![Kishan Reddy Distributes Fruits to Patients During Prime Minister Modi Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/17/kishan%20copy.jpg.webp?itok=BJHHWm4x)
సాక్షి, హైదరాబాద్ : దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో స్వచ్ఛ భారత్ చేసి రోగులకు బ్రెడ్, పండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇల్లు, కుటుంబం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోదీనే అని అభినందించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ గ్రిడ్‌లతో పాటు వన్ నేషన్ వన్ రాజ్యాంగాన్ని అమలు చేసి దేశ గతినే మార్చారని ప్రశంసించారు. 18 వేల గ్రామాల్లో కరెంటు, 80 శాతం స్టంట్ల ధరల తగ్గింపు వంటి చర్యలను మోదీ చేపట్టారని పేర్కొన్నారు. ఈ రోజు మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణకు స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇలా మూడూ కలిసి ఒకే రోజు రావడం శుభకరమన్నారు. ప్రస్తుతం వైరల్ ఫీవర్ ప్రబలుతున్న దృష్ట్యా జిహెచ్‌ఎమ్‌సి వ్యర్థాలను తొలగించాలని కోరారు. డెంగీ జ్వరాల మీద రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ బ్రాండ్ను మనం కాపాడుకోవాలని కిషన్ రెడ్డి ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment