేకరణ, స్టీల్ కొనుగోలుతోపాటు మరికొన్ని పనులలో ఆయా కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపినట్లు తెలిపిందని చెప్పారు. అక్రమంగా చేసిన చెల్లింపు మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసినట్లుగా తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్ట్‌ను ఏదైనా కంపెనీకి లబ్ది చేకూర్చే విధంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ వ్యవహరించిందా అన్న మరో ప్రశ్నకు.. మంత్రి మేఘ్వాల్ జవాబిస్తూ 2016 సెప్టెంబర్ 16న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరపున పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టినట్లు తెలిపారు. కాబట్టి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ కాంట్రాక్టులైనా ఇచ్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 62.16 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనుల నాణ్యతను పనులు ప్రారంభమైనప్పటి నుంచి ధవళేశ్వరంలోని క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే పనుల నాణ్యతను మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్‌తో పీపీఏ ఒక అవగాహన కుదుర్చుకుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ఒక లక్షా 5 వేల 601 కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని, అందులో ఇప్పటి వరకు 3 వేల 922 నిర్వాసిత కుటుంబాలకు కొత్తగా నిర్మించిన 26 పునరావాస కాలనీల్లో ఆశ్రయం కల్పించామని మంత్రి వివరించారు. -
జీఎస్టీ.. కాస్త టైమ్ పడుతుంది: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వ్యవస్థకు పుల్ స్టాప్ పెడుతూ ఒక దేశం ఒక పన్ను విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్-జీఎస్టీ) జూలై 1 నుంచి అమలులోకి తెచ్చింది. సత్ఫలితాల మాట ఏమోగానీ గందరగోళంగా ఉందంటూ ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొత్త కోడలు లాంటి జీఎస్టీ అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో నారెడ్కో(NAREDCO) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కోసమే జీఎస్టీని మోదీ సర్కార్ తీసుకొచ్చిందని తెలిపారు. ‘కొత్తగా ఓ కుటుంబంలోకి వచ్చిన కోడలికి సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుంది. తర్వాతే ఆ కుటుంబం అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అలాగే జీఎస్టీ కూడా దేశానికి కొత్త కోడలు లాంటిదే. ఆర్థిక పురోగతి కోసమే సరైన సమయంలో జీఎస్టీని కేంద్రం తీసుకొచ్చింది. దాని ఫలితం మున్ముంది కనిపిస్తుంది’ అని అర్జున్ రామ్ తెలిపారు. జీఎస్టీ గురించి ప్రజలకు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని ఎస్బీఐ మేనేజింగ్ డైరక్టర్ రజనీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. నోట్ల రద్దుతో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన కేంద్రం జీఎస్టీతో ఈ యేడాది మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్టీతో పరోక్షంగా ప్రజలపై భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో అది ఎక్కువగా ఉండబోతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు చేసిన పలు సూచనలను జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అర్జున్ రామ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
చలామణిలో 86 శాతం నగదు
► లోక్‌సభలో కేంద్రం వెల్లడి ► రాజ్యసభలో సుష్మపై రెండు హక్కుల తీర్మానం నోటీసులు న్యూఢిల్లీ: నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ ఏడాది జూలై 21 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉందని లోక్‌సభకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిమాండ్‌కు సరిపడా కరెన్సీ నోట్లను సరఫరా చేసేందుకు ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మరోవైపు ఎల్పీజీ సిలిండర్లపై నెలవారీ రూ. 4 పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదురీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సబ్సిడీ ఎత్తివేస్తున్నారని, ఒక్కసారిగా 18 కోట్ల మంది ఎలా ధనవంతులుగా మారిపోతారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కశ్మీర్లోకి పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగినా.. వాటిని దీటుగా తిప్పికొడుతున్నామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. కాగా, రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి కాదని రాజ్యసభకు కేంద్రం తెలిపింది. సుష్మ సభను తప్పుదారి పట్టించారు: కాంగ్రెస్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభను తప్పుదారి పట్టించారంటూ రాజ్యసభలో కాంగ్రెస్ రెండు సభా హక్కుల తీర్మానం నోటీసులు అందచేసింది. ఆగస్టు 3న విదేశాంగ విధానంపై చర్చ సందర్భంగా సుష్మ సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. బాండుంగ్‌లో ఆఫ్రో–ఆసియన్ సదస్సులో నెహ్రూ పేరును ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. సదస్సులో భారత్ తరఫున ఎవరూ మాట్లాడలేదని సుష్మ అబద్ధమా డారంది. మోదీ లాహోర్ పర్యటన అనంతరం దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరగలేదంటూ సుష్మ సభను తప్పుదారి పట్టించారని మరో హక్కుల తీర్మానం నోటీసును కాంగ్రెస్ అందజేసింది. -
ఎన్పీఏలుగా ప్రకటనకు గడువు పెంపు!
న్యూఢిల్లీ: ఎన్పీఏలుగా ప్రకటించేందుకు ప్రస్తుతమున్న 90 రోజుల కాల వ్యవధిని మరింత పెంచాలన్న అభ్యర్థనను ఆర్బీఐ పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ ప్రతిపాదన తమకు అందిందని, అది ప్రస్తుతం ఆర్బీఐ పరిశీలనలో ఉన్నట్టు ఓ వార్తా సంస్థకు చెప్పారు. ప్రతిపాదన ఎవరినుంచి వచ్చిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఓ రుణానికి సంబంధించి వరుసగా మూడు నెలల పాటు (90 రోజులు) వాయిదాలు చెల్లించకపోతే దాన్ని మొండి బాకీ (ఎన్పీఏ)గా వర్గీకరించాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థల నుంచి చెల్లింపులు ఆలస్యంగానే వస్తుంటాయి. ఒక్కసారి చెల్లింపుల్లో ఈ గడువు దాటితే వీటికిచ్చిన రుణాలు ఎన్పీఏలుగా మారడం, ఆ తర్వాత వాటికి రుణాలు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ఆర్బీఐ గడువు పెంచితే చిన్న, మధ్య స్థాయి సంస్థలకు ఉపశమనం లభించనుంది. కాగా, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే చర్యల్లో భాగంగా రుణాల పునరుద్ధరణకు ప్రస్తుతమున్న యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు. -
చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?
ఆయన స్వయానా కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అంతటి పెద్దమనిషి తన సొంత రాష్ట్రంలో.. తన సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. అదేంటి, మంత్రిగారు చెట్టు ఎక్కడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే చదవండి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ ఆయన నియోజకవర్గం బికనీర్. ఆ నియోజవకర్గం పరిధిలోని ఢోలియా అనే గ్రామంలో కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దాంతో సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిద్దామని కేంద్రమంత్రి మేఘ్వాల్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జేబులోంచి సెల్‌ఫోన్ తీశారు. కానీ తీరాచూస్తే అందులో సిగ్నల్ ఒక్క పాయింటు కూడా లేదు. ఇదేంటని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, ఈ గ్రామంలో సెల్‌ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పారు. అదేంటని అడిగితే.. దగ్గరలో సెల్‌టవర్ లేదని, అందువల్ల చెట్టు ఎక్కితే దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని వివరించారు. చేసేది లేక తాను కూడా చెట్టు ఎక్కడానికి మేఘ్వాల్ సిద్ధపడ్డారు. అయితే పెద్ద వయసు కావడంతో ఆయన కోసం వెంటనే అక్కడున్నవాళ్లు ఒక నిచ్చెన తెప్పించారు. దాని సాయంతో ఆయన చెట్టెక్కి, ఫోన్ మాట్లాడి అప్పుడు కిందకు వచ్చారు. అదీ కేంద్ర మంత్రి గారి చెట్టు కథ. -
చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?
-
ప్లాస్టిక్ నోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి, వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లయితే ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు ప్రస్తుతమున్న నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా నోట్ల జీవితకాలం పెంచాలన్నది వాటి లక్ష్యం. -
ఒక్కో నోటు ప్రింటింగ్ ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కొత్తగా చెలామణిలోకి తెచ్చిన కరెన్సీ నోట్ల ముద్రకు ఎంత ఖర్చవుతుందో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాత రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రెండు వేల రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక కూ. 500 నోటు ముద్రించడానికి రూ.2.87 నుంచి రూ. 3.09 ఖర్చవుతోందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. రెండు వేల రూపాయల నోటు ముద్రించేందుకు ఒక్కోదానికి రూ.3.54 నుంచి రూ. 3.77 వ్యయమవుతోందని తెలిపారు. ఒక్కో కొత్త నోటు ముద్రణకు ఎంత ఖర్చవుతుందని అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు. అయితే కొత్త రూ. 500, రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు మొత్తం ఎంత ఖర్చు అయిందో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. ఇంకా రూ. 500, రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ కొనసాగుతుందని, మొత్తం ఖర్చు వ్యయం గురించి ఇప్పుడు తెలపడం సముచితం కాదని అన్నారు. కొత్త నోట్ల ముద్రణ నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. -
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద 6.4 టన్నుల సేకరణ
గోల్డ్ డిపాజిట్ (మోనిటైజింగ్) స్కీమ్ కింద ప్రభుత్వం 6.4 టన్నుల పసిడిని సేకరించినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇళ్లు, దేవాలయాలు, సంస్థల్లో ఉపయోగించకుండా ఉన్న పసిడిని తిరిగి మార్కెట్లోకి తీసుకుని వచ్చి, వినియోగంలోకి తీసుకురావడం, దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికింద 2017 ఫిబ్రవరి 17 నాటికి 6,410 కేజీల పసిడిని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ధర ప్రకారం సేకరించిన బంగారం విలువ రూ.1,850 కోట్లు. 2015 నవంబర్లోనే ప్రకటించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రకారం ఇప్పటివరూ ఏడు విడతల బాండ్స్ జారీ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో నకిలీ బంగారం... 2016 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడచిన నాలుగేళ్లలో ఢిలీవిమానాశ్రమంలో పట్టుబడిన పసిడిలో 91 కేజీలు నకిలీదిగా గుర్తించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఢిల్లీ కస్టమ్స్ వాలెట్లో ఉంచిన 1,681.60 కేజీల్లో 91 కేజీలను కల్తీదిగా గుర్తించినట్లు వివరించారు. స్మార్ట్‌ఫోన్‌తో పన్ను చెల్లింపులు! స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పాన్ నంబరు అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై కసరత్తు చేస్తోంది. అలాగే ఆన్లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్ మొదలైన సదుపాయాలకు ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభలో ఈ విషయాన్ని తెలిపారు. సీఎస్ఆర్ నిబంధనల ఉల్లంఘనలకు నోటీసులు కంపెనీల చట్టాల ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్ఆర్) నిబంధనలను ఉల్లంఘించిన 1,018 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. మూడు సంవత్సరాల వార్షిక సగటు నికర లాభంలో కనీసం 2 శాతాన్ని లాభదాయక కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాలకు వినియోగించాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘క్లీన్ మనీ’కి 8.38 లక్షల మంది జవాబు పెద్ద నోట్ల రద్దు అనంతరం అనుమానాస్పద డిపాజిట్ల పరిశోధన బాటలో చేపట్టిన ‘క్లీన్ మనీ’ పథకం కింద 18 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ ఎస్ఎంఎస్/ఈ మెయిల్ ప్రశ్నలను పంపితే, వారిలో 8.38 లక్షల మంది సమాధానం పంపినట్లు మంత్రి గంగ్వార్ లోక్‌సభలో తెలిపారు. మిగిలిన వారిపై తగిన చర్యలకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు.