సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ చేపడుతామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ చేపడుతామని స్పీకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
టీడీపీ అవిశ్వాస నోటీసుపై టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కేంద్రమంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చర్చలో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాజ్యసభలో వచ్చే సోమవారం స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment