రణవీర్ ఓవరాక్షన్..! | What Made Ranveer Singh Say Sorry To Anushka Sharma? | Sakshi
Sakshi News home page

రణవీర్ ఓవరాక్షన్..!

Published Tue, Jan 27 2015 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

రణవీర్ ఓవరాక్షన్..!

రణవీర్ ఓవరాక్షన్..!

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టుంది బాలీవుడ్ బుల్లోడు రణవీర్‌సింగ్ పని. ముంబైలోని ఓ స్టాండప్ కామెడీ షోలో ఈ కుర్రాడు స్టార్ హీరోయిన్ అనుష్కాశర్మపై తెగ రెచ్చిపోయాడట! అదీ ఇది అని లేకుండా... హద్దులు మరచిపోయి... ఆమె గురించి నోటికొచ్చిందల్లా వాగేశాడట కామెడీగా! అదీ... అతగాడి ప్రేయసి దీపికా పడుకొనే ముందు! అక్కడే ఉన్న అనుష్క ఫ్రెండ్ ఈ విషయాన్ని ఆమెకు మోసేశారట.

దీంతో చిర్రెత్తిన అమ్మడు రణ్‌వీర్‌పై గరమైంది. ఈ ‘హాట్’ టాపిక్‌నూ రణ్‌వీర్‌కు చేరవేశారు మరో కామన్ ఫ్రెండ్! దెబ్బకు షేకైన రణ్‌వీర్ వెంటనే అనుష్కకు ఫోన్ చేసి సారీ చెప్పాడట. ఇతగాడి చేష్టలపై అనుష్క బాయ్‌ఫ్రెండ్ కొహ్లీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement