durgha ghat
-
నిర్లక్ష్యం తగదు : జేసీ
విజయవాడ (వన్‌టౌన్) : పుష్కర విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని జేసీ గంధం చంద్రుడు అధికారులకు సూచించారు. దుర్గాఘాట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. తరువాత మెడికల్ సెంటర్‌ను, పిండ ప్రదానాల చేస్తున్న పరిసరాలను పరిశీలించి వివిధ స్థాయిల అధికారులతో పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. చివరి మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తూ పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. -
దుర్గాఘాట్‌ను పరిశీలించిన అడిషనల్ డీజీపీ
విజయవాడ (వన్‌టౌన్) : పుష్కరాల్లో భాగంగా దుర్గాఘాట్‌ను అడిషనల్ డీజీపీ ఎన్.సురేంద్రబాబు శనివారం ఉదయం పరిశీలించారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాట్‌లో భద్రతా పరమైన అంశాలపై ఆరాతీశారు. సీఎం, ఇతర ప్రముఖులు కంట్రోల్‌రూమ్‌కు వచ్చి వెళ్తున్నందున పరిసరాలన్నింటినీ జాగ్రత్తగా చూడాలంటూ సూచించారు. అనంతరం దుర్గాఘాట్–1, దుర్గాఘాట్–2 విభాగాలను పరిశీలించారు. ఘాట్ అధికారి రవీంద్రనా«ద్‌బాబు తదితరులు ఉన్నారు. -
'ఏపీ మాకు చాలా ముఖ్యమైన రాష్ట్రం'
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్ వాల్ విజయవాడలోని దుర్గాఘాట్‌కు వచ్చారు. కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించామని చెప్పారు. హోదానా లేక ప్యాకేజీనా అనేది త్వరలో ప్రకటిస్తామని మేఘ్ వాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రం అని అన్నారు. -
దుర్గాఘాట్‌పై దృష్టి పెట్టండి
అధికారులకు మంత్రి ఉమా ఆదేశాలు వసతుల కల్పనలో అలసత్వంపై కమిషనర్ ఆగ్రహం విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గాఘాట్‌లో పుష్కర పనులపై మంత్రులు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ శుక్రవారం దుర్గాఘాట్‌ను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించగా, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఘాట్ పనులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దుర్గాఘాట్ పరిస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన ‘అదిగో పుష్కరం... ఎప్పటికీ పరిష్కారం?’ కథనానికి స్పందించిన మంత్రి దేవినేని ఉమా, మేయర్ కోనేరు శ్రీధర్ ఘాట్‌కు చేరుకుని పనుల తీరుపై అధికారులను ప్రశ్నించారు. రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద పనులు, దుర్గాఘాట్‌లో రావిచెట్టు వద్ద మట్టికుప్పలను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ పనులు సాగుతున్నాయన్నారు. దుర్గాఘాట్‌లో మౌలిక వసతులు కల్పించాలి దుర్గాఘాట్, మోడల్ గెస్ట్‌హౌస్‌లో మౌలిక వసతులు కల్పించడంలో ఎందుకు ఆలస్యం అవుతోందని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాఘాట్‌ను శుక్రవారం ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు.