చికెన్ చూస్తే చాలు చిరాకు...! | Put the chicken in the frustration | Sakshi
Sakshi News home page

చికెన్ చూస్తే చాలు చిరాకు...!

Published Tue, Feb 24 2015 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

చికెన్ చూస్తే చాలు  చిరాకు...!

చికెన్ చూస్తే చాలు చిరాకు...!

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన శరీరాకృతి ఉంటుందని అనుష్కాశర్మ తరచు చెబుతుంటారు. చెప్పడమేమిటి... ఆ సూత్రాన్ని అక్షరాల పాటించేవారు కూడా. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారు.  అడిగినా అడకగపోయినా తన ఆరోగ్య సూత్రాలు అందరికీ చెప్పేవారు.
 అంత ఆరోగ్య స్పృహ ఉన్నప్పటికీ... అనుష్కకు నాన్ వెజ్ అంటే చెప్పలేనంత ఇష్టం.  ఆమె తన ఆరోగ్య సూత్రాల గురించి చెప్పినప్పుడు ఎవరైనా-  ‘‘మరి  నాన్‌వెజ్ సంగతో...’’ అని అడిగినప్పుడల్లా-  ‘‘నో కామెంట్’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేవారు. అంత ఇష్టమన్నమాట నాన్‌వెజ్ అంటే! అలాంటి అనుష్క కాస్త్తా ‘‘ఇక నాన్‌వెజ్ తినను’’ అని గట్టిగా ప్రకటించారు.

ఆరోగ్యస్పృహలో భాగంగా తీసుకున్న నిర్ణయం కాదట ఇది. కేవలం తన పెంపుడు శునకం కోసం తీసుకున్న నిర్ణయం. ఇంతకీ విషయమేమిటంటే, అనుష్క పెంపుడు  శునకానికి నాన్‌వెజ్ వాసన అంటే పడదు! తన చుట్టుపక్కల ఎక్కడైనా నాన్‌వెజ్ స్మెల్ వచ్చినా చాలా అసహనంగా ప్రవర్తిస్తుంటుందట. అందుకే... తన పెట్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... నాన్ వెజ్‌కు గుడ్‌బై చెప్పడమే కాదు... ఎవరైనా చికెన్ ప్రస్తావన తేస్తేనే చిరాకు పడుతున్నారు అనుష్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement