ఎల్లుండి అఖిలపక్ష భేటీ | Lok Sabha speaker Sumitra Mahajan calls all party meeting on 28 | Sakshi
Sakshi News home page

ఎల్లుండి అఖిలపక్ష భేటీ

Published Fri, Jan 26 2018 3:19 AM | Last Updated on Fri, Jan 26 2018 3:19 AM

Lok Sabha speaker Sumitra Mahajan calls all party meeting on 28 - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అన్ని రాజకీయపార్టీల నేతల్ని ఆమె ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్రం ఇదే తరహా సమావేశం ఒకటి నిర్వహించనుంది. ఈ నెల 29న ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుందనిఅధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉభయ సభల్ని ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కోవింద్‌ ప్రస్తావించే వీలుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement