
కేసీఆర్‌కు గుడి కట్టారు!
రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏజీ వర్సిటీ)లో టీఆర్‌ఎస్వీ విభాగం విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గుడి కట్టారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏజీ వర్సిటీ)లో టీఆర్‌ఎస్వీ విభాగం విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గుడి కట్టారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం పక్కన గుడిని ఏర్పాటు చేసి, అందులో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి పూజలు నిర్వహించారు. గుడిపై జై తెలంగాణ నినాదంతోపాటు కేసీఆర్ గుడి అని రాశా రు. గుడి కోసం రూ.10 వేలు ఖర్చు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
నేడు వ్యవసాయ వర్సిటీకి కేసీఆర్ రాక
సీఎం కేసీఆర్ బుధవారం రాజేంద్రనగర్‌కు రానున్నా రు. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.