rajendra
-
మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..
సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్/చిట్టినగర్: విజయవాడ వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్ సప్లయీస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్ సప్లయీస్లోనే డెప్యూటీ కలెక్టర్‌గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. మాయమాటలతో బురిడీ పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్ కొనిపించుకుంటాడు. ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు) ఎలా పట్టుబడ్డాడంటే.. గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్‌తో పాటు స్టోర్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అరవింద్‌కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం పలు దఫాలుగా అరవింద్ నుంచి డిపాజిట్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్‌తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్‌కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్‌చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్‌కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
ఎస్బీఐ మొండి బకాయిలు అన్ని కోట్లా? షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందించిన రుణాల్లో 1,71,953 కోట్ల రూపాయలకు పైగా మొండి బకాయిలు ఉన్నాయని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేయని మొండి బకాయిలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు రుణాలను తీసుకొని తిరిగి చెల్లించని అప్పులు ఎన్ని ఉన్నాయనే సమాచారాన్ని భారత రిజర్వ్ బ్యాంకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుని తెలుసుకున్న రాజేంద్ర పల్నాటి ఆ వివరాలను బయట పెట్టారు. వీటితో పాటుగా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపారాల కోసం నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)లో భాగంగా అప్పుగా ఇచ్చిన లోన్లు 1,06,804 కోట్ల రూపాయలు ఇంకా తిరిగి రాలేదని భారతీయ స్టేట్ బ్యాంక్ పీఐఓ ములుకుంట్ల శ్రీనివాస్ రావు తెలిపారు. -
న్యాయమైన ఆశయం
పెద్దవాళ్లు, చుట్టుపక్కల వాళ్లు చేసేది చూసి పిల్లలు అనుకరిస్తుంటారు. కొంతమంది అనుకరణతో ఆగిపోకుండా వాళ్లలాగే తామూ ఎదగాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన అమ్మాయే 23 ఏళ్ల కార్తీక గెహ్లాట్. తండ్రి ఉద్యోగరీత్యా డ్రైవర్. న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడం ఆయన పని. చిన్నప్పటి నుంచి నాన్న నడిపే కారులో ఎంతో హుందాగా ఉండే న్యాయమూర్తులను దగ్గర నుంచి చూసిన కార్తీక తను కూడా జడ్జీ కావాలనుకుంది. నేను పెద్దయ్యాక నల్లకోటు ఆఫీసర్ అవుతాను అని అనుకరించి చూపిస్తూండేది. అది చూసిన వారంతా చిన్నపిల్ల చేష్టలనుకునేవారు. కానీ నేడు కార్తీక జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో మంచి మార్కులతో 66 ర్యాంకు సాధించి పిల్లచేష్టలు కాదు, మరికొన్నేళ్లలో జడ్జి్జని కాబోతున్నానని చెప్పకనే చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జోద్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గెహ్లాట్ ముద్దుల కూతురే కార్తీక గెహ్లాట్. 31ఏళ్లుగా ప్రధాన న్యాయమూర్తులెందరికో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు రాజేంద్ర. రాజస్థాన్ హైకోర్టులో పనిచేస్తున్న ఎంతోమంది జడ్జీలను, లాయర్లను చూస్తూ పెరిగిన కార్తీక తాను కూడా పెద్దయ్యాక జడ్జి కావాలనుకునేది. ఆరోతరగతిలో ఉండగా నల్లకోటు వేసుకుని న్యాయస్థానంలో పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ఆదిశగా అడుగులు వేస్తూ... జో«ద్‌పూర్‌లోని సెయింట్ ఆస్టిన్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తరువాత జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీలో ఐదేళ్ల బిబిఏ.ఎల్ఎల్.బి. పూర్తిచేసింది. ఈ ఏడాదే డిగ్రీ పూర్తిచేసినప్పటికీ జడ్జీ అయ్యేందుకు 2019 నుంచి సన్నద్ధమవడం ప్రారంభించింది. ఒక పక్క సెమిస్టర్ పరీక్షల కోసం చదువుతూనే, మరోపక్క పిలిమినరీ, మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యేది. కరోనా సమయంలో ఆఫ్‌లైన్ క్లాసులు అందుబాటులో లేకపోవడంతో, ఆన్లైన్ తరగతులకు హాజరవుతూ సిలబస్ పూర్తిచేసింది. ఇదే సమయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మాథూర్, జిల్లా సెషన్స్ జడ్జి మండల్ ప్రసాద్ బోహ్రాల వద్ద లా గైడెన్స్, అడ్వకేట్ ధర్మేంద్ర వద్ద ఏడాదిన్నరపాటు టెక్నికల్ గైడెన్స్, మాజీ ఐఏఎస్ అధికారి, తన మాజీ స్కూలు ప్రిన్సిపాల్ వంటివారందరి సలహాలు సూచనలతో రోజుకి నాలుగు గంటలు కష్టపడి చదివేది. పరీక్ష తేది ప్రకటించిన తరువాత ప్రిపరేషన్‌ను పది నుంచి పన్నెండు గంటలకు పెంచింది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో అన్నింటికీ దూరంగా ఉండి తన లక్ష్యంపై దృష్టిపెట్టి రాజస్థాన్ జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించింది. దీంతో తన చిన్ననాటి కల జడ్జీ కావడానికి మొదటి అడుగు వేసింది. నేను న్యాయమూర్తులను కోర్టుకు తీసుకెళ్లడాన్ని అప్పుడప్పుడు కార్తీక చూసేది. అలా చూస్తూ పెరిగిన ఆమె 12 ఏళ్ల వయసులో ఒకరోజు నేను కూడా త్వరలో నల్లకోటు వేసుకుని జడ్జిని అవుతానని చెప్పింది. అప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. కార్తీక మాత్రం అప్పటి నుంచి జడ్జిఅవ్వాలన్న కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతూనే ఉంది. వాళ్ల అమ్మకూడా∙తనని అన్ని విధాల సాయపడుతూ అండగా ఉండడంతో ఈ రోజు తన కలను సాకారం చేసుకుంది. ఏళ్లుగా ఎంతోమంది జడ్జీలను వెనుకసీట్లోకూర్చోపెట్టి తిప్పాను. భవిష్యత్‌లో నా కూతురు కూడా వారిలా వెనుకసీట్లో కూర్చోబోతున్నందుకు సంతోషంగా ఉంది. – కార్తీక తండ్రి రాజేంద్ర గెహ్లాట్ పెళ్లికాదని భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లు లా చదువుతామంటే ఇష్టపడరు. లా చదివిన అమ్మాయిలకు పెళ్లిళ్లు కావు అని భయపడతారు. ఇలాంటి అపోహలు పోవాలంటే ప్రతి ఒక్కరికి చట్టం గురించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. అప్పుడు తమ హక్కుల గురించి ధైర్యంగా పోరాడగలుగుతారు. నలుగురు సంతానంలో నేను ఒకదాన్ని. ప్రారంభంలో నా నిర్ణయాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత కష్టపడి చదవడం చూసి ప్రోత్సహించారు. వారి సహకారంతో ఈ రోజు ఇంతమంచి ర్యాంకును సాధించగలిగాను. నన్ను ప్రేరణగా తీసుకుని నా తోబుట్టువులు సైతం లా చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నా ప్రిపరేషన్లో ఆన్లైన్ యాప్స్‌తో పాటు, ఏకాగ్రతతో చదవడానికి సంగీతం చాలా బాగా ఉపయోగపడ్డాయి. – కార్తీక -
రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జైపూర్: తన రాజ్యసభ ఓటుకు రూ.25 కోట్లు ఆఫర్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ గుఢా. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయాలని, అందుకు తనకు రూ.25 కోట్లు ఇవ్వజూపారని పేర్కొన్నారు సైనికుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి గుఢా. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజస్థాన్‌లో రాజకీయ దుమారానికి దారి తీశాయి. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) నుంచి 2019లో కాంగ్రెస్‌లో చేరారు రాజేంద్ర. 2020లో సీఎం అశోక్ గెహ్లోత్‌పై తిరుగుబాటు చేయాలంటూ.. రూ.60 కోట్ల ఆఫర్ వచ్చిందన్నారు. అయితే.. ఆ రెండు ఆఫర్లను తాను తిరస్కరించానని పేర్కొన్నారు మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా. కానీ, ఏ నేత, పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఈ ఆరోపణలు చేశారు. ఝుంఝునులో సోమవారం ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు..‘ఓ వ్యక్తికి ఓటు వేసేందుకు నాకు రూ.25 కోట్ల ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నా భార్యను అడిగాను. డబ్బులు వద్దు మంచి పేరుంటేచాలని నాతో ఆమె చెప్పింది. అలాగే.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు.. నాకు రూ.60 కోట్ల ఆఫర్ వచ్చింది. అప్పుడు నా కుటుంబం, నా భార్య, కుమారుడు, కూతురిని అడిగాను. వారు డబ్బులు వద్దని చెప్పారు. అలా ఆలోచించే వారు మీతో ఉంటే అంతా మంచే జరుగుతుంది.’ అని సమాధానమిచ్చారు మంత్రి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగులు ఎమ్మెల్యేల్లో రాజేంద్ర గుఢా ఒకరు. 2019లో కాంగ్రెస్‌లో చేరారు. 2020, జులైలో సచిన్ పైలట్ సహా మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు.. గెహ్లోత్ క్యాంప్‌లోనే ఉన్నారు గుఢా. 2021లో మంత్రివర్గ విస్తరణలో గుఢాకు సహాయ మంత్రి పదవి దక్కింది. తమ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఆఫర్ ఇస్తూ తమ ప్రభుత్వాన్ని బీజేపీ అస్తిరపరచాలని చూస్తోందని పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్. ఈ ఏడాది జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. స్వతంత్ర అభ్యర్థి సుభాశ్ చంద్రకు బీజేపీ మద్దతు తెలిపింది. ముగ్గురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఇదీ చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి! -
సీనియర్ పాత్రికేయులు ఎం.రాజేంద్ర కన్నుమూత
బంజారాహిల్స్: సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత ముత్తిరేవుల రాజేంద్ర (84) బంజారాహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాజేంద్ర ఇండియాటుడే తెలుగు ఎడిషన్‌కు మొదటి ఎడిటర్‌గా పనిచేయడంతో పాటు కథా రచయితగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన ఈనాడు చీఫ్ సబ్ఎడిటర్గా, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జనతా పత్రికలలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత రాజేంద్రదే. చిత్తూరు జిల్లా అరగొండకు చెందిన రాజేంద్ర అపోలో ఆస్పత్రిచైర్మన్ ప్రతాప్‌రెడ్డికి బంధువు. ఆయన అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు.. -
కల్యాణ్‌రామ్19వ చిత్రం మార్చిలో షురూ
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 19వ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 14వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. హీరో కల్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యర్నేని, సీఈఓ చెర్రీ కలసి రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘మార్చి రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యర్నేని అనిల్, సీఈఓ: చెర్రీ. -
ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడిగా రాజేంద్ర
సాక్షి, కాచిగూడ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడిగా ఎస్.రాజేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ రాజేందర్ గవాయ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌బాబులతో కలిసి రాజేంద్ర మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను దేశవ్యాప్తంగా మరింత అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి దళితుల డిమాండ్లను అమలు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఎన్. శాంతలక్ష్మి, టి.పద్మారావు, పి.గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆదివారం అర్ధరాత్రి ఇంటిపైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ ఎస్ఐ శివగంగాధర్‌రెడ్డి కథనం మేరకు.. ఆదర్శనగర్‌లో నివాసముంటున్న బేల్దారి రాజేంద్ర(26) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నారు. నాటి నుంచి అమ్మా, నాన్నల వద్దే ఉంటున్న రాజేంద్ర ఆదివారం మనస్థాపం చెంది ఇంట్లో అంతా నిద్రపోయిన తర్వాత చీరతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ తెలిపారు. -
కీచక కానిస్టేబుల్‌పై నిర్భయ కేసు నమోదు
కదిరి: ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఎంచుకున్న పోలీస్ వృత్తికే ఓ కానిస్టేబుల్ మాయని మచ్చ తెచ్చిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కదిరిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర తన కీచక బుద్ధిని ప్రదర్శించాడు. తన మాజీ స్నేహితురాలైన వ్యవసాయ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె కాపురంలో కల్లోలం సృష్టించాడు. ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె భర్తకు పంపించడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ రాజేంద్రపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గత ఏడాది అత్యాచారం..ఇపుడు హత్య
సంబల్: ఉత్తరప్రదేశ్‌లోని సంబర్ జిల్లాలో దారుణం జరిగింది. గత ఏడాది అత్యాచారానికి గురైన 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడే.. బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం అహ్రౌలా నవాజీ గ్రామానికి చెందిన విజయ్ గత ఏడాది ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతని స్నేహితునితో కలిసి మంగళవారం బాలికపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం స్థానిక అలీఘర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. కాగా నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. మరోవైపు విజయ్‌పై రేప్ కేసు పెట్టామనే కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్, అతని స్నేహితుడు రాజేంద్రతో కలిసి తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారని వారు ఆవేదన వక్తం చేశారు. -
వీడిన హత్యకేసు మిస్టరీ
తాడుతో గొంతు బిగించి హత్యచేసి రైలు పట్టాలపై పడేసిన వైనం.. ఎర్రచందనం రవాణాలో విభేదాలే కారణం నలుగురు నిందితుల అరెస్టు వడమాలపేట: గత ఏడాది నవంబర్ 15వ తేదీన పూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడిని హత్య చేసి పడేసిన సంఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు తిరుపతి అదనపు ఎస్పీ త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం వడమాలపేట పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 15వతేదీన ఓ యువకుడిని హత్యచేసి పూడి రైల్యేస్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై పడేశారు. హతుడి వేలిముద్రల ఆధారంగా పలమనేరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన జి. రాజేంద్రగా (23) గుర్తించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించే బాధ్యతను స్వీకరించిన రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, వడమాలపేట ఎస్ఐ ఈశ్వరయ్యలు రాజేంద్ర కుటుంబ సభ్యులను కలసి కొంత సమాచారం సేకరించారు. కొంతమంది అనుమానితుల పేర్లు తీసుకొని వారిపై నిఘావేశారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర, చిన్నగొట్టిగల్లు మండలం పిచ్చికుంట్లపల్లికి చెందిన వెంకటరమణ, పాపానాయుడుపేటకు చెందిన టి.రవి, తిరుపతి ఎస్టీయు కాలనీకి చెందిన హరిలు రాజేంద్రతో కలసి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు. వ్యాపారంలో గొడవలు రావడంతో రాజేంద్ర వారి నుంచి విడిపోయాడు. ఆ తర్వాత జ్ఞానేంద్ర తదితరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికారు. తమ గురించి రాజేంద్రనే పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకొన్నారు. గొడవలు మరచి పోయి అందరం కలిసి వ్యాపారం చే ద్దామని రాజేంద్రను నమ్మించి పులిచర్లకు రప్పించారు. అక్కడ అందరూ కలసి మద్యం తాగారు. తరువాత కారులో తిరుపతికి బయలు దేరారు. రాజేంద్ర మత్తులో ఉండగా తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. తమకు అందిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య తామే చేసినట్లు వారు అంగీకరించారు. నిందితుల్లో ఒకడైన జ్ఞానేంద్రకు తమిళనాడు లోనూ పలు దోపిడీలు, దొంగతనాలతో సంబంధం ఉందని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను పుత్తూరు కోర్టుకు తరలించగా రిమాండ్‌కు ఆదేశించారు. మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐలకు రివార్డులు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
పరిశుభ్రతలో ఆదర్శంగా ఉందాం
యూనివర్సిటీ క్యాంపస్ : పరిశుభ్రతలో ఎస్వీ యూనివర్సిటీ ఆదర్శంగా ఉండాలని వీసీ రాజేంద్ర పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాంపస్‌లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి, చెత్తకుప్పలు తొలగించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్వీయూ పరిపాలనా భవనం వద్ద సభ నిర్వహించారు. ఈ సమావేశంలో వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘జన్మభూమి-మా వూరు’ ఒక యజ్ఞంలా జరుగుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు ఆదర్శంగా ఉండాలన్న భావనతో ఎస్వీయూ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం వీసీ రాజేంద్ర, రెక్టార్ జయశంకర్, రిజిస్ట్రార్ దేవరాజులు మొక్కలు నాటారు. చివరగా ఎస్వీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల విద్యార్థులతో కలసి సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. -
సిటీలో చిరుత
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో చిరుత సంచరించిందనే వార్త మరోసారి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కిద్వాయ్ గార్డెన్ ప్రాంతంలో రెండు చిరుతలు కనిపించాయని అక్కడి సెక్యూరిటీగార్డుతో పాటు అటుగా వెళ్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి తెలపడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలపడంతో వారు వచ్చి, స్థానిక యువకులతో కలసి కిష్టమ్మగుట్ట, పరిసర ప్రాంతాల్లో వెతికారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి నేల చిత్తడిగా మారడంతో చిరుత సంచరించినట్టు చెబుతున్న ప్రాంతంలో అడుగుజాడలు కనిపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తాను కిద్వాయ్ గార్డెన్ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తుండగా, కిష్టమ్మగుట్ట వైపు వెళ్తూ చిరుత కనిపించిందని సెక్యూరిటీ గార్డు అంజయ్య స్థానికులకు తెలిపాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న విక్రమ్‌కుమార్ కిస్మత్పూర్ నుంచి బుద్వేల్ వైపు వస్తుండగా రెండు చిరుతలు వంతెన దాటుతూ కనిపించాయి. దీంతో అతను గ్రామంలోకి వెళ్లి స్థానికులకు విషయం తెలిపాడు. వారు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడి నేలపై పులి అడుగుజాడలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. రాజేంద్రనగర్ పోలీసులకు, ఏజీ వర్సిటీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు మాత్రం చిరుత సంచారం లేదంటూ కొట్టిపారేశారు. సందర్శించిన సెక్యూరిటీ ఇన్చార్జ్, ఏఆర్ఐ అధికారులు.... కిద్వాయ్ గార్డెన్ పరిసరాలలో చిరుత సంచరించిందనే సమాచారాన్ని సెక్యూరిటీ ఇన్చార్జ్ నజీర్ అహ్మద్‌కు అందించారు. ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాటేజీ ఇన్చార్జ్ కృష్ణపంతులు, ఏఆర్ఐ ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డిలు గార్డెన్ వద్దకు వచ్చి సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులతో మాట్లాడి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రంగారెడ్డి డీఎఫ్‌వోకు వివరించనున్నట్లు ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. భయం భయం చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న కిష్టమ్మగుట్ట, బుద్వేల్, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి చిరుతజాడ కనిపించిందని తెలిపినా పోలీసులు, అటవీశాఖ అధికారులు స్పందించ లేదని ఆరోపిస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.30 నుంచే పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. అధికారుల పరిశీలన రాజేంద్రనగర్‌లోని కిద్వాయ్గార్డెన్, కిష్టమ్మగుట్ట పరిసర ప్రాంతాలలో చిరుత సంచరించిన ప్రాంతాలను బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులు ఆయా ప్రాంతాలలో చిరుత పాదాల ముద్రలు ఉన్నాయంటూ చూపించడంతో వాటిని సేకరించడంతో పాటు ఫొటోలు తీశారు. వాటిని ల్యాబ్‌లో పరిశీలించడంతో పాటు నిపుణులకు చూపించనున్నట్లు డీఎఫ్‌వో గురుప్రసాద్ తెలిపారు. తమ సిబ్బంది గాలించారని, చిరుత జాడ తెలియలేదన్నారు. -
కేసీఆర్‌కు గుడి కట్టారు!
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏజీ వర్సిటీ)లో టీఆర్ఎస్వీ విభాగం విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గుడి కట్టారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం పక్కన గుడిని ఏర్పాటు చేసి, అందులో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించారు. గుడిపై జై తెలంగాణ నినాదంతోపాటు కేసీఆర్ గుడి అని రాశా రు. గుడి కోసం రూ.10 వేలు ఖర్చు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. నేడు వ్యవసాయ వర్సిటీకి కేసీఆర్ రాక సీఎం కేసీఆర్ బుధవారం రాజేంద్రనగర్‌కు రానున్నా రు. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. -
పునర్నిర్మాణంలో ఉద్యోగులదే కీలకపాత్ర
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: మలివిడత తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రను పునర్నిర్మాణసమయంలో పోషిస్తామని, భవిష్యత్తులో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఇంటిగ్రెటెడ్ హాస్టల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం ఏదైనా ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం టీఎన్జీవో నేతృత్వంలో ఉద్యోగులు పోరాటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటారన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె, సాగరహారం, మిలీనియం మార్చ్, ఢిల్లీ సంసద్ యాత్రలో టీఎన్జీవో పాత్ర ముఖ్యంగా ఉందన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ కోసం ఈ ప్రాంత ఉద్యోగులుగా ఉద్యమించామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎక్కడి ఉద్యోగులు అక్కడే, ఎక్కడి పింఛన్లు అక్కడే అనే వాదన వినిపించడాన్ని టీఎన్జీవో తీవ్రంగా ఖండిస్తోందన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విద్యాభ్యాసం, అపాయింట్మెంట్ను ప్రమాణికంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ డిప్యూటేషన్ల పేరిట సీమాంధ్రకు చెందిన 1.22 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నట్లు అధికార రికార్డులు చెబుతున్నాయన్నారు. 68 వేల మంది ఉద్యోగుల అక్రమ డిప్యూటేషన్లపై ప్రభుత్వం సర్వీస్ బుక్కులు లేవని కుంటి సాకులు చెప్పడం విచారకరమన్నారు. తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల పాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగులకు సమ్మెకాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పదో పీఆర్సీలో 69 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్రమైన ఆరోగ్య బీమా కార్డులను ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్యాంరావ్, విక్రమ్, జెల్ల సుధాకర్, సిద్దిపేట తాలూకా అధ్యక్షులు శ్రీహరి, అశ్వాక్, శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌వర్మ, రామారావు, విక్రమ్‌రెడ్డి తదితతరులు పాల్గొన్నారు. -
ఎస్వీయూలో ఉద్యోగాలు రెడీ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీయూ అధికారులు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతి లభించింది. ఇక నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలస్యం. నోటిఫికేషన్ కూడా వారంలోపే రానుంది. ఎస్వీయూ పాలకమండలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. వీసీ రాజేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో 268 పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఇందులో 110 అసిస్టెంట్ప్రొఫెసర్లు, 93 అసోసియేట్ ప్రొఫెసర్లు, 65 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఏడేళ్ల తర్వాత ఎస్వీయూలో చివరిసారిగా 2007లో 120 అధ్యాపక పోస్టులు భర్తీ చేశారు. అనంతరం పోస్టుల భర్తీ జరగలేదు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో పలువురు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో చాలా విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో 2012 జూన్ 30న వీసీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర తాను బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే పోస్టుల భర్తీపై దృష్టిసారించారు. ముందుగా వివిధ విభాగాల్లో ఖాళీలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. 2013 జూలై 30న ఎస్వీయూలో 268 పోస్టుల భర్తీకి రాష్ర్ట ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి అవసరమైన ప్రక్రియను చేపట్టారు. అధికారులు రోస్టర్ సిద్ధం చేయడం, వాటి అనుమతులు తీసుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం వెనుక ముఖ్యనేత సోదరుని అనుగ్రహం, ఆశీస్సులు ఉండడంతో ప్రక్రియలు చకచకా జరిగిపోయాయి. పాలకమండలి సమావేశం ముందురోజు కూడా ఎస్వీయూ అధికారులు ముఖ్యనేత సోదరుని ఆశీస్సులు తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో శుక్రవారం నిర్వహించిన పాలకమండలి సమావేశం పోస్టుల భర్తీకి పాలకమండలి అనుమతించింది. దీంతో నోటిఫికేషన్ విడుదలకు కావాల్సిన అడ్డంకి తొలగింది. నోటిఫికేషన్‌ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని అధికారులు సంకల్పంతో వున్నారు. ఆశలపల్లకిలో అభ్యర్థులు ఎస్వీయూలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఏడేళ్ళ తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆశావహులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. ఇప్పటికే అమాత్యుల ద్వారా పోస్టును దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన అస్త్రాలను కూడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. పీలేరుకు పీజీ కళాశాల ఎస్వీయూనివర్సిటీ పీజీ కళాశాలను పీలేరులో ఏర్పా టు చేయడానికి పాలకమండలి అనుమతించింది. ఐదు విభాగాలతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం 25 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ప్రభుత్వం కేటాయించింది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా వున్నాయి. - వర్శిటీకి అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చే ‘సెంట్రల్ పర్చేజింగ్ కమిటీ’కి సంబంధించిన విధి విధానాలను సరళీకృతం చేయడానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది. - ఫిజిక్స్ విభాగంలోని ఎంసెట్ రాడార్ కేంద్రం, డీఎస్టీ పర్స్ ప్రోగ్రామ్‌లకు పరికరాల కొనుగోలుకు పాలకమండలి అనుమతించింది. - కాంపిటేటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. - మహిళా హాస్టల్లోని హాస్టల్ భవనంపై రెండో అంతస్తు నిర్మాణానికి, కొన్ని విభాగాల్లో అకడమిక్ భవనాల విస్తరణ పనులకు పాలకమండలి అనుమతించింది. -ఫిజికల్ సైన్స్, లైఫ్‌సెన్సైస్ బ్లాకులలో రీవైరింగ్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. - శ్రీనివాస ఆడిటోరియంలో కుర్చీలను బాగు చేయించుకోవడానికి పాలకమండలి అనుమతించింది. - మలేషియా యూనివర్సిటీతో విద్యా, పరిశోధనల్లో ఉమ్మడి సహకారం కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది. -ఫైనాన్స్,అకౌంట్స్ శాఖలను పునర్వ్యవస్థీకరించడానికి అనుమతి తెలిపింది. ఈపాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి, రెక్టార్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్ బ్యాంకింగ్ రంగానిదే
తిరుచానూరు, న్యూస్‌లైన్: భవిష్యత్ బ్యాంకింగ్ రంగానిదేన ని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ డబ్ల్యూ.రాజేంద్ర స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శ్రీ సాయి గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ‘బ్యాంకింగ్ రం గంలో బ్యాంకు ఉద్యోగాలు సాధించడం ఎలా’ అంశంపై ఉచిత అవగాహన సద స్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ రాజేంద్ర హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మా ట్లాడుతూ రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఎనలేని ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. శ్రీసాయి గురురాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో శిక్షణ పొం దిన విద్యార్థులు సుమారు 10 వేల మం ది బ్యాంకింగ్ రంగంలో వివిధ హోదా ల్లో స్థిరపడడం అభినందనీయమన్నా రు. కోచింగ్ సెంటర్ చైర్మన్ దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం మిన హా ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నా రు. ఇలాంటి సమయంలో విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకుని బ్యాంకింగ్ రంగం వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలను కోచింగ్ సెంటర్ ఎండీ పీ.మౌలాలిరెడ్డి వివరించారు. అంతకుముందు కోచింగ్ సెంటర్ రూపొందించిన పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ అకడమిక్ అడ్వైజర్ శౌరిరెడ్డి, మహతి ఏఈ సదాశివం పాల్గొన్నారు. -
భార్యపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం
=దంపతుల పరిస్థితి విషమం =దిక్కుతోచని చిన్నారి మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: కుటుంబ సమస్యలపై దంపతులు గొడవపడ్డారు. ఆగ్రహించిన భర్త కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె చనిపోయిం దని భావించి తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సోమవారం మదనపల్లె రూరల్ మండలంలో విషాదం మిగిల్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లె పంచాయతీ బోడువారిపల్లెకు చెందిన రమణ, గౌరమ్మ దంపతుల కుమారుడు రాజేంద్ర(32) కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ తాలూకా కొత్త మంగళానికి చెందిన వెంకటేష్, మంగమ్మ కుమార్తె ఆశ(28)ను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. రాజేంద్ర ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ మదనపల్లె- పుంగనూరు రోడ్డులోని బసినికొండలో కాపురం పెట్టాడు. వీరికి పెళ్లైన ఆరేళ్ల తర్వాత పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాపకు ఏడాదిన్నర వయస్సు ఉంది. ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం పాపకు తీవ్ర జ్వరం రావడంతో ఆశ భర్తకు ఫోన్‌చేసి వెంటనే ఆస్పత్రికి రావాలని చెప్పింది. భర్త చాలా ఆలస్యంగా వెళ్లాడు. ఇద్దరూ ఇంటికెళ్లిన తర్వాత పాపకు జబ్బు చేస్తే ఆస్పత్రికి వచ్చేంత సమయమూ లేదా..?అని భార్య ప్రశ్నించింది. దీంతో ఇద్దరూ తగువులాడుకున్నారు. అంతే భర్తపై అలిగిన ఆశ కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత రాజేంద్ర భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్త ఇంటికి రెండుసార్లు వెళ్లాడు. అత్తామామలు, బావమర్దులు ఆశను కాపురానికి పంపకపోగా రాజేంద్రను అవమానపరిచి కొట్టారు. దీంతో అతను ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల క్రితం ఆశను మేనమామ వెంటబెట్టుకుని రాజేంద్ర ఇంటికి వచ్చాడు. దంపతులిద్దరికీ నచ్చజెప్పి వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో ఆదివారం రాత్రి దంపతులిద్దరూ తిరిగి గొడవ పడ్డారు. తెల్లవారి నిద్రలేవగానే మళ్లీ గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన రాజేంద్ర ఇంట్లో ఉన్న కట్టెతో భార్య తలపై మోదాడు. ఆమె మెదడు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయింది. చనిపోయిందేమోనని భావిం చిన రాజేంద్ర కత్తితో తన గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆపై తన కుమార్తెను తీసుకుని రక్తస్రావం అవుతుండగానే ఆటోలో మదనపల్లె ఆస్పత్రికి చేరుకున్నాడు. తన భార్యను హత్యచేసి, తాను ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పాడు. ఆ వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేంద్ర కుమార్తెను ఆస్పత్రి సిబ్బంది చేరదీశారు. రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ ప్రాణాలతోనే ఉండడంతో ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. పరీక్షించిన వైద్యులు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నరకయాతన అనుభవించిన ఆశ భార్యాభర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు రాజేంద్ర తల్లిదండ్రులు, అక్క రమణమ్మలకు తెలిసింది. వారు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆశ పరిస్థితి విషమంగా ఉందని, పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినప్పటికీ తమకేమీ పట్టనట్లు వెళ్లిపోయారు. రక్తస్రావం ఆగకపోవడంతో ఆశ నరకయాతన అనుభవించింది. ఆఖరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆశ కుటుంబసభ్యులు వచ్చి తమ బిడ్డను కోలారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బిడ్డ పరిస్థితి దయనీయం రాజేంద్ర, ఆశ దంపతుల కుమార్తె ప్రతిభ పరిస్థితి దయనీయం గా మారింది. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముక్కుపచ్చలారని ఆ చిన్నారికి ఏమి జరిగిందో తెలియక ఆస్పత్రి సిబ్బంది వద్దే ఉండిపోయింది. ఏడ్చినప్పుడు వాళ్లు పాలబుడ్డి ఇవ్వడంతో పాలు తాగుతూ ఏడుపు ఆపేసేది. దీన్ని చూసిన సిబ్బంది, స్థానికులు అయ్యో పాపం అంటూ కన్నీటి పర్యంతమవడం కనిపించింది. -
అందరి చూపూ ఆ పోస్టులపైనే
యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీయూలో అందరి చూపూ అధ్యాపక పోస్టులపైనే ఉంది. ఎస్వీయూలో 268 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఇందులో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్, 95 అసోసియేట్ ప్రొఫెసర్, 63 ప్రొఫెసర్ పోస్టులున్నాయి. అధికారులు రోస్టర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి, జనవరి నెలాఖరుకు పోస్టులు భర్తీ చేయాలన్న దిశగా పనిచేస్తున్నారు. ఆశల పల్లకిలో అభ్యర్థులు ఎస్వీయూలో 2007 తర్వాత అధ్యాపక పోస్టుల ను భర్తీ చేయలేదు. 625 అధ్యాపకుల పోస్టుల్లో 300 ఖాళీగా ఉన్నాయి. 2015 చివరికల్లా మరో 200 మంది రిటైర్డ్ కానున్నారు. 125 మంది అధ్యాపకులు మాత్రమే మిగులుతున్నారు. ఈ నేపథ్యంలో 268 పోస్టుల భర్తీకి అనుమతి రావడంతో నిరుద్యోగులు వాటిపై ఆశలు పెంచుకున్నారు. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. కేసుల అడ్డంకి తొలగేనా? ఎస్వీయూలో 2007లో జరిగిన అధ్యాపక పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయంటూ పలువురు కోర్టుకెళ్లారు. ఇందులో రెండు కేసులు బలంగా ఉన్నాయి. ఒకటి రోస్టర్‌కు సంబంధిం చింది కాగా, మరొకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు బోధనానుభవం లేని వారికి కట్టబెట్టారని ఆరోపిస్తూ వేసిన కేసు. ఈ కేసులు వేసిన వారిని రాజీ చేయించి ఎత్తి వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసులు వేసిన వారు కూడా నిర్ధిష్ట హామీ లభిస్తే వెనక్కి తీసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఇదే జరిగితే నోటిఫికేషన్‌కు అడ్డంకి తొలగినట్లే. మొదలైన బేరసారాలు ఎస్వీయూ వీసీగా రాజేంద్ర, రిజిస్ట్రార్‌గా సత్యవేలురెడ్డి విధుల్లో చేరిన రోజు నుంచే అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. వీరికి జిల్లాకు చెందిన ముఖ్యనేత అండదండలు ఉండడంతో ప్రయత్నాలు ఫలించాయి. 268 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో ఆశావహులు రంగంలోకి దూకారు. ఇదే సమయంలో మధ్యవర్తులు తెరపైకి వచ్చారు. ఆశావహులను గుర్తించి అందిన కాడికి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు రూ.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు రూ.25 లక్షలు పలుకుతోందని సమాచారం. ఇందులో సగం డబ్బులిస్తే అభ్యర్థి కోరుకున్న విభాగంలో, కోరుకున్న కేటగిరిలో పోస్టు వచ్చేలా చేస్తామని మధ్యవర్తులు హామీలు గుప్పిస్తున్నారు. కొంద రు అభ్యర్థులు ఉన్నతాధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని చూస్తున్నా రు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని పోస్టులకు అభ్యర్థులు ఖరారయ్యారని, నోటిఫికేషన్ రావడమే ఆలస్యమనే ప్రచారం సాగుతోంది. -
జాయింట్ కన్వీనర్ కె.రాజేంద్రతో సాక్షి వేదిక