సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన బాగోలేదంటూ లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. వెల్లోకి దూసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. నిరసనలు,నినాదాలతో రెండోరోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వ్యాపమ్, లలిత్ మోదీ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. చర్చ చేపట్టాల్సిందేనంటూ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు రావటంతో స్పీకర్ తప్పుబట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి సమావేశాలకు రావడం సరికాదని వ్యాఖ్యానించారు.