కృష్ణా పుష్కరాల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్ వాల్ విజయవాడలోని దుర్గాఘాట్కు వచ్చారు.
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్ మేఘ్ వాల్ విజయవాడలోని దుర్గాఘాట్కు వచ్చారు. కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించామని చెప్పారు. హోదానా లేక ప్యాకేజీనా అనేది త్వరలో ప్రకటిస్తామని మేఘ్ వాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రం అని అన్నారు.