Speaker Sumitra Mahajan
-
లోక్‌సభ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తూ లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తనను పరిశీలించేందుకు రూల్స్ కమిటీతో సమావేశం అవుతానని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సభా కార్యకలాపాలకూ పలు పార్టీల ఎంపీలు ఆటంకం కలిగించారు. విపక్ష సభ్యులు వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఎంతకీ ఆందోళనలు నియంత్రణలోకి రాకపోవడంతో దీనిపై అఖిలపక్ష నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ నడుస్తున్న తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రూల్స్ కమిటీకి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ సభ్యులు సభలో నిబంధనలు, సభ్యుల ప్రవర్తన, సభా కార్యక్రమాలు జరగాల్సిన తీరుపై స్పీకర్‌కు సలహాలు, సూచనలు చేస్తారు. అవసరమైతే సభా నిబంధనలు, ప్రవర్తనా నియమావళిలో సవరణలు కూడా ప్రతిపాదిస్తారు. కాగా, ఈ ఆందోళనల నడుమనే లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. ఉభయసభల్లోనూ రఫేల్, కావేరీ డ్యాం వివాదాలపై కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీ ల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. కాగా, లోక్‌సభలో వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు, నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజెబిలిటీస్ (సవరణ) బిల్లులకు ఆమోదం లభించింది. దివ్యాంగుల బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. -
అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
స్పీకర్‌ను కలువనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లో ఎంపీలు రాజీనామాలు చేశారు. మరో వైపు స్పీకర్‌తో భేటి కానున్న నేపథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలంతా సమావేశమవుతారు. బాబు అవకాశవాది ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధం. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబుకు భయం. ఉపఎన్నికలంటే జంకుతున్నారు. ఓటుకు నోటు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్ జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీతో కలవడానికైనా, మళ్ళీ మోదీతో జతకట్టడానికైనా బాబు వెనుకాడరు. చంద్రబాబు విలువలు లేని పచ్చి అవకాశవాది. -
ఎల్లుండి అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అన్ని రాజకీయపార్టీల నేతల్ని ఆమె ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్రం ఇదే తరహా సమావేశం ఒకటి నిర్వహించనుంది. ఈ నెల 29న ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుందనిఅధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉభయ సభల్ని ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కోవింద్ ప్రస్తావించే వీలుంది. -
స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌కు పట్టరాని కోపం వచ్చింది. బీజేపీ ఎంపీ, లోక్ సభ చీఫ్ విప్ అర్జున్ రామ్ మెఘ్వాల్ మహిళలను కించపరుస్తూ సభలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మాటలు మాట్లొద్దని గట్టిగా మందలించారు. భారత యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలు, భయపడుతున్నారని, మిగ్ 21ఎస్ విమానాల్లో పనిచేసేందుకు వారు వెనుకాడుతున్నారని, ఇంకా అంతతొందరగా ఎవరూ ముందుకు రావడం లేదని, ఎందుకంటే వీటిల్లో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ అంటూ సభలో వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ మహాజన్ కలగజేసుకొని అలాంటి మాటలు చాలించమన్నారు. మీరైతే వెంటనే అంగీకరిస్తారా అంటూ ఆమె పారికర్ ను ప్రశ్నించారు. వెంటనే అందుకు ఆయన అంగీకరించను అని సమాధానం ఇచ్చారు. అయితే, తాను కేవలం మహిళల్లో అవగాహన కల్పించాలని,ఎన్సీసీ ద్వారా ఆ అవకాశం కల్పించాలని చెప్పాలన్నదే తన ఉద్దేశం తప్ప తక్కువ చేసి మాట్లాడటం కాదని వివరణ ఇచ్చారు. -
ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!
న్యూఢిల్లీ: భానుడి భగభగలకు రాజకీయ సెగలు తోడైతే దేశం ఉక్కపోతతో అల్లాడిపోదూ! సోమవారం నుంచి సరిగ్గా అలాంటి పరిస్థితే నెలకొనబోతోంది... పార్లమెంట్ ఉభయ సభల్లో సమావేశాల పునఃప్రారంభంతో! బడ్జెట్ సెషన్స్ లో భాగంగా రెండో దశ సమావేశాలు సోమవారం(ఏప్రిల్ 25) నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్షాలు సమస్యలనే కత్తులను నూరుతుంటే, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అమితమైన కసరత్తుచేస్తోంది పాలకపక్షం. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపుమేరకు ఆదివారం అఖిలపక్షం భేటీకానుంది. మరోవైపు కీలక సమస్యలపై చర్చ చేపట్టాలంటూ పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే స్పీకర్, చైర్మన్ లకు నోటీసులు అందచేశారు. వాటిలో అధిక శాతం ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నెలకొన్న కరువుకు సంబంధించినవే కావటం.. ఈ దఫా సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చను చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులామ్ నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ కు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం చర్చకు అనుమతించాలని కోరినట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనావేయడంలో, ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మరికొందరు విపక్ష ఎంపీలు కరువుపై చర్చను కోరుతున్నారు. అయితే బడ్జెట్ సంబంధిత బిల్లుపై చర్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన కీలకమైన బిల్లులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాగా, ఆదివారంనాటి అఖిలపక్ష భేటీ, సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశాల్లో సభ జరగబోయే తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఎథిక్స్ కమిటీకి ‘స్టింగ్’ వ్యవహారం
- టీఎంసీ ఎంపీల 'లంచం' కేసు - లోక్‌సభ స్పీకర్ ప్రకటన - అభ్యంతరం చెప్పిన తృణమూల్ ఎంపీ న్యూఢిల్లీ: కొందరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు లంచం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారాన్ని బుధవారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి దర్యాప్తు చేయాలని స్పీకర్, ఎల్.కె.అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కోరారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. 2005లో కూడా ఎథిక్స్ కమిటీ లంచం వ్యవహారంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్‌రాయ్ స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. అద్వానీ నాయకత్వంలో దర్యాప్తు జరిగితే పూర్తి పా రదర్శకంగా ఉంటుందన్నారు. కాగా, సౌగత్ రాయ్ అభ్యంతరాలను స్పీకర్ తోసిపుచ్చారు. జేపీసీతో విచారణ జరిపించాలి: సీపీఎం స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో తృణమూల్, కేంద్ర సర్కారు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని సీపీఎం ఆరోపించింది. ఈ అంశంపై సీపీఎం సభ్యులు బుధవారం రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. తృణమూల్ ఎంపీల వ్యవహారంపై రెండు నోటీసులు వచ్చాయని జీరో అవర్ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలిపారు. అయితే వాటిని చైర్మన్ తిరస్కరించారని వెల్లడిం చారు. కానీ ఈ అంశంపై మాట్లాడేందుకు కురియన్, తృణమూల్ ఎంపీ డెరిక్, సీపీఎం సభ్యుడు సీతా రాం ఏచూరీని అనుమతించారు. తమ పార్టీ ఎంపీలపై వచ్చిన ఆరోపణలను డెరిక్ తోసిపుచ్చారు. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన వ్యక్తి జర్నలిస్టో కాదో ముందు నిర్ధారించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోలు విశ్వసించదగ్గవి కావని అన్నారు. కాగా, ఈ వీడియోలపై విచారణ జరిపించాల్సిన అవసరముందని సీతారాం ఏచూరీ డిమాండ్ చేశారు. అదే సమయంలో సీపీఎం సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని వారు నిలదీశారు. ప్రభుత్వానికి, తృణమూల్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏచూరి ఆరోపించారు. మాపై కుట్రచేస్తున్నారు..: మమత ప్రతిపక్ష పార్టీలు కుట్రతోనే తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. విపక్ష పార్టీలన్నీ దుష్టకూటమిగా ఏర్పడ్డాయని దుయ్యబట్టారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్షాలు స్టింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని ఆరోపించారు. కాల్చీనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగిస్తూ, మీడియాలోని ఓవర్గం, విపక్ష పార్టీలు చేతులు కలిపి తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అన్నారు. -
సుమిత్రది మనువాద తత్వం
లక్నో/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఖండించారు. ఆమె అభిప్రాయాలు మనువాద మనస్తత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. అహ్మదాబాద్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారుల భేటీలో సుమిత్ర మాట్లాడుతూ ‘పదేళ్లు కోటా ఉండాలని, ఈలోగా స్వతంత్ర భారత్‌లో అందరూ సమానమే అన్న సమాజాన్ని సృష్టించుకోగలమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారు’ అని అన్నారు. కులాధార రిజర్వేషన్లపై సమీక్షించాలని సుమిత్ర అన్నారని, మనువాద మనస్తత్వం వల్లే అలా మాట్లాడగలిగారని మాయావతి విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాజ్యాంగపరంగా ఉన్నతస్థానంలో ఉన్న మహిళ ఇలా అనడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. రాజకీయ రిజర్వేషన్లు(పార్లమెంటు, అసెంబ్లీలు) మాత్రమే అంబేడ్కర్ సమీక్షించాలన్నారని శరద్‌యాదవ్ చెప్పారు. -
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
లలిత్‌గేట్‌పై లోక్‌సభలో విపక్ష, ప్రభుత్వాల వాగ్యుద్ధం ♦ సమావేశాలు ముగిసే తరుణంలో లలిత్‌గేట్‌పై వాడివేడిగా చర్చ ♦ కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి సరేనన్న సర్కారు ♦ సుష్మా ‘మానవతా సాయం’ ప్రకటనను తిరస్కరించిన కాంగ్రెస్ ♦ చట్టప్రకారం సాయం చేసి ఉండొచ్చని.. రహస్యం ఎందుకని ప్రశ్న ♦ లలిత్‌మోదీకి సాయం చేశారని మీరే ఒప్పుకున్నారు.. అదే సాక్ష్యం ♦ అధికార దుర్వినియోగం చేసినందుకు పదవికి రాజీనామా చేయాలి ♦ మోదీ సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత ఖర్గే న్యూఢిల్లీ:లలిత్‌మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ సభలో ఆందోళనకు దిగటంతో ఇప్పటివరకూ స్తంభించిపోయిన లోక్‌సభలో బుధవారం ఆ వివాదంపై వాడివేడిగా చర్చ జరిగింది. మరో రోజులో సమావేశాలు ముగిసిపోనుండగా.. ఈ వివాదంపై ‘వాయిదా తీర్మానం చర్చ’కు ప్రభుత్వ, ప్రతిపక్షాలు అంగీకరించాయి. బుధవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత.. లలిత్‌మోదీ వివాదంపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు వెల్‌లోకి వెళ్లి రాజీనామా డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షం డిమాండ్ మేరకు వాయిదా తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సుష్మా స్వయంగా స్పీకర్‌ను కోరారు. చర్చలో కేవలం ప్రతిపక్షమే పాల్గొననీయండని.. తాను సమాధానం చెప్పేటపుడు ప్రతిపక్షం సభలో ఉండాలని మాత్రమే తాను కోరుతున్నానని పేర్కొన్నారు. కానీ.. చర్చ జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరు కావాలని.. ఆయన సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘ప్రధాని హాజరు కాకుండా.. చర్చకు సమాధానం ఇవ్వకుండా.. మంత్రిపై చర్యలు ఎలా చేపట్టగలరు?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వాయిదా తీర్మానం కింద చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సభలో పేర్కొన్నారు. దీంతో.. వాయిదా తీర్మానానికి తనకు అభ్యంతరం లేదని.. అయితే దానిని సభ నియమాల ప్రాతిపదికనే చేపట్టటం జరుగుతుందని స్పీకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటికే దానిని తిరస్కరించినందున.. దానిపై ప్రశ్నోత్తరాల తర్వాత మాత్రమే దానిపై చర్చించగలమని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే చర్చ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడికి సుష్మా సాయం చేశారని.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఆరోపణలకు సుష్మాస్వరాజ్ బదులిచ్చారు. రాహుల్ విమర్శలనూ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. అనంతరం పలు పార్టీల సభ్యులతో పాటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌పై, ప్రధానమంత్రిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. చివరిగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చర్చకు బదులిచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమంటూ సుష్మా రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగా..వాయిదా తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. సుష్మా సమాధానాన్ని శ్రద్ధగా విన్న సోనియా... సుష్మా సమాధానం చెప్పటం ప్రారంభించగానే.. కాంగ్రెస్ సభ్యులు అందుకు వ్యతిరేకిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యురాలిగా జోక్యం చేసుకునే స్వేచ్ఛ సుష్మాకు ఉందని స్పీకర్ మహాజన్ పేర్కొన్నారు. చర్చకు ఆర్థికమంత్రి జైట్లీ బదులిస్తారని.. అయితే దీనిపై మాట్లాడే స్వేచ్ఛ సుష్మాకు ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘ఖర్గే గంటసేపు సుష్మాపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ఆమె చెప్పేదానిని వినాలి.’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య సుష్మా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా హెడ్‌ఫోన్ ధరించి ఆమె మాటలను శ్రద్ధగా వినటం కనిపించింది. లలిత్‌పై సానుభూతి చూపవద్దు... క్రికెట్ అభిమానుల మనోభావాలను లలిత్‌మోదీ దుర్వినియోగం చేశారని అన్నా డీఎంకే సభ్యుడు పి.వేణుగోపాల్ విమర్శించారు. లలిత్ తన భార్య బాగోగులు చూసుకోవటానికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ.. ఆయన తన భార్యను చూసుకోవటానికి బదులుగా రిసార్టుల్లో కాలం గడుపుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన విషయంలో ప్రభుత్వం ఎటువంటి సానుభూతీ చూపరాదని.. కఠిన చర్యలు చేపట్టాలని.. వేణుగోపాల్ సూచించారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి ఆలయం అయినందున.. దేశాన్ని కదిలిస్తున్న అంశాలపై ఇక్కడ శాంతియుత వాతావరణంలో చర్చ జరగాలని టీఎంసీ నేత దినేశ్త్రివేది పేర్కొన్నారు. ఒకరు ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో కట్టుబడి ఉండరాదని.. దేశానికి కట్టుబడి ఉండాలని బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. ఇటీవల మరణించిన మాజీ ఎంపీలు బలేశ్వర్రామ్, జగన్నాథ్సింగ్లకు సభ సంతాపం తెలిపింది. లలిత్‌మోదీకి మానవతా ప్రాతిపదికన సాయం చేశానంటూ సుష్మాస్వరాజ్ సమర్థించుకోవటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే చర్చను ప్రారంభిస్తూ.. లలిత్‌మోదీకి సాయంపై సుష్మా చేసిన ప్రకటనలో లోపాలను ఎత్తిచూపారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు చేస్తున్న పరారీలో ఉన్న నిందితుడికి సాయం చేయటానికి ఆమె ఎందుకు అంగీకరించారంటూ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఆయనకు మానవతా ప్రాతిపదిక సాయం చేశానని మీరు చెప్పారు. మీరు మానవతా ప్రాతిపదికన సాయం చేయాలనుకున్నట్లయితే.. అది చట్టబద్ధంగా చేసి ఉండవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు అప్పీలు చేయలేదు? హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు చేయకుండా ఉండటానికి.. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రుల్లో ఎవరిది బాధ్యత?’’ అని ప్రశ్నించారు. లలిత్‌మోదీ పోర్చుగల్‌లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు ప్రయాణ పత్రాలు జారీ చేసినట్లయితే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపబోదని బ్రిటిష్ రాయబారి అడిగిన ప్రశ్నకు తాను మౌఖికంగానే సమాధానం చెప్పానన్న సుష్మా వాదనను కూడా ఖర్గే తోసిపుచ్చారు. ‘‘అది సిఫారసు చేయటం కాదా? ఆమె కనీసం తన మంత్రిత్వశాఖ అధికారులతో కూడా ఈ అంశంపై మాట్లాడలేదు’’ అని తప్పుపట్టారు. లలిత్‌మోదీ ప్రయాణ పత్రాలు కోరటానికి చూపిన మూడు కారణాల్లో.. తన భార్య అనారోగ్యం అనేది అసలు మొదటి కారణమే కాదని.. ఆయన ఆ అనుమతిని ప్రతి చోటా రిసార్టులకు వెళ్లటానికి వాడుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. ‘‘లలిత్‌మోదీని భారత్‌కు తిప్పిపంపించాలని, ఆయనకు ప్రయాణ పత్రాలు ఇస్తే అది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని నాటి ఆర్థికమంత్రి పి.చిదంబరం బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పారు. కానీ.. లలిత్‌మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వటం వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం ఉండబోదని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పటం ద్వారా సుష్మా ఈ అంశంపై భారత ప్రభుత్వ విధానాన్ని మార్చివేశారు’’ అని తప్పుపట్టారు. ‘‘ఐపీఎల్ క్రీడా నిర్వహణలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న లలిత్‌మోదీ కోసం సుష్మా భర్త, ఆమె కుమార్తె పనిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం అంశంలో సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందే. లలిత్‌మోదీకి మీరు సాయం చేయటం.. ఆయనతో మీకు గల బలమైన సంబంధాన్ని చూపుతోంది. మీ సంబంధం ఆర్థికమైనది.మీరు ఆయనకు చేసింది ఉపకారం. మీపై మా ఆరోపణ ఇదే. మీరు సాయం చేశారని అంగీకరించారు. మీ అంగీకారమే సాక్ష్యం. కాబట్టి.. మీ రాజీనామాను మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లలిత్‌మోదీకి సాయం చేసిన అంశంపై బీజేపీ ముఖ్యమంత్రి ఒకరిపై కూడా మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే.. ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. వంశ చరిత్ర చదువుకో... రాహుల్... మీకు సెలవులంటే ఇష్టం కదా. ఈసారి అలాంటి సుదీర్ఘ సెలవుపై వెళ్లినపుడు వంశచరిత్ర చదువుకోండి. వచ్చి మీ తల్లిని అడగండి. అమ్మా... ఖత్రోచి కేసులో మనకెంత ముట్టింది? అండర్సన్‌ను డాడీ (రాజీవ్‌గాంధీ) ఎందుకు వదిలిపెట్టాడని అడగండి. ‘ఖత్రోకీ, ఆండర్సన్‌ల నుంచి ఎంత తీసుకున్నారో మీ అమ్మను అడుగు’ లలిత్‌మోదీకి సాయం విషయంలో తనపై ఆరోపణలు చేసిన విపక్ష కాంగ్రెస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. బోఫోర్స్ కుంభకోణంలో నిందితుడైనఓటావియో ఖత్రోకీ, భోపాల్ గ్యాస్ విషాదంలో నిందితుడైన వారెన్ ఆండర్సన్లు భారత్ నుంచి పరారవటానికి కాంగ్రెస్ పార్టీ సాయం చేసిందంటూ ఆరోపణలు ఎక్కుపెడుతూ.. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై కూడా విమర్శలు సంధించారు. ప్రత్యేకించి.. లలిత్‌మోదీకి సాయం చేయటానికి తాను డబ్బులు తీసుకున్నానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఖత్రోకీ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారని, 15,000 మందిని చంపిన హంతకుడిని మీ తండ్రి ఎందుకు విడుదల చేయించారని మీ అమ్మను అడగండి. ఖత్రోకీ, ఆండర్సన్‌ల విషయంలో వారు క్విడ్ ప్రో కోకు ఎందుకు పాల్పడ్డారో రాహుల్ (తన తల్లిని) అడగాలి’’ అని ఎదురు దాడి చేశారు. ‘‘2 నెలల పాటు సెలవుపై వెళ్లటం నీకు చాలా ఇష్టం. ఈసారి అలాంటి పర్యటనకు వెళ్లినపుడు.. నీ కుటుంబ చరిత్రను ఒంటరిగా చదవాలి. తిరిగి వచ్చాక మీ అమ్మను ప్రశ్నలు అడగాలి’’ అని రాహుల్‌కు సూచించా రు. మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంపైనా సుష్మా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘బ్రిటన్ నుంచి లలిత్‌మోదీని వెనక్కు తీసుకురావటంలో నాటి ఆర్థికమంత్రి చిదంబరం విఫలమయ్యారు. ఆ విషయంలో కాంగ్రెస్ చీలిపోయింది. లలిత్‌పై చర్య తీసుకోవాలని ఆ పార్టీలో కోరుకున్నది చిదంబరం ఒక్కరే. అదికూడా ఆయనతో తన వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే. లలిత్‌ని అదుపులోకి తీసుకుని అప్పగిస్తామని ఆ దేశం సూచించినప్పటికీ.. చిదంబరం కేవలం ఆయనను తిప్పి పంపించాలన్న వినతులకే పరిమితమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖతో కూడా ఆయన సంప్రదించలేదు. నాలుగేళ్ల పాటు మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం) ఏమీ చేయలేదు. నిష్క్రియగా ఉండిపోయారు. ఆయనను అదుపులోకి తీసుకుని (భారత్‌కు) అప్పగించే ప్రయత్నాలేవీ లేవు. ఆయనకు నివాస హక్కు (బ్రిటన్‌లో) ఎలా వచ్చిందని మీరు నన్ను అడుగుతున్నారు. మీ హయాంలోనే ఆయనకు ఆ హక్కు వచ్చింది. ఏం జరిగినా.. మీ హయాంలోనే జరిగింది. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రిగా పదవి చేపట్టిన తర్వాతే.. లలిత్‌మోదీని వెనక్కు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి’’ అని పేర్కొన్నారు. ‘‘లలిత్‌మోదీ లీగల్ కేసును నా భర్త, కుమార్తె వాదించారన్న విపక్షం ఆరోపణ వాస్తవం కాదు. లలిత్ పాస్‌పోర్టు కేసులో నా భర్త ఆయన తరఫు న్యాయవాది కాదన్నారు. లలిత్ తరఫు న్యాయవాదుల జాబితాలో 9వ న్యాయవాదిగా నా కుమార్తె ఉన్నారు. ఆమెకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. సీనియారిటీ జాబితాలో 9వ స్థానంలో ఉన్న జూనియర్ న్యాయవాదికి ఎవరైనా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఈ కేసులో సీనియర్లతో కలిసి నా కుమార్తె హాజరయ్యారు’’ అని అన్నారు. నేను నిజం మాట్లాడుతున్నా ‘‘సుష్మాస్వరాజ్ నిన్న నన్ను కలిశారు. నా చేయి పట్టుకుని.. బేటా నీకు నాపై అంత కోపం ఎందుకని అడిగారు. నేను నిజం మాట్లాడుతున్నానని ఆమెకు చెప్పాను. సుష్మాగారూ.. నేను మీ కళ్లలోకి సూటిగా చూస్తూ నిజం చెప్తున్నాను అన్నపుడు.. మీరు మీ కళ్లు దించేశారు’’ ‘లలిత్‌మోదీ నుంచి ఎంత డబ్బు అందుకున్నారు?’ సభలో కూర్చుని తమను ఎదుర్కొనేందుకు, తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దమ్ము లేదని.. అందుకే ఆయన సభకు రాలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. నల్లధనానికి ప్రతీక అయిన ఐపీఎల్ మాజీ బాస్ లలిత్‌మోదీకి రహస్యంగా సాయం చేసినందుకు గాను తన కుటుంబానికి ఎంత డబ్బు ముట్టిందో సుష్మాస్వరాజ్ బయటపెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రభుత్వంతో సమస్య ఏమిటంటే.. మహాత్మా గాంధీ మూడు కోతుల లాగా అది వాస్తవాన్ని చూడాలని, వినాలని, మాట్లాడాలని కోరుకోదు. మానవతా కృషి చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ.. మౌనంగా ఆ పని చేసే తొలి వ్యక్తి సుష్మాస్వరాజ్. సుష్మాస్వరాజ్‌ను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. లలిత్‌మోదీ నుంచి ఆమె, ఆమె కుంటుంబం ఎంత డబ్బు అందుకున్నారు? నల్లధనం ప్రతీకను రక్షించేందుకు ఆమె ఎంత డబ్బు అందుకున్నారు? ఆయనకు ఆమె ఎందుకు రహస్యంగా సాయం చేశారు?’’ అని ప్రశ్నించారు. ‘‘నల్లధనం వెనక్కు తెస్తానని ప్రధానమంత్రి ఇచ్చిన హామీని భారత ప్రజలు విశ్వసించారు. ఆయన హామీ ఇచ్చినట్లు భారతీయులందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు ఎప్పుడు జమ చేస్తారు? ‘నేను తినను.. తిననివ్వను’ అని హామీ ఇచ్చిన ప్రధాని దానిని నిలబెట్టుకోలేదు. తన మంత్రుల అక్రమాలపై ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈ రోజు కుర్చీలో కూర్చుని మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ఆయనకు లేదు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ఆయనకు లేదు. వీళ్లు మీకు సరైన దారి చూపటం లేదు. వీళ్లు మీ ప్రయోజనాలకు చేటు చేస్తున్నారు. మీ మాటలు వినాలని దేశం కోరుతోంది. మీరు మాట్లాడాలి’’ అని నరేంద్రమోదీపైనా రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజెకు, లలిత్‌మోదీకి మధ్య గల వ్యాపార సంబంధం.. వాణిజ్య లావాదేవీ అని అభివర్ణించిన అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘వ్యాపార ఒప్పందంలో ఒకరు లబ్ధిదారు అవుతారు. ఈ ఉదంతంలో లబ్ధిదారు ఎవరు?’’ అని ప్రశ్నించారు. రాహుల్ మాట్లాడుతున్నపుడు బీజేపీ సభ్యులు తీవ్ర స్వరంతో అరుస్తుండగా.. ‘‘కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండిపోదు. పార్టీ గొంతు నొక్కలేరు. కాంగ్రెస్ తన గళం ఎత్తుతూనే ఉంటుంది’’ అని తిప్పికొట్టారు. ‘‘ఐపీఎల్ అనేది భారతదేశంలో నల్లధనానికి కేంద్రం. లలిత్‌మోదీ నల్లధనానికి ప్రతీక మినహా మరేమీ కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘సుష్మాస్వరాజ్ నిన్న నన్ను కలిశారు. నా చేయి పట్టుకుని.. బేటా నీకు నాపై అంత కోపం ఎందుకని అడిగారు. నేను నిజం మాట్లాడుతున్నానని ఆమెకు చెప్పాను. సుష్మాగారూ.. నేను మీ కళ్లలోకి సూటిగా చూస్తూ నిజం చెప్తున్నాను అన్నపుడు.. మీరు మీ కళ్లు దించేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా ప్రసక్తే లేదు.. * సుష్మను బలిపశువును చేశారు: జైట్లీ ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం చెప్తూ.. గోరంత కూడా లేనిదాన్ని కొండంత చేసి రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ పార్లమెంటును అడ్డుకోవటానికి ప్రధాన కారణం.. జీఎస్టీ వంటి సంస్కరణల బిల్లులను నిలిపివేటం ద్వారా భారత అభివృద్ధి గాథను నిలువరించటమేనని.. అందుకు సుష్మాస్వరాజ్‌ను బలిపశువును చేశారని మండిపడ్డారు. సుష్మా ఎటువంటి తప్పూ చేయలేదంటూ.. ఆమె రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లలిత్‌మోదీని వెనక్కు తీసుకువచ్చేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం పటిష్టంగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాహుల్ ఉటంకించిన మూడు కోతుల కథను ప్రస్తావిస్తూ.. పార్లమెంటు సమావేశాలు మొత్తాన్నీ స్తంభింపచేయటం ద్వారా దేశాన్ని కోతిలా చేయవద్దని సూచించారు. ‘తరాలుగా కూర్చొని తింటున్నారు’ ‘‘ఈ రోజు రాహుల్ గాంధీ... సుష్మా స్వరాజ్‌ను నిలదీస్తున్నారు. పాస్‌పోర్ట్ కేసులో లలిత్ మోదీ తరఫున వాదించినందుకు ఆమె కుటుంబానికి ఎంత ముట్టిందో చెప్పాలంటున్నారు. ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. తన కూతురు ఆ కేసులో ఓ జూనియర్ న్యాయవాది మాత్రమేనని. తొమ్మిదో స్థానంలో ఉందని. ఆ కేసులో రూపాయి కూడా తీసుకోలేదని. అయినా... పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌తో వచ్చిన సమస్యేమిటంటే ఆయనో జ్ఞానం లేని నిపుణుడు. ఈ దేశంలో చాలామంది నిజాయితీపరులున్నారు. హోదాలతో పనిలేకుండా వారి కుటుంబీకులు (సుష్మ కూతురిని ఉద్దేశించి) తమ జీవనభృతిని స్వయంగా సంపాదించుకుంటారు. అయితే ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కుటుంబం మాత్రం... తరతరాలుగా ఎలాంటి పని చేయట్లేదు’’ -
పట్టువీడని అధికార, విపక్షాలు
ఉభయ సభల్లో తొలగని ప్రతిష్టంభన న్యూఢిల్లీ: కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ కొనసాగింపు.. పలు విపక్షాల వాకౌట్లతో పార్లమెంటు ఉభయసభలూ బుధవారం కూడా హోరెత్తాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలోనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వారు చేసిన ప్రయత్నాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించటంతో మూడు పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ‘ప్రజాస్వామ్యం హత్యను ఆపండి’ అంటూ ఆర్జేడీ ఎంపీ జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ అరుస్తూ వాకౌట్ చేశారు. కాగా, సస్పెండ్ కానీ కాంగ్రెస్ సభ్యులతో పాటు, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ముస్లింలీగ్ సభ్యులు వరుసగా రెండోరోజు కూడా సభా కార్యకలాపాలను బహిష్కరించారు. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అంశాన్ని టీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తడంతో దానిపై న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య సమాధానం ఇచ్చారు. అంతకు ముందు నామినేట్ అయిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులు రిచర్డ్ హే, జార్జ్ బేకర్లు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోపక్క.. రాజ్యసభలో విపక్షాల నిరసనతో కార్యకలాపాలు సాగనే లేదు. మీ డిమాండ్లకు లొంగం: వెంకయ్య పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు విపక్షాలకు కావలసినన్ని అవకాశాలు కల్పించడానికి సిద్ధమని, అయితే అర్థంలేని డిమాండ్లకు ఎంతమాత్రం లొంగేది లేదని మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. యాకూబ్ ఉరిని వ్యతిరేకిస్తున్న వారిపై మండిపడుతూ.. వారికి ఉరిశిక్షల్లోనూ కోటా కావాలేమోనని అన్నారు. -
మూడోరోజు సేమ్ సీన్ రిపీట్...
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడోరోజు సమావేశాలు ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు, ఆందోళనల మధ్య గురువారం ఉదయం లోక్ సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దాంతో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై చర్చించాలంటూ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభ్యులు నిరసనకు దిగారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. వ్యాపం, మోదీ స్కామ్‌పై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టారు. వైస్ ఛైర్మన్ కురియన్ ...విపక్ష సభ్యులకు సర్దిచెప్పి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ వార్నింగ్
-
పార్లమెంట్లో స్మో'కింగ్'లకు షాక్
న్యూఢిల్లీ: వ్యాపం, లలిత్ గేట్ కుంభకోణాలపై పరస్పరం కత్తులు దూసుకుంటున్న పాలక, ప్రతిపక్షాల సభ్యులు పార్లమెంట్లో మంగళవారం హఠాత్తుగా కలసిపోయారు. వారంతా ఓ బృందంగా ఏర్పడి కలసికట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వద్దకు వెళ్లారు. వారంతా కలసి రావడాన్ని చూసిన మహాజన్ కూడా కాసేపు తన కళ్లను తానే నమ్మలేదట. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు చివరకు పాలక, ప్రతిపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చాయని ఆమె సంతోషించారట. తాము సమావేశాల గురించి చర్చించేందుకు రాలేదని, సెంట్రల్ హాల్ పక్కనున్న స్మోకింగ్ రూమ్‌ను ఎందుకు తీసేశారో ప్రశ్నించేందుకు వచ్చామని వారు చెప్పడంతో స్పీకర్ సంతోషం కాస్త నీరు కారింది. అయినా ఈ విషయంలో తనను ప్రశ్నించడాన్ని సహించనని, అవసరమైతే స్మోకింగ్ రూమ్ కోసం ఓ పిటిషన్ పెట్టుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పొగ తాగకుండా తీవ్ర అసహనానికి గురవుతున్న ఎంపీలు చేసేది లేక స్పీకర్ సూచన మేరకు ఆమెకో ఆర్జి పెట్టుకున్నారు. ఇప్పటి వరకు సెంట్రల్ హాల్ పక్కనున్న స్మోకింగ్ రూమ్‌ను కొత్తగా స్టెనోగ్రాఫర్లకు కేటాయించడంలో పొగరాయుళ్లకు చిక్కొచ్చి పడింది. పార్లమెంట్ భవన ప్రాంగణం మొత్తం 'నో స్మోకింగ్ జోన్' అవడం వల్ల ఎంపీలెవరూ బయట స్మోకింగ్ చేయడానికి వీల్లేదు. పార్లమెంట్ సమావేశ మందిరంలో పాలక, ప్రతిపక్షాలు ఒకరినొకరు ఎంత దూషించుకున్నా, వారు ఇట్టే కలసిపోయేది మాత్రం స్మోకింగ్ రూమ్‌లోనే. వారు అక్కర పరస్పర వ్యూహాల ప్రతులను మార్చుకున్న సందర్భాలూ, అట్టే ప్రశ్నలతో నన్ను సభలో వేధించమాకే! అంటూ మంత్రులు... సభ్యులను వేడుకున్న సందర్భాలు ఇక్కడ అనేకం. సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి, కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్ రిజిజు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సౌగత రాయ్, కళ్యాణ్ బెనర్జీలు తరచూ స్మోకింగ్ రూమ్‌లో కనపిస్తారు. వీరిలో మరీ సిగరెట్టు మీద సిగరెట్టు పీకేది మాత్రం ఆశోక గజపతి రాజు. ఆయన తన పార్టీ కార్యాలయంలోకన్నా స్మోకింగ్ రూమ్‌లో ఉంటారన్నది ప్రతీతి. ఇంతకు స్మోకింగ్ రూమ్‌ను స్టెనోగ్రాఫర్లకు ఎందుకు కేటాయించారంటే.... వారు ఇంతవరకున్న కార్యాలయాన్ని తృణమూల్ కాంగ్రెస్‌కు కేటాయించడం వల్ల. గత ఏడాది కాలంగా పార్లమెంట్లో ఆ పార్టీకి కార్యాలయం లేదు. వాస్తవానికి ఆ పార్టీకి పార్లమెంట్ భవనంలోని ఐదోనెంబర్ ఆఫీసు గదిని కేటాయించారు. అందులో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఆ ఆఫీసును ఖాళీ చేయలేదు. 1984లో తమ పార్టీ తొలిసారి పార్లమెంట్లో కాలిడినప్పటి నుంచి అందులో ఉంటున్నామని, అది తమకు ఎంతో అచ్చి వచ్చిందని, ఖాళీ చేయమంటూ మొండికేసింది. దీంతో తృణమూల్‌కు ప్రత్యామ్నాయం చూపించాల్సి వచ్చింది. బుధవారం నాటికి కూడా మన పొగరాయుళ్లకు స్పీకర్ మహాజన్ ప్రత్యామ్నాయ స్మోకింగ్ రూమ్‌ను చూపించలేకపోయారు. ఇదే మంచి తరుణమనుకున్న పొగరాయుళ్లు లాన్లోకి వెళ్లి అందరి ముందే దర్జాగా పొగ గుప్పుగుప్పుమని ఊదేస్తున్నారు. -
ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ వార్నింగ్
న్యూఢిల్లీ : సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన బాగోలేదంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. వెల్‌లోకి దూసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. నిరసనలు,నినాదాలతో రెండోరోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వ్యాపమ్, లలిత్ మోదీ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. చర్చ చేపట్టాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు రావటంతో స్పీకర్ తప్పుబట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు. -
ప్రారంభం..ఆ వెంటనే వాయిదాలు..
-
ప్రారంభం..ఆ వెంటనే వాయిదాలు..
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు రెండోరోజు కూడా అదే తంతు కొనసాగింది. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే వాయిదా పడింది. ఈరోజు లోక్ సభ ప్రారంభం కాగానే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మృతి చెందినవారికి ఆత్మకు శాంతి చేకూరాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానం చదివి వినిపించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను ప్రారంభించినట్లు ప్రకటించగానే విపక్ష సభ్యులు లలిత్ మోదీ అంశాన్ని లేవనెత్తారు. అయితే సభ్యులు ఫ్లేకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ సూచించారు. అయినా సభ్యులు తమ ఆందోళనను విరమించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగుతోంది. వ్యాపం కుంభకోణంపై చర్చకు సభ్యులు పట్టుబడుతున్నారు. చర్చకు అనుమతిచ్చేది లేదని రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్ స్పష్టం చేశారు. గందరగోళం నెలకొనటంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. -
పార్లమెంట్లో ‘భూ’కంపం
లోక్‌సభలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం వ్యతిరేకించిన విపక్షం; రైతు వ్యతిరేక బిల్లు అంటూ నినాదాలు నిరసనగా వైఎస్సార్సీపీ సహా విపక్ష పార్టీల వాకౌట్ బిల్లుపై రాజ్యసభలోనూ వ్యక్తమైన వ్యతిరేకత; పార్టీలతో చర్చించాలన్న ఎస్పీ భూసేకరణలో పాత విధానాన్ని అవలంబించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్న జైట్లీ న్యూఢిల్లీ: ఊహించినట్లే భూసేకరణ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.. కలసికట్టుగా వాకౌట్ చేశాయి. ఇది పేదలు, రైతుల వ్యతిరేక.. కార్పొరేట్ల అనుకూల బిల్లు అని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. మరోవైపు, రాజ్యసభకు బిల్లు చేరకముందే పెద్దల సభలో దీనిపై దుమారం రేగింది. బిల్లుపై అఖిలపక్ష భేటీ జరపాలన్న విపక్షాల డిమాండ్ గురించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని సభానాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చిన అనంతరం సభా కార్యక్రమాలు కొనసాగాయి. ఎన్డీయే మిత్రపక్షం సైతం.. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సంబంధిత ఆర్డినెన్సు స్థానంలో వివాదాస్పద భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ‘న్యాయమైన పరి హార హక్కు, పారదర్శకతలతో కూడిన భూ సేకరణ పునరావాస(సవరణ) బిల్లు, 2015’ ను సభలో ప్రవేశపెట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పీకర్ సుమిత్ర మహాజన్ అనుమతి కోరిన వెంటనే.. వైఎస్సార్సీపీ సహా విపక్షాలన్నీ ఒక్కసారిగా లేచి నిల్చు ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెలిపాయి. ఆ బిల్లు పేదలు, రైతులకు అన్యాయం చేసేలా ఉందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎన్డీయే మిత్రపక్షం స్వాభిమాని షేట్కారీ సంఘటన్ పార్టీ ఎంపీ రాజు శెట్టీ సైతం బిల్లును వ్యతిరేకిస్తూ, విపక్షాలతో జతకలవడం విశేషం. బిల్లులోని అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ.. విపక్ష సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విఫలయత్నంచేశారు. మొదట టీఎంసీ సభ్యుడు సౌగత్‌రాయ్ మాట్లాడుతూ.. ‘ఒక్క కలం పోటుతో రైతులు, నిరుపేదల పక్షాన ఉన్న నిబంధనలను తొలగించి వేశారు. సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబంధనలను, రైతుల సమ్మతికి సంబంధించిన భాగాలను తొలగించివేశారు. అలాగే ఆహార భద్రత అంశాన్ని విస్మరించారు. ఈబిల్లును తేవడమంటే రైతులకు అంతిమ ఘడియలను తెచ్చినట్టే’ అన్నారు. ‘ఆర్డినెన్సును తీసుకురావడానికి బదులు, అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళ్లి ఉంటే.. అది వేరే సంగతి. కానీ ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకువచ్చి మొండి గా ముందుకెళ్లింది’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ఖర్గే వ్యాఖ్యానించారు. బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ టీఎం సీ.. బిల్లులోని కొన్ని కీలకాంశాలపై తమకు అభ్యంతరాలున్నాయంటూ బీజేడీ పేర్కొన్నాయి. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశమివ్వాలన్న టీఆర్ఎస్ నేత బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు. అయినప్పటికీ వినోద్ మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి సమాఖ్య స్ఫూర్తి అంటున్నారు. కానీ ఈ బిల్లు తెచ్చేముందు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనేలేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒకసారి మాట్లాడండి. మాది కొత్త రాష్ట్రమైనప్పటికీ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే మేం భూసేకరణకు సంబంధించి చట్టం తెచ్చాం. రైతుల మన్ననలు పొందాం. అందువల్ల అందరినీ సంప్రదించడం మంచిది’ అని పేర్కొన్నారు. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతించగానే.. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వి.వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, వై.ఎస్. అవినాశ్‌రెడ్డి సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని ప్రతిపక్షాలపై వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. మెజారిటీకి మైనారిటీ ఆజ్ఞలు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. యూపీఏ హయాంలో భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే అభ్యర్థించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 32 ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సవరించాలంటూ విజ్ఞాపనలు చేశాయన్నారు. కాగా, గనులు, ఖనిజాల చట్టం సవరణకు ఉద్దేశించిన బిల్లును బీజేడీ సభ్యుల నిరసనల మధ్య ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్సును గత నెలలో ప్రభుత్వం జారీ చేసింది. ప్రతిపక్షాలను సంప్రదిస్తాం: భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రాజ్యసభలోనూ విపక్షాలు ఒక్కతాటిపై నిలిచాయి. ఆర్డినెన్సులోని అంశాలు రైతులకు అన్యాయం చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, లెఫ్ట్, బీఎస్పీ, జేడీయూలు ధ్వజమెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఒక పరిష్కార మార్గాన్ని వెతికేందుకు అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సూచించారు. ఆర్డినెన్సు ద్వారా కాకుండా విపక్షపార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే బావుండేదన్నారు. అనంతరం సభానాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. సరైన స్ఫూర్తితో ఎస్పీ నేత మాట్లాడారని, ఆయన సూచనను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలను సంప్రదిస్తానన్న జైట్లీ వ్యాఖ్యను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో సంప్రదింపులు పూర్తయ్యేంతవరకు ఆర్డినెన్సును సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ చేసిన డిమాండ్‌కు.. అది కుదరదనే అర్థం వచ్చేలా జైట్లీ చేయి అడ్డంగా ఊపడం కనిపించింది. బీజేపీ సహా అన్ని పార్టీలు ఆమోదించి, చట్టంగా రూపొందిన బిల్లుకు సవరణలు చేస్తూ.. పార్లమెంటును తోసిరాజని ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్సును తీసుకువచ్చిందన్న కాంగ్రెస్ విమర్శలపై జైట్లీ స్పందిస్తూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 639 ఆర్డినెన్సులు వచ్చాయని, అందులో 80% కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని గుర్తుచేశారు. పార్లమెంటును కాదని చట్టాలు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. భూసేకరణ ఆర్డినెన్సు స్థానంలో రూపొం దించిన బిల్లు ప్రస్తుతం లోక్‌సభలో ఉందని, అక్కడ ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభకు వస్తుందన్నారు. బిల్లులో రైతుల పరిహారం 4 రెట్లు పెంచుతూ ప్రతిపాదనలున్నాయన్నారు. అయినప్పటికీ విపక్షాల విమర్శలు ఆగకపోవడంతో.. బిల్లు సభలోకి వచ్చాక విపక్షం అభ్యంతరాలు తెలప వచ్చన్నారు. ఈ భూ సేకరణ బిల్లు చట్టరూపం దాల్చినప్పటికీ.. పాత పద్ధ్దతే కొనసాగించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశముందని జైట్లీ వివరించారు. జవహర్లాల్ నెహ్రూ పాలనలోనే ఎక్కువ ఆర్డినెన్సులు వచ్చాయన్న జైట్లీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ స్పందిస్తూ.. దేశ విభజన అనంతర విపత్కర పరిస్థితుల్లో ఆ ఆర్డినెన్సులు వచ్చాయన్న విష యం గుర్తుంచుకోవాలన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని కూడా మేం వ్యతిరేకించాం. కానీ, ఎన్డీఏ ఆర్డినెన్సును చూస్తుంటే వారు(యూపీఏ) దేవతల్లా కనిపిస్తున్నారు’ అని టీఎంసీ సభ్యుడు ఒబ్రెయిన్ అన్నారు. ఇరుకున పడ్డ ప్రభుత్వం: మూడు బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించేందుకు చేసిన ప్రయత్నం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఇన్సూరెన్స్ బిల్లు, బొగ్గు గనుల బిల్లు, మోటారు వాహనాల బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుని, మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. ఉపసంహరణ తీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. గత సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టామని, అనంతరం వాటికి సంబంధించిన ఆర్డినెన్సులను జారీ చేసినందున సభనుంచి వాటిని ఉపసంహరించాల్సి ఉందన్న జైట్లీ వివరణతో విపక్షం సంతృప్తి చెందకపోవటంతో తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఆర్డినెన్సుల స్థానంలో తీసుకువచ్చిన బిల్లుల ఆమోదంలో విఫలమైన పక్షంలో బడ్జెట్ సమావేశాల అనంతరం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభలోమెజారిటీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో తగిన మద్దతు లేకపోవడంతో ఈ బిల్లుల ఆమోదం ప్రభుత్వానికి సమస్యగా మారింది. -
పార్లమెంట్లో కొత్త సభ్యుల ప్రమాణం
న్యూఢిల్లీ : పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభలో కొత్త సభ్యులతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రాజ్యసభలోనూ చైర్మన్ హమీద్ అన్సారీ ...సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్ సభలో రంజన్ బేన్ ధనుంజయ్ భట్, దివంగత కేంద్రమంత్రి గోపీనాధ్ ముండే కూతురు ప్రీతమ్ గోపీనాధ్ ముండే ప్రమాణం చేశారు. మరోవైపు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులను ప్రధాని మోదీ ..సభకు పరిచయం చేశారు. ఆ తర్వాత దివంగత సభ్యులు, హుద్ హుద్ మృతులకు ఉభయ సభలు సంతాపం తెలిపింది. అనంతరం పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. కాగా పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23వరకూ కొనసాగనున్నాయి. -
లోక్‌సభలో ధరల పెరుగుదలపై రభస
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ధరల పెరుగుదలపై లోక్ సభ దద్దరిల్లింది. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు మొదటి రోజే వాడీవాడీగా సాగుతున్నాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టగానే విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చకు పట్టుబట్టాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ధరల పెరగుదలపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు పట్టుబట్టేసరికి సభలో గందరగోళం నెలకొంది. దాంతో సమావేశాలకు అంతరాయం ఏర్పడటంతో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. కాగా మొదటిరోజు లోక్‌సభ మొదలైన వెంటనే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద మృతులతో పాటు, చెన్నై భవన ప్రమాద ఘటన మృతులకు సంతాపం ప్రకటించింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అటు రాజ్యసభలో సభ మొదలైన వెంటనే ఛైర్మన్ హమీద్ అన్సారీ.... సభ్యుల ప్రమాణ స్వీకార తీర్మానాన్ని వినిపించారు. అనంతరం పలువురు సభ్యులు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.