
సాక్షి, కాచిగూడ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడిగా ఎస్.రాజేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ రాజేందర్ గవాయ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌బాబులతో కలిసి రాజేంద్ర మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను దేశవ్యాప్తంగా మరింత అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి దళితుల డిమాండ్లను అమలు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఎన్. శాంతలక్ష్మి, టి.పద్మారావు, పి.గోవింద్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment