
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్‌తో నిసర్గ జట్టు కట్టింది.
ఎలీట్ ఆక్టేన్‌కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్‌స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment