సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవి తదితరులు
సంక్రాంతి సందేశంలో ప్రధాని మోదీ ఆకాంక్ష
ఢిల్లీలో కిషన్‌రెడ్డి ఇంట్లో వేడుకలకు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగిన ఈ సంబరాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మోదీకి కిషన్‌రెడ్డి కుటుంబస భ్యులతోపాటు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి తదితరులు స్వాగతం పలికారు. నేరుగా తులసికోట వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయి ద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలు వెలిగించారు.
గంగిరె ద్దులకు వృషభ పూజ చేశారు. అక్కడి నుంచి సంప్రదాయ, జానపద కళాకారుల నృత్యా లు, డప్పు చప్పుళ్ల మధ్య సభాస్థలి వరకు మోదీకి స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వేదికపై ప్రధాని మోదీ జ్యోతి వెలిగించారు. ప్రముఖ గాయని సునీత శ్లోకం అలపించగా, ఢిల్లీ నా ట్య అకాడమీ బృందం నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఇది సంస్కృతి, సమృద్ధి, పునరుద్ధరణ వేడుక: మోదీ
సంక్రాంతి పండుగ సంస్కృతి, పునరుద్ధర ణల వేడుక అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా మంత్రివర్గ సహచరుడు జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించాను. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాలల్లో అంతర్భాగ మైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. సంక్రాంతి అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’అంటూ ట్వీట్ ముగించారు.
సంకాంత్రి అంటే రైతుల పండుగ: కిషన్‌రెడ్డి
సంక్రాంతి అంటేనే రైతులు..గ్రామాల పండుగ అని కిషన్‌రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో తొలిసారిగా తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించానని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాధిత్య సింథియా, మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, సతీష్‌చంద్ర దూబే, శ్రీనివాస్‌వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు కె.లక్ష్మణ్, అనురాగ్ ఠాకూర్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, గోడెం నగేష్, బాలశౌరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే.అరుణతోపాటు, తెలంగాణ, ఏపీకి చెందిన బీజేపీ నేతలు, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, క్రీడాకారిణి పీవీ.సింధు, మంగ్లీ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment