కీలక విషయాలపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గురువారం ఢిల్లీలో సమావేశం కానుంది.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మరో 15 రోజుల సమయముండగా.. జీఎస్టీకి సంబంధించిన పన్ను రేటు, సెస్‌ల విధింపు వంటి కీలక విషయాలపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గురువారం ఢిల్లీలో సమావేశం కానుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కావటం ఇది రెండోసారి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో నాలుగంచెల పన్ను విధానం (8, 12, 18,26 శాతం) పైనా చర్చించనున్నారు.
ఈ విషయంలో సభ్యుల (రాష్ట్రాల ఆర్థిక మంత్రులు) మధ్య స్వల్ప భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ఏకాభిప్రాయం సాధిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 2017 ఏప్రిల్ 1నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.