
సుమిత్రది మనువాద తత్వం
రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఖండించారు.
లక్నో/న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలను బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఖండించారు. ఆమె అభిప్రాయాలు మనువాద మనస్తత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. అహ్మదాబాద్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారుల భేటీలో సుమిత్ర మాట్లాడుతూ ‘పదేళ్లు కోటా ఉండాలని, ఈలోగా స్వతంత్ర భారత్‌లో అందరూ సమానమే అన్న సమాజాన్ని సృష్టించుకోగలమని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారు’ అని అన్నారు.
కులాధార రిజర్వేషన్లపై సమీక్షించాలని సుమిత్ర అన్నారని, మనువాద మనస్తత్వం వల్లే అలా మాట్లాడగలిగారని మాయావతి విమర్శించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో రాజ్యాంగపరంగా ఉన్నతస్థానంలో ఉన్న మహిళ ఇలా అనడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. రాజకీయ రిజర్వేషన్లు(పార్లమెంటు, అసెంబ్లీలు) మాత్రమే అంబేడ్కర్ సమీక్షించాలన్నారని శరద్‌యాదవ్ చెప్పారు.