టాటా-మిస్త్రీ వివాదంతో...ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
• పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం..
• ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కార్పొరేట్ వివాదాన్ని నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల విలువైన టాటా గ్రూప్‌లో సంక్షోభం కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని.. అందుకే దీనిపై ఓ కన్నేసి ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా కొర్పొరేట్ వివాదాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం తలదూర్చదు. టాటా సన్‌స వివాదం కూడా ఇలాంటిదే. ప్రభుత్వం ఈ విషయంలో చేసేదేమీ ఉండదు. ఇది వారి అంతర్గత వ్యవహారం. అరుుతే, దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూప్ కావడంతో సహజంగానే ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది.
అందుకే అక్కడ జరిగే పరిణామాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు, ఇతరత్రా వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. అరుుతే, ప్రస్తుతానికి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ)కు కూడా ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వివాదం అంశాన్ని నియంత్రణ సంస్థలేవీ ఇంకా తమ(ఎంసీఏ) దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించడం.. ఆతర్వాత రతన్ టాటా, టాటా గ్రూప్‌పై మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం రతన్-మిస్త్రీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
భయపడాల్సిన పనిలేదు...
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన అంశంపై స్పందిస్తూ... ఎల్‌ఐసీ ఒక్కటే కాదు.. దేశీ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు టాటా గ్రూప్‌తో సంబంధం ఉంది. ఆర్థిక వ్యవస్థలో టాటాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుుతే, ప్రతిష్టాత్మకమైన గ్రూప్‌గా పేరొందిన టాటా.. ఈ అంతర్గత వ్యవహరాన్ని పరిష్కరించుకోగలదని భావిస్తున్నా. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఈ అంశం ప్రభుత్వం, నియంత్రణ సంస్థల ముందుకు వస్తే... నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని మేఘ్వాల్ పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి టాటా మోటార్స్‌లో 7%, టాటా స్టీల్‌లో 13.91%, టాటా పవర్‌లో 13.12%, ఇండియన్ హోటల్స్‌లో 8.76% చొప్పున వాటాలున్నారుు.
దొరాబ్జీ ట్రస్ట్‌కు ఖంబాటా రాజీనామా...
టాటా కుటుంబానికి చెందిన కీలక ట్రస్టుల్లో ఒకటైన సర్ దొరాబ్జీ ట్రస్టీ సారథ్యం నుంచి డేరియస్ ఖంబాటా వైదొలిగారు. మాజీ అదనపు సొలిసిటర్ జనరల్, లాయర్ అరుున ఖంబాటా ట్రస్ట్రీ పదవికి గత నెల 25న రాజీనామా చేశారు. తన వృత్తిపరమైన అవసరాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా, మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించిన(అక్టోబర్ 24న) మర్నాడే ఈ ఖంబాటా రాజీనామా చోటుచేసుకోవడం గమనార్హం. టాటా ట్రస్ట్‌ల సూచనల మేరకే మిస్త్రీని తొలగించినట్లు టాటా సన్‌స ప్రకటించిన విషయం తెలిసిందే. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ అరుున టాటా సన్‌సలో టాటా ట్రస్ట్‌లకు 66 శాతం వాటా ఉంది. ఈ ట్రస్టుల్లో సర్ దొరాబ్జీ, రతన్ టాటా ట్రస్టులో అతిపెద్దవి.
నిబంధనల ప్రకారమేముంద్రా ప్రాజెక్టు: టాటా పవర్
ముంద్రా అల్ట్రా పవర్ ప్రాజెక్టు(యూఎంపీపీ) విషయంలో చట్టపరమైన అంశాలన్నింటినీ పూర్తిగా పాటించామని టాటా పవర్ వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనవసరంగా అధిక ధరకు టాటా పవర్ బిడ్ చేసిందని.. దీని వల్ల భారీ మొత్తంలో పెట్టుబడులను నష్టపోవాల్సి(రైట్ డౌన్) వస్తుందంటూ చైర్మన్ పదవి నుంచి వేటు పడిన మిస్త్రీ తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టాటా పవర్‌తో పాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా డొకోమో తదితర గ్రూప్ కంపెనీలకు సంబంధించి 18 బిలియన్ డాలర్లకు(దాదాపు రూ.1.2 లక్షల కోట్లు)పైగానే రైట్‌డౌన్ చేయాల్సి రావచ్చని మిస్త్రీ బాంబు పేల్చడంతో.. సంబంధిత కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరారుు. ‘2006లో ముంద్రా యూఎంపీపీకి బిడ్ చేసినప్పుడు రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ పరిశీలన విధానం అమల్లోలేదు. ప్రతిపాదనలపై బోర్డు చర్చించాకే ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు వివరాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాటాదారులకు తెలియజేస్తున్నాం. సెబీ నిబంధనలమేరకే నడుచుకుంటున్నాం’ అని టాటా పవర్ పేర్కొంది.
ఇండియన్ హోటల్స్ కూడా..
సైరస్ మిస్త్రీ ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరణ ఇచ్చింది. నిబంధనలు, చట్టప్రకారమే తాము ఎప్పటికప్పుడు కంపెనీ ఫలి తాలు, వివరాలన్నింటినీ వెల్లడిస్తూ వస్తున్నామని పేర్కొంది. ఇండియన్ హోటల్స్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు ఓరియంట్ హోటల్స్‌లో ఉన్న వాటాలను నష్టాలకు అమ్ముకోవాల్సి వచ్చిందని మిస్త్రీ పేర్కొనడం తెలిసిందే. అంతేకాదు... తన హయాంకు ముందు(రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు)అనుసరించిన విదేశీ కొనుగోళ్ల వ్యూహమే దీనికి కారణమని ఆయన ఆరోపించారు.