న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం.
మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం.
ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది.
ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం.
ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు
Comments
Please login to add a commentAdd a comment