Anuskasarma
-
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్‌తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్‌కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్‌స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
పోనీ టెయిల్ వేశాడు ఫ్యాషన్ బొమ్మను చేశాడు
అనుష్కశర్మ – విరాట్ కోహ్లీ... మోస్ట్ డిజైరబుల్ కపుల్. ఒకరు సినీతార, ఒకరు క్రీడా తార. ఇద్దరిదీ గ్లామర్ ఫీల్డే. సినీతారలైతే వెండి తెర మీదే కాదు బయట కూడా బంగారు బొమ్మల్లా అందంగా కనపడాలనుకుంటారు. అంతర్జాతీయ డ్రెస్ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. ఇప్పుడు మేకప్, హెయిర్ స్టయిల్స్‌కి కూడా నిపుణులను ఎంచుకుంటున్నారు. బ్రిటన్‌తోపాటు ఇతర ఐరోపా దేశాల నుంచి, అమెరికాల నుంచి ప్రత్యేకమైన హెయిర్ స్టయిలిస్ట్లను పిలిచి, ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త రకమైన హెయిర్ స్టయిల్‌తో కొత్తగా కనపడాలనుకుంటున్నారు. అనుష్క శర్మ కూడా మరింత వినూత్నంగా కనిపించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ నుంచి ఫ్లోరియన్ హ్యూరెల్ అనే హెయిర్ స్టయిలిస్టుని రప్పించుకున్నారు. వచ్చీరాగానే అనుష్కను అందాల బొమ్మలా చూపించడానికి ఫ్లోరియన్ హ్యూరెల్ తహతహలాడారు. ‘‘అక్టోబరు 27, దీపావళి రోజున అనుష్క శర్మను దీపకాంతులలో తళతళలాడుతూ, సంప్రదాయం ఉట్టిపడేలా, అందమైన పురాతన చిత్రపటంలా రెడీ చేయాలనుకున్నాను. జుట్టును లూజ్‌గా వదిలే యడం లేదా పోనీ టెయిల్ కట్టాలనుకున్నాను. పోనీ టెయిల్ అయితే చాలా అందంగా ఉంటుంది అనిపించింది. అంతే. వెంటనే అరేబియన్ గుర్రం తోకలాంటి పోనీటెయిల్ కట్టేశాను. ఆ చిన్న మార్పుతోనే అనుష్కశర్మ కళ్లలో కాంతులు కనిపించాయి’’ అని గుర్తు చేసుకున్నాడు ఈ ఫ్రెంచి స్టెయిలిష్ కుర్రవాడు. ‘ద స్కై ఈజ్ పింక్’ చిత్రంలో ప్రియాంక చోప్రాకు కూడా అతడు పనిచేశాడు. ‘అనుష్కశర్మ, విరాట్‌కోహ్లీ జంట అంటే నాకు చాలా ఇష్టం. అనుష్కశర్మ పర్ఫెక్ట్గా కనిపించడం కోసం నాకే చాయిస్ ఇస్తారు’ అని అంటాడు హ్యూరెల్. -
ఏదీ ఇంకోసారి అనూ!
ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా తీద్దామనుకుంటే హీరోయిన్ విషయంలో మాత్రం ‘అనుష్కాశర్మ అయితే బాగుంటుంది’ అని అనుకుంటున్నారు. దానికి అనుష్కా శర్మ డేట్స్ చూసేవాళ్లు మాత్రం ‘ఏదీ ఇంకోసారి అనూ’ అని కస్సుమంటున్నారు! మేడ మ్ డేట్లు అంత టైట్‌గా ఉన్నాయి.డేట్ అంటే విరాట్ కొహ్లీతో కాదు. డేట్ అంటే లిప్‌లాక్ సీన్ కోసం కాదు. డేట్ అంటే ఖర్జూర పండు కాదు. డేట్ అంటే అసలైన, సిసలైన సినిమా డేటు. డైరీ ఫుల్. కాల్షీట్స్ నాట్ అవైలబుల్. నో డేట్స్ ప్లీజ్. ఎంత కాళ్లావేళ్లా పడినా... ‘ఏదీ ఇంకోసారి అనూ’ అని మేనేజరు రుసరుసలాడుతున్నాడు. ఇంటర్వ్యూ మొదలైంది. విలేకరి: విరాట్ కోహ్లీతో.. అనుష్క: ఈ సోఫా చాలా బాగుందండీ. విలేకరి: విరాట్... అనుష్క: మీ స్టూడియో కూడా చాలా బాగుంది. విలేకరి: విరా... అనుష్క: మీ జర్నలిస్టులకు జీతాలు కూడా బాగుంటాయనుకుంటాను. విలేకరి: సరే. వేరే ప్రశ్న అడుగుతాను. అనుష్క: ఆ పని చేయండి. ఇప్పటికి పదకొండు సినిమాలు చేసిన నటికి ఒక క్రికెటర్‌తో తప్ప మరో ఉనికి లేకపోవడం ఎంత విషాదం. ఆర్మీ కుటుంబంలో పుట్టింది. బెంగుళూరులో పెరిగింది. మోడలింగ్ చేసింది. ముంబైలో ఆ రంగంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో పోరాటాలు చేసింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిస్తే ఒక రోజంతా పడిగాపులు కాసి చివరకు షారూక్‌ఖాన్ పక్కన నువ్వే హీరోయిన్ అని చెప్తే అవునా అని ఆశ్చర్యపోయింది. బ్యాండ్ బాజా బారాత్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చింది. పికె లాంటి సూపర్ డూపర్ మెగా గిగా హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రొడ్యూసర్‌గా ‘ఎన్‌హెచ్ 10’ వంటి కొత్త తరహా సినిమా చేసింది. ఇన్ని చేయగా ఇంటర్వ్యూలో కూచుని విరాట్... అనగానే మండదూ. చెంప పగుల కొట్టాలనే కోపం రాదూ? చాలా ఉంటుంది జీవితంలో.. మన ఎదురుగా నవ్వుతూ ఉన్న వాళ్ల వెనుక చాలా పోరాటం కూడా ఉంటుంది. దానిని తెలుసుకోవాలి. 2008లో ‘రబ్ నే బనాదీ జోడీ’ రిలీజ్ అయ్యింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ నిర్మించిన సినిమా అది. హీరో షారూక్. డెరైక్టర్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి చరిత్రాత్మక హిట్ ఇచ్చిన ఆదిత్య చోప్రా. హీరోయిన్ అనుష్కా శర్మ. ఇక పెట్టుకోవడానికి డౌట్స్ ఏముంటాయి? సినిమా రిలీజ్ అవుతుంది. తను సూపర్‌స్టార్ అవుతుంది. అంతే అంచనా. సినిమా రిలీజ్ అయ్యింది. కాని అనుకున్నంత ఆడలేదు. తన నటన బాగుంది. కాని అనుకున్నంత పేరు రాలేదు. ఎట్లీస్ట్ బెస్ట్ డెబ్యూ అవార్డ్ వస్తుందని ఆశించి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లింది. లోకంలో పోటీ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసింది. అండ్ అవార్డ్ గోస్ టూ.... అసిన్. అదే సంవత్సరం రిలీజ్ అయిన గజనీ ముందు ప్రేక్షకులకు అనుష్క పట్ల మరుపు వచ్చేసింది.కాన్ఫిడెన్స్ మొత్తం పోయే సందర్భం అది. జనంలో కూచుని ఏడిస్తే బాగుండదని స్టేజ్ వెనక్కు వెళ్లి ఏడుస్తూ ఉంది. ఇంతలో ఒక సీనియర్ నటుడు అవార్డు తీసుకుని వెళుతూ ఆమెను చూసి ఆగాడు. ‘అనుష్కా?’... ఆశ్చర్యపోతూ చూసింది. ‘నీ సినిమా చూశానమ్మా. చాలా బాగా చేశావ్. ఈ మధ్య అంత స్థిరంగా కనిపించిన నటనను చూడలేదు. కీప్ ఇట్ అప్’.... క్షణం క్రితం ఏ అవార్డూ లేదు. ఇప్పుడు ఇంతకు మించిన అవార్డు లేదు. మరి కాంప్లిమెంట్ చేసింది ఎవరు? అమితాబ్ బచ్చన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో మూడు సినిమాల కాంట్రాక్ట్‌లో రెండు వీగిపోయాయి. ఒకటి రబ్నే బనాదీ జోడీ. రెండు బద్మాష్ కంపెనీ. ఇక లాస్ట్ చాన్స్. బ్యాండ్ బాజా బారాత్. హీరో కూడా పెద్ద చెప్పుకోదగ్గ వాడు కాదు. రణ్వీర్ సింగ్. ఎలాగోలా చేసేసి మళ్లీ మోడలింగ్‌కు వెళ్లిపోదామా? అప్పుడే జయ్‌దీప్ సహానీ ఫోన్ చేశాడు. చక్ దే ఇండియా, ఖోస్లా కా ఘోస్లా, కంపెనీ వంటి హిట్ సినిమాల రచయిత అతడు. అనుష్కా... నీ బద్మాష్ కంపెనీ చూశాను. కొన్ని చోట్ల నువ్వు రిలాక్స్ అయిపోయావ్. ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. సినిమా హీరోను మోస్తుంది. హీరో సినిమాను మోస్తాడు. కాని హీరోయిన్ మాత్రం తనను తాను మోసుకోవాలి. నువ్వు ఇచ్చే ప్రతి షాట్ ఇదే నా ఆఖరి షాట్ అన్నట్టుగా చేయి. ఇంకో సినిమా లేదు అన్నంత బాగా పని చేయి. నిలబడతావు అన్నాడు. ఎంత గొప్ప సలహా. పాటించింది. బ్యాండ్ బాజా బారాత్ సూపర్ హిట్. డెరైక్టర్, హీరో... కాస్తో కూస్తో పేరు గడించారు. కాని అసలు పేరంతా అనుష్కా శర్మకే. ఇది పెద్ద ఇరకాటమే. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఒక రోల్ ఆఫర్ చేసింది. హీరో షారూక్ ఖాన్. కాని తను హీరోయిన్ కాదు. రెండో హీరోయిన్. మొదటి హీరోయిన్ కత్రీనా కైఫ్. వద్దు అంటే తన మాతృసంస్థ. చేస్తానంటే బయట తన పని అయిపోయింది అనే పుకార్లు. కత్రీనా పక్కన తను అస్సలు కనిపించదు అని కూడా సెటైర్లు తనకు ధ్యానం చేయడం అలవాటు. ఆరోజు ధ్యానం చేసి నిర్ణయం తీసుకుంది. ఎదుటివాళ్లు నీ గురించి ఏమనుకుంటున్నారనేదాని కంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావన్నదే ముఖ్యం. కత్రినా ఉందా షారూక్ ఖాన్ ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. నీకిచ్చిన రోల్‌ను నువ్వు సరిగ్గా చేయగలిగావా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు చేయగలవా? చేయగలను అని అంతరాత్మ సమాధానం చెప్పింది. ఆ సినిమా చేసింది. అనుష్క మంచి పాత్రలు చేయగలదు అని పేరు తెచ్చుకుంది. అనుష్కాకు నగలు కొనడం, చీటికి మాటికి దుబాయ్‌కు వెళ్లి షాపింగ్ చేయడం తెలీదు. బోర్. తను నటి కాబట్టి అద్దంలో చూసుకోవాలి తప్పదు. కాని తన పక్కన ఉన్న మగాడు కూడా అస్తమానం అద్దంలో చూసుకునేవాడే అయితే? చాలా బోర్. అందుకే సాటి నటులతో డేటింగ్ పెట్టుకోదు. ముఖ్యంగా బాత్రూమ్లో ఫేస్‌వాష్ క్రీమ్ పెట్టుకునే మగాళ్లంటే ఆమెకు అసహ్యం. తనకు ఆర్థికంగా ఇండిపెండెంట్‌గా ఉండటం ఇష్టం. నిజానికి ప్రతి స్త్రీ అలాగే ఉండాలని కోరిక. అలాంటి ప్రతి స్త్రీని గౌరవించి ఆమెకు మద్దతు పలికే మగాళ్లతో ఈ ప్రపంచం నిండాలని కూడా కోరిక. అన్నయ్యతో కలిసి సొంత నిర్మాణ సంస్థ స్థాపించడం వెనుక కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లంటే ఉత్త తోలుబొమ్మలు కాదు అని నిరూపించాలనే తాపత్రయం. ఇంత స్టార్ అయ్యాక కూడా కరెస్పాండెన్స్ ద్వారా మాస్టర్ ఆఫ్ ఎకనమిక్స్ చదువుతోంది. శాకాహారమే మేలు అని నమ్ముతూ ఆచరిస్తూ ఉంది. సంఘ ప్రయోజన కార్యక్రమాలలో పాల్గొనడం కనీస కర్తవ్యంగా భావించి వాటిలో నిమగ్నమవుతూ ఉంది. ఇన్ని చేస్తూ ఉంటే బంతి బ్యాట్‌కు తగిలినప్పుడు ఆ షాట్ అతను కొట్టినప్పుడు అని అడగడం ఆమె దృష్టిలో పనికి మాలిన పని అవుతుంది. విరాట్ గురించి తెలుసుకోవాలంటే విరాట్‌తో మాట్లాడదాం. ఇక్కడ మాత్రం- ఓన్లీ అనుష్కా. - సాక్షి ఫీచర్స్ ప్రతినిధి. -
హ్యాపీ బర్త్ డే నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ
మే 1 హ్యాపీ బర్త్ డే మీతోపాటు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారు ప్రముఖ నటుడు అజిత్, నటి అనుష్కాశర్మ ఈరోజు పుట్టినవారికి సంవత్సరమంతా సంతోషంగా, ఉత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. మీ కలలు నెరవేరతాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాలు సాధిస్తారు. అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విదేశీయాన సూచన. -
చికెన్ చూస్తే చాలు చిరాకు...!
మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన శరీరాకృతి ఉంటుందని అనుష్కాశర్మ తరచు చెబుతుంటారు. చెప్పడమేమిటి... ఆ సూత్రాన్ని అక్షరాల పాటించేవారు కూడా. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారు. అడిగినా అడకగపోయినా తన ఆరోగ్య సూత్రాలు అందరికీ చెప్పేవారు. అంత ఆరోగ్య స్పృహ ఉన్నప్పటికీ... అనుష్కకు నాన్ వెజ్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆమె తన ఆరోగ్య సూత్రాల గురించి చెప్పినప్పుడు ఎవరైనా- ‘‘మరి నాన్‌వెజ్ సంగతో...’’ అని అడిగినప్పుడల్లా- ‘‘నో కామెంట్’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవారు. అంత ఇష్టమన్నమాట నాన్‌వెజ్ అంటే! అలాంటి అనుష్క కాస్త్తా ‘‘ఇక నాన్‌వెజ్ తినను’’ అని గట్టిగా ప్రకటించారు. ఆరోగ్యస్పృహలో భాగంగా తీసుకున్న నిర్ణయం కాదట ఇది. కేవలం తన పెంపుడు శునకం కోసం తీసుకున్న నిర్ణయం. ఇంతకీ విషయమేమిటంటే, అనుష్క పెంపుడు శునకానికి నాన్‌వెజ్ వాసన అంటే పడదు! తన చుట్టుపక్కల ఎక్కడైనా నాన్‌వెజ్ స్మెల్ వచ్చినా చాలా అసహనంగా ప్రవర్తిస్తుంటుందట. అందుకే... తన పెట్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... నాన్ వెజ్‌కు గుడ్‌బై చెప్పడమే కాదు... ఎవరైనా చికెన్ ప్రస్తావన తేస్తేనే చిరాకు పడుతున్నారు అనుష్క. -
రణవీర్ ఓవరాక్షన్..!
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టుంది బాలీవుడ్ బుల్లోడు రణవీర్‌సింగ్ పని. ముంబైలోని ఓ స్టాండప్ కామెడీ షోలో ఈ కుర్రాడు స్టార్ హీరోయిన్ అనుష్కాశర్మపై తెగ రెచ్చిపోయాడట! అదీ ఇది అని లేకుండా... హద్దులు మరచిపోయి... ఆమె గురించి నోటికొచ్చిందల్లా వాగేశాడట కామెడీగా! అదీ... అతగాడి ప్రేయసి దీపికా పడుకొనే ముందు! అక్కడే ఉన్న అనుష్క ఫ్రెండ్ ఈ విషయాన్ని ఆమెకు మోసేశారట. దీంతో చిర్రెత్తిన అమ్మడు రణ్‌వీర్‌పై గరమైంది. ఈ ‘హాట్’ టాపిక్‌నూ రణ్‌వీర్‌కు చేరవేశారు మరో కామన్ ఫ్రెండ్! దెబ్బకు షేకైన రణ్వీర్ వెంటనే అనుష్కకు ఫోన్ చేసి సారీ చెప్పాడట. ఇతగాడి చేష్టలపై అనుష్క బాయ్‌ఫ్రెండ్ కొహ్లీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం! -
లవ్ బర్డ్స్..!
లేదు లేదంటూనే ఒకరికొకరు అన్నీ అయిపోతున్నట్టున్నారు క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ- బాలీవుడ్ భామ అనుష్కాశర్మా. ఆసీస్ టూర్లో ఉన్న విరాట్‌తో క్రిస్మస్, న్యూ ఇయర్ గడిపేందుకు వెళ్లిన అనుష్కా... అక్కడ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆన్ ఫీల్డ్‌లో విరాట్ నుంచి ఫ్లయింగ్ కిస్‌లు అందుకుంటున్న అమ్మడు... ఆఫ్ ఫీల్డ్‌లోనూ అతగాడిని వదిలిపెట్టకుండా తిరిగేస్తోంది. కొత్త సంవత్సరం రోజు ఈ ఇద్దరూ సిడ్నీలో క్యాజువల్ డ్రెస్సుల్లో షికార్లు కొట్టారట. నెట్లో సదరు ‘క్లిక్’లు ‘హిట్టు’ కొడుతున్నాయి. టెస్టు మ్యాచ్ కోసం ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న విరాట్‌ను ఎంకరేజ్ చేసేందుకు అనుష్క తన టూర్ కూడా కొనసాగిస్తుందని సమాచారం. -
ప్రతి పనీ ఒక యుద్ధమే!
లైఫ్‌బుక్ ‘రబ్నే బనాదీ జోడీ’తో చిత్రరంగానికి పరిచయమై పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అనుష్కశర్మ ప్రస్తుతం అమీర్‌ఖాన్ ‘పీకె’ చిత్రంలో నటిస్తున్నారు. విరాట్ కోహ్లీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఇటీవల వార్తల్లోకెక్కిన ఆమె మనసులోని మాటలు... అయిదు సంవత్సరాల తరువాత... సినీ పరిశ్రమకు వచ్చి అయిదు సంవత్సరాలు దాటి పోయాయి. ముక్కుసూటిగా మాట్లాడే నేను, మనసులో ఉన్నదే మాట్లాడే నేను ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో నెగ్గుకు రావడం విశేషమనే అనుకుంటున్నాను. తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ పేరొచ్చే సినిమాలు చేయాలని పరిశ్రమలోకి వచ్చే ముందు అనుకున్నాను. ఇప్పుడూ... దానికే కట్టుబడి ఉంటున్నాను. కాలమే పాఠాలు నేర్పిస్తుంది. గతంతో పోలిస్తే స్క్రిప్ట్‌లను అంచనా వేయడంలో, అర్థం చేసుకోవడంలో నాలో కొంత పరిణతి వచ్చింది. నిర్మాతగా... నటులతో పోల్చితే నిర్మాత అనే పోస్ట్‌కు గ్లామర్ ఉండక పోవచ్చు. రిస్క్‌లు ఉండవచ్చు. ‘‘ప్రొడ్యూసర్ అంటే మాటలు కాదు...ఎన్నో రిస్క్‌లు ఉంటాయి’’ అన్నవాళ్లు ఎందరో. అయితే సవాళ్లను ఎదుర్కోవాలనే ఉత్సాహం ఉన్నప్పుడు వెనకడుగు వేయడం ఎందుకు? ప్రయోగం లేకుండా విజయం లేదు. జీవితమే లేదు. అందుకే సినిమా నిర్మాణాన్ని ఇష్టపడతాను. మనసుకు నచ్చిన చిత్రాలు నిర్మిస్తాను. కష్టంపై ఇష్టం... ప్రతి పనిని ఒక యుద్ధంలాగే భావిస్తాను. యుద్ధంలో పొరపాట్లు చేస్తే ఓటమి ఎలాగో పనిలో కూడా అలాగే. యుద్ధం చేసే సమయంలో కనిపించే అంకితభావం, దూసుకెళ్లడంలాంటివి మనం చేస్తున్న పనిలో కూడా కనిపించాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలం. కష్టపడే వ్యక్తులతో పని చేస్తున్నప్పుడు ‘కష్టం’ మీద ‘ఇష్టం’ పెరుగుతుంది. ‘పీకె’’ సినిమాలో అమీర్‌ఖాన్‌తో పని చేసినప్పుడు పని మీద మరింత శ్రద్ధ పెరిగింది. అనుష్క శర్మ, హీరోయిన్