పార్లమెంట్ సమావేశాలు రెండోరోజు కూడా అదే తంతు కొనసాగింది. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. విపక్ష సభ్యుల నిరసనల మధ్య బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే వాయిదా పడింది. ఈరోజు లోక్ సభ ప్రారంభం కాగానే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మృతి చెందినవారికి ఆత్మకు శాంతి చేకూరాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానం చదివి వినిపించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.