నోట్ల చలామణి తగ్గిపోయింది!
నోట్ల చలామణి తగ్గిపోయింది!
Published Fri, Mar 10 2017 6:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
పెద్ద నోట్ల రద్దు అనంతరం కరెన్సీ వాడకంపై పెడుతున్న ఆంక్షలు, డిజిటల్ లావాదేవీల వాడకం నోట్ల చలామణిని తగ్గించేశాయి. నోట్ల రద్దు అనంతరం కేవలం ఈ క్వార్టర్లో రూ.11.73 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని నేడు ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.16.41 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ లోక్ సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. 21014 మార్చి 31 న రూ.12.82 లక్షల కోట్ల నోట్లు చలామణిలో ఉన్నాయని, అవి 2015 మార్చి 31కి వచ్చేసరికి రూ.14.28కోట్లకు పెరిగాయని చెప్పారు.
2016 మార్చిలో మరింత పెరిగి రూ.16.41 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నోట్ల చలామణి తగ్గినట్టు తెలిసింది. నవంబర్ 8న ప్రధాని తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 86 శాతం కరెన్సీ నోట్ల చలామణిలోంచి వెనక్కి వెళ్లాయి. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం కొత్త రూ.500, రూ.2000 నోట్లను చలామణిలోకి తెచ్చింది. 2017 ఫిబ్రవరి వరకు రూ.1.9 బిలియన్ల రూ.5 కాయిన్లు, రూ.1.03 బిలియన్ల రూ.10 కాయిన్లు చలామణిలో ఉన్నట్టు మేఘ్వాల్ చెప్పారు. అంతేకాక 2.6 బిలియన్ల రూ.10 నోట్లు, 3.6 బిలియన్ల రూ.20 నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నట్టు వెల్లడించారు.
Advertisement
Advertisement