నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్‌ సైతం | Silicon Valley Maker Of The Infamous $400 Juicer Startup Shutting Down | Sakshi
Sakshi News home page

నిమిషం వీడియో.. వెయ్యి కోట్ల కంపెనీని ఎలా కూప్పకూల్చింది! గూగుల్‌ సైతం

Published Wed, Dec 6 2023 8:08 PM | Last Updated on Wed, Dec 6 2023 8:41 PM

Silicon Valley Maker Of The Infamous $400 Juicer Startup Shutting Down - Sakshi

ఒకే ఒక్క నిమిషం వీడియో దెబ్బకు ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌తో పాటు ఇతర కంపెనీలు రూ.1000 కోట్లు నష్టపోయేలా చేసింది. నమ్మడం లేదా? లేదంటే ఎందుకు? ఎలా అంటారా? 

జ్యూసెరో మెషిన్‌. ప్రపంచంలోనే స్మార్ట్‌ వైఫై యాప్‌ కోల్డ్‌ ఫెష్‌ జ్యూసర్‌. ఈ జ్యూసెరో మెషిన్‌ సాయంతో జ్యూస్‌ తయారు చేయాలంటే ఫ్రూట్స్‌ అవసరం లేదు. జస్ట్‌ ఆ కంపెనీ తయారు చేసిన జ్యూస్‌ ప్యాకెట్లు ఉంటే చాలు. ఆ ప్యాకెట్లను మెషిన్‌లో పెట్టి బటన్‌ నొక్కితే చాలు. మెషిన్‌లో నుంచి జ్యూస్‌ డైరెక్ట్‌గా గ్లాస్‌లోకి పడిపోతుంది. అనంతరం ఆ జ్యూస్‌ను తాగొచ్చు. ఇక ఈ కంపెనీ జ్యూస్‌ ప్యాకెట్లను సబ్‌స్క్రిప్షన్ ధర పొందాల్సి ఉంటుంది.

డౌగ్‌ మాస్టర్‌ మైండ్‌ 
శాంపిల్‌ మెషిన్‌ తయారైంది. మరిన్ని జ్యూస్‌ మెషిన్‌లను తయారు చేసేందుకు, వాటిని మార్కెటింగ్‌ తయారు చేసేందుకు డబ్బులు కావాలి. అప్పుడు జ్యూసెరో ఫౌండర్‌ డౌగ్‌ ఎవాన్స్‌ తన మాస్టర్‌ మైండ్‌కి పదును పెట్టాడు. వెంటనే జ్యూసెరో మెషిన్‌ గురించి ప్రచారం చేశాడు.   

ప్రచారంతో ఊదర గొట్టాడు
ఈ మెషిన్‌ తయారీ కోసం టెక్‌ కంపెనీలు టెస్లా, యాపిల్‌ తరహాలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ చేశామని చెప్పుకొచ్చాడు. యాపిల్‌ మాజీ కో-ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ మెయిన్‌ ఫ్రేమ్‌ కంప్యూటర్‌ నుంచి యాపిల్‌ కంప్యూటర్‌ను ఎలా తయారు చేశారో నేను కూడా మెయిన్‌ఫ్రేమ్‌ జ్యూస్‌ మెషిన్‌ నుంచి జ్యూసెరో మెషిన్‌ను తయారు చేస్తున్నట్లు ఊదరగొట్టారు.

ప్రొడక్ట్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌
ఎవాన్స్‌ పబ్లిసిటీ సూపర్‌ హిట్‌ అయ్యింది. గూగుల్‌ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు జ్యూసెరో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డాయి. ఫలితంగా రూ.1000 కోట్ల కంపెనీగా అవతరించింది. ఇంకేం చేతిలో పుష్కలంగా డబ్బులు.. జ్యూసెరో మెషిన్‌ను, జ్యూస్‌ ప్యాకెట్లను పెద్ద ఎత్తున తయారు చేసింది. జ్యూసెరో మెషిన్‌ ధరను రూ.30000 వేలు పైగా నిర్ణయించింది. ఫ్రూట్స్‌ను బట్టి జ్యూస్‌ ప్యాకెట్‌ను ధరను నిర్ణయించి మార్కెట్‌లోకి విడుదల చేసింది. మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన కొద్దిరోజులు బాగానే ఉన్నా.. మెల్లిమెల్లిగా జ్యూసెరో చేసిన మోసం వెలుగులోకి రావడం మొదలైంది. 

ఆ సమయంలో  మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ జ్యూసెరో మెషిన్‌ పనితీరును వివరిస్తూ నిమిషం వీడియోను ప్రసారం చేసింది. ఆ వీడియోలో జ్యూసెరో మెషిన్‌లో నుంచి జ్యూస్‌ రావడానికి ఎంత సమయం పడుతుంది. అదే జ్యూస్‌ ప్యాకెట్లను చేతులతో పిండితే ఎంత జ్యూస్‌ వస్తుందో అంతే సమయం పడుతుందని వివరించింది. ఆ వీడియో చూసిన వినియోగదారులు జ్యూసెరో మెషిన్‌ను కొనుగోలు చేయడం మానేశారు. పైగా మెషిన్‌ ఖరీదైందని, సంస్థ  తయారు చేసిన జ్యూస్‌ ప్యాకెట్లు ఎంత కాలం నిల్వ ఉంటాయి. ప్యాకెట్లలో నిల్వ చేసిన జ్యూస్‌ను తాగొచ్చా? లేదా? ఇలా విషయాల గురించి కొనుగులో దారులు, వినియోగదారులు ఎవాన్స్‌ను నిలదీయడం మొదలు పెట్టారు. 

 దీంతో సంస్థ అప్రతిష్టను మూటగట్టుకుంది. సేల్స్‌ ఆగిపోయాయి. ఉద్యోగులు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. నష్టాలు రావడంతో సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. చివరికి చేసేది లేక ఆ కంపెనీని మూసేస్తూ నిర్ణయం తీసుకున్న ఆ సంస్థ అధినేత  డౌగ్ ఎవాన్స్. ఫలితంగా గూగుల్‌తో పాటు ఇతర సంస్థలు సైతం నష్టపోయేలా చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement