
ముంబై: టాటా సన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది.
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఆగస్టు 31న సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ముంబైలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఉదయ్ ఖొమానె ఈ మేరకు సమాధానమిచ్చారు. మరోవైపు, దీనిపై స్పందించేందుకు టాటా సన్స్ వర్గాలు నిరాకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment