అప్పడాలు తెగ లాగించేస్తున్నారా ? ఈ ఇంట్రస్టింగ్‌ విషయాలు మీకోసం! | Papad A Low Cal Snack And Unique Health Benefits Of Eating Papads In Telugu, More Info Inside | Sakshi
Sakshi News home page

అప్పడాలు తెగ లాగించేస్తున్నారా ? ఈ ఇంట్రస్టింగ్‌ విషయాలు మీకోసం!

Published Tue, Jul 9 2024 4:04 PM | Last Updated on Tue, Jul 9 2024 5:47 PM

papad a low cal snack and health benefits

ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గే ఆహారం గురించి మాట్లాడుకునేటప్పుడు, సాధారణంగా జంక్‌ ఫుడ్‌ తినకూడదని భావిస్తాం కదా. అలాగే  ఖరీదైన లేదా పాశ్చాత్య ఆహారం ఏముందా అని ఆలోచిస్తాం.  మన పెద్దవాళ్లు అలవాటు చేసిన కొన్ని ఆహారాల అలవాట్ల గురించి పెద్దగా పట్టించుకోం.  అసలు విషయం దేని గురించో అర్థం కాలేదు కదా, అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.

ఆరోగ్యకరమైన ఆహారం  అంటే  అది  ఫాన్సీగానో లేదా ఖరీదైనదిగా ఉండవలసిన అవసరం లేదు. మనం పప్పులోనో, సాంబారులోనో నంజుకు తినే పాపడ్‌తో కూడా  బరువు తగ్గవచ్చు! వింతగా అనిపిస్తుందా? ఇది నిజం! అమ్మ భోజనంతో పాటు అందించే  పాపడ్ రుచికరమైందీ,  ఆరోగ్యకరమైంది కూడా.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలను భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ రహితం కూడా. 

కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇనుము లాంటి పోషకాలు అప్పడాల్లో పుష్కలంగా లభిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రోటీన్స్‌ కూడా అధికం. 

అలెర్జీలు ఉన్నప్పటికీ, అప్పడాలు తినడం సురక్షితం.  అన్ని వయసుల వారు, షుగర్‌ వ్యాధి ఉన్నవారు కూడా తినవచ్చు.

నోట్‌ : ఇది అవగాహన కోసం అందించింది మాత్రమే.  అమ్మమ్మ, నానమ్మల రెసిపీతో ఇంట్లో చేసిన అప్పడాలైతే మంచిది.  మార్కెట్లో దొరికే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఎలాంటి నూనె వాడుతున్నారు అనేది కూడా కీలకమే. ఆరోగ్య ప్రయోజనా లున్నాయి  కదా అని  ఏ ఆహారాన్ని అతిగా  తీసుకోకూడదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement