స్పీకర్ సుమిత్రా మహాజన్కు కోపం వచ్చింది | Speaker angry at BJP MP for saying women fear flying MiG-21s | Sakshi
Sakshi News home page

స్పీకర్ సుమిత్రా మహాజన్కు కోపం వచ్చింది

Published Fri, May 6 2016 1:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

స్పీకర్ సుమిత్రా మహాజన్కు కోపం వచ్చింది - Sakshi

స్పీకర్ సుమిత్రా మహాజన్కు కోపం వచ్చింది

న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్కు పట్టరాని కోపం వచ్చింది. బీజేపీ ఎంపీ, లోక్ సభ చీఫ్ విప్ అర్జున్ రామ్ మెఘ్వాల్ మహిళలను కించపరుస్తూ సభలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు మాట్లొద్దని గట్టిగా మందలించారు. భారత యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలు, భయపడుతున్నారని, మిగ్ 21ఎస్ విమానాల్లో పనిచేసేందుకు వారు వెనుకాడుతున్నారని, ఇంకా అంతతొందరగా ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకంటే వీటిల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ అంటూ సభలో వ్యాఖ్యానించారు.

దీంతో స్పీకర్ మహాజన్ కలగజేసుకొని అలాంటి మాటలు చాలించమన్నారు. మీరైతే వెంటనే అంగీకరిస్తారా అంటూ ఆమె పారికర్ ను ప్రశ్నించారు. వెంటనే అందుకు ఆయన అంగీకరించను అని సమాధానం ఇచ్చారు. అయితే, తాను కేవలం మహిళల్లో అవగాహన కల్పించాలని,ఎన్సీసీ ద్వారా ఆ అవకాశం కల్పించాలని చెప్పాలన్నదే తన ఉద్దేశం తప్ప తక్కువ చేసి మాట్లాడటం కాదని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement