'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి' | BJP MP demands ban on running commentaries by judges during hearings | Sakshi
Sakshi News home page

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి'

Published Mon, Apr 25 2016 7:23 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి' - Sakshi

'రన్నింగ్ కామెంటరీలకు చెక్ పెట్టాలి'

న్యూఢిల్లీ: న్యాయమూర్తులు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. లోక్ సభలో సోమవారం జీరో అవర్ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విచారణ సమయాల్లో జడ్జిలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా చూడాలని అన్నారు. విధాన నిర్ణేతలను పశ్నించే అధికారం కోర్టులకు లేదని, చట్టాలు చేయడం పార్లమెంట్ విధి అని చెప్పారు.

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనీ డిమాండ్ చేశారు. 'పార్లమెంట్, స్పీకర్ తో పాటు రాష్ట్రపతిపై కూడా జడ్జిలు కామెంట్లు చేస్తుండడం మనం చూస్తున్నాం. ఇకపై అలా జరగడానికి వీల్లేదు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. వారు సంయమనం పాటించాలి' అని మేఘవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement