మిస్త్రీని డైరెక్టర్గానూ తీసేద్దాం!
• వాటాదారులకు టీసీఎస్ నోటీసు వచ్చేనెల 13న ఈజీఎం
• టాటా సన్‌స విశ్వాసాన్ని కోల్పోరుునందుకేనని వివరణ
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) సైరస్ మిస్త్రీ తీవ్ర హాని తలపెట్టారంటూ ఆ కంపెనీలో ప్రధాన వాటాదారైన టాటా సన్‌స తాజాగా ఆరోపించింది. కంపెనీ బోర్డు డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల సమ్మతిని కోరింది. టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టాక టీసీఎస్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో చైర్మన్‌గా ఇషాంత్ హుస్సేన్‌ను నియమించారు. అంతేకాదు, టీసీఎస్ డెరైక్టర్ పదవి నుంచీ మిస్త్రీని తొలగించేందుకు వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించాలని టాటా సన్‌స కోరింది.
దీంతో గతవారం సమావేశమైన టీసీఎస్ బోర్డు వచ్చే నెల 13న ఈజీఎం నిర్వహించాలని నిర్ణరుుంచింది. ఈజీఎం నోటీసును టీసీఎస్ తన వాటాదారులకు పంపించింది. ‘‘టాటా సన్‌స ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తొలగింపునకు గురైన తర్వాత మిస్త్రీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. టాటా సన్‌సపై మాత్రమే కాకుండా బోర్డు డెరైక్టర్లు, టాటా గ్రూపు మొత్తంపై నిందలు మోపారు. టీసీఎస్ కూడా గ్రూపులో భాగమే. గోప్యత అంటూనే ఆరోపణలను బహిరంగ పరిచారు. మిస్త్రీ తన ప్రవర్తనతో టాటా గ్రూప్, టీసీఎస్, టీసీఎస్ వాటాదారులు, ఉద్యోగులకు తీవ్ర హాని కలిగించారు. ఈ నేపథ్యంలో డెరైక్టర్‌గా సైరస్ మిస్త్రీని తొలగించాలని డెరైక్టర్ల బోర్డు నిర్ణరుుంచింది’’ అని టీసీఎస్ వాటాదారులకు టాటా సన్‌స వివరించింది. మిస్త్రీ టాటా సన్‌స విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొంది.
ఇండియన్ హోటల్స్ ఈజీఎం 20న
టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ సైతం మిస్త్రీని డెరైక్టర్‌గా తొలగించే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల 20న వాటాదారుల సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో కంపెనీ నిర్ణయం తీసుకుంది.
వాడియా పరువు నష్టం నోటీసు
ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, బోంబే డైరుుంగ్ చైర్మన్ నుస్లీ వాడియా టాటా సన్‌సకు పరువు నష్టం నోటీసులు పంపించారు. టాటా గ్రూపులోని పలు కంపెనీలకు స్వతంత్ర డెరైక్టర్‌గా ఉన్న వాడియా... తనపై చేసిన నిరాధార, తప్పుడు, పరువుకు భంగం కలిగించే, అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని నోటీసులో డిమాండ్ చేశారు. కాగా, నుస్లీ వాడియా నోటీసుకు తగిన విధంగా స్పందిస్తామని టాటా సన్‌స స్పష్టం చేసింది.