Republican Party of India
-
ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడిగా రాజేంద్ర
సాక్షి, కాచిగూడ: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడిగా ఎస్.రాజేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ రాజేందర్ గవాయ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌బాబులతో కలిసి రాజేంద్ర మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను దేశవ్యాప్తంగా మరింత అభివృద్ధి చేసే దిశగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపే తం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి దళితుల డిమాండ్లను అమలు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ఎన్. శాంతలక్ష్మి, టి.పద్మారావు, పి.గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్తాన్‌ను సమర్థిస్తే జైలుకే
సాక్షి, విజయవాడ : జమ్మూకశ్మీర్ విషయంలో ఎవరైతే పాకిస్తాన్‌ను సమర్థిస్తారో వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్ర సామాజికన్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ విభజన తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ రెండు రాష్ట్రాలలో చైతన్యంగా ఉందని, మా పార్టీకి అన్ని కులాలు సమానమని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఏపీ ప్రెసిడెంట్‌గా బ్రహ్మానందరెడ్డి ఉన్నారని, ప్రజలందరికీ మాపార్టీ దగ్గరవుతోందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చిందని, ఏపీలో వైఎస్సార్సీపీ మంచి సంఖ్యలో సీట్లు గెలిచిందన్నారు. ఏపీ సీఎం జగన్ ఈబీసీ కోటాపై సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,47,857 ఇళ్లు మంజూరు చేశామన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం చాలా మంచిదని, ఇకపై కశ్మీర్లో తీవ్రవాదం తగ్గి పరిశ్రమలు వస్తాయని తెలిపారు. తలాక్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం హర్షణీయన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు సోనియాగాంధీ అధ్యక్షురాలైనా ఆ పార్టీలో పెద్దగా మార్పు ఉండదన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. -
రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణాల్లోని పేదలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు ఎం.వి.రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఈ రిజర్వేషన్లు సరిపోవని అన్నారు. దేశంలో 77 శాతం జనాభా ఉన్న వర్గాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం లెక్కన 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. మరాఠా, పటేల్, జాట్, రాజ్‌పుత్ తదితర వర్గాలకు ప్రత్యేక కేటగిరీలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఓబీసీల్లో కలపాలనే డిమాండ్‌తో కాకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణ పేదలు పోరాడాలని సూచించారు. మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్‌కు ఆర్పీఐ, బీజేపీ మద్దతిచ్చాయని, కేసీఆర్ మద్దతు కోరుతున్నామని అథవాలె చెప్పారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ముదావహమని అన్నా రు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా పెద్దగా 350 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు అథవాలె చెప్పారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎన్నికల ప్రచారంలో ఐటమ్ గర్ల్!
గువాహతి: అసోంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలని బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ నిర్ణయించుకుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) తరఫున అథవాలే నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఆర్పీఐ పార్టీ మహారాష్ట్రలోని దళితుల హక్కుల కోసం పోరాడుతోందన్ విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ బాటలో ఈ పార్టీ పోరాటం సాగిస్తోంది. ఆ పార్టీ రాజకీయాలలో ఈ మధ్య ప్రేవేశించింది. ఆర్పీఐ పార్టీ మహిళా విభాగానికి చీఫ్ గా రాఖీ పనిచేయనుంది. సింగర్, నటి సల్మా అఘ్నాను కూడా ప్రచారానికి దించనున్నట్లు ఆర్పీఐ కార్యదర్శి నాథుని తెలిపారు. అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవలే ఆ పార్టీ ప్రకటించింది. త్వరలోనే మిగతా అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని నాథుని పేర్కొన్నారు. ఆమె ప్రచారం చేయడం, ఈ కార్యక్రమాలలో పాల్గొనడం తమకు కలిసొచ్చే అవకాశం ఉందని పార్టీ పెద్దలు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కులను రక్షించడమే తమ పార్టీ పని అని, రాఖీ సావంత్ తమ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్దంగా ఉందని ఆర్పీఐ ప్రధాన కార్యదర్శి నాథుని వెల్లడించారు. అయితే, తనకు పోర్న్ స్టార్ అవ్వాలని ఉందని రాఖీ సావంత్ వ్యాఖ్యలు చేసిన నెలరోజుల్లోనే ఆర్పీఐ పార్టీ ఆమెకు ప్రచార బాధ్యతలు అప్పగించించడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. -
'ఆయన విదేశాలకు వెళ్తే.. తిరిగి తీసుకొస్తాం'
భోపాల్: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ అసహనం వివాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత రాందాస్ అథావాలే స్పందించారు. ఆమిర్ ఒకవేళ విదేశాలకు వెళ్లిపోయినా.. తమ కేడర్‌ను పంపించి ఆయనను తిరిగి భారత్‌కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. దేశంలో ఆయనకు భద్రత అవసరమైతే తమ పార్టీ కేడర్ ఆయనకు రక్షణకవచంగా ఉంటుందని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. దేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
మా సీట్లు మాకు కావాలే..
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో కాషాయ కూటమి తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించాల్సిందేనని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. బాంద్రాలోని రంగశారద సభాగృహంలో జరిగిన పార్టీ కార్యకర్తల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి చిహ్నంపై తమ అభ్యర్థులు పోటీ చేయబోరని, తమ పార్టీ గుర్తుపైనే పోటీచేస్తారని కుండబద్దలు కొట్టారు. ఇంతకుముందు తమ పార్టీకి 40 స్థానాలు కావాలని అడిగినా ప్రస్తుత వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 20 స్థానాలు కావాలని అడుగుతున్నామని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ అభ్యర్థులకు ఆర్పీఐ ఓట్లు గంపగుత్తగా పడ్డాయని ఆయన చెప్పారు. అయితే ఆమేరకు ఆర్పీఐ అభ్యర్థులకు కూటమి పార్టీల ఓట్లు రావడంలేదని రాందాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ శాసన సభ ఎన్నికల్లో పరిస్థితుల మారాలంటే ఆ ఓట్లన్నీ ఆర్పీఐ అభ్యర్థులకు పోలయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలని ఇరు పార్టీల నాయకులకు ఆఠవలే సూచించారు. ఒక కులానికి రిజర్వేషన్ అమలుచేసే ముందు మరో కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. కొద్ది రోజులుగా ధన్గర్ సమాజ ప్రజలు రిజర్వేషన్ కోసం తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికి సమాన న్యాయం జరిగే తీరులో తుది నిర్ణయం తీసుకోవాలని రాందాస్ విజ్ఞప్తి చేశారు. అది మా లిస్ట్ కాదు.. బీడ్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం తమ పార్టీ ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయలేదని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. ఇటీవల ఆర్పీఐ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో వచ్చిన కథనాలను బుధవారం ఆయన ఖండించారు. ఎవరో కూటమిని తప్పుదోవ పట్టించేందుకు ఇలా అసత్యాలను ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. తాము అభ్యర్థుల జాబితా ఖరారైన తర్వాత మీడియా ద్వారానే బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కథనాల వల్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నారు. పుకార్లను నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. బీజేపీ,శివసేన కూటమికి తాము 57 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జాబితాను అందజేశామని, వాటిలో 20 సీట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని రాందాస్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ప్రవర్తించినట్లు ఇప్పుడు కాషాయ కూటమి ప్రవర్తిస్తుందని అనుకోవడంలేదని, ఆర్పీఐ అండ లేకుండా దళితుల ఓట్లను సాధించడం కూటమి వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీలో ఇప్పటికే నటి రాఖీ సావంత్ చేరగా, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ త్వరలో చేరనున్నట్లు వివరించారు. కాగా, బీడ్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
పింప్రి, న్యూస్‌లైన్ : లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చరిత్ర సృష్టించబోతున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అటవలే ధీమా వ్యక్తం చేశారు. పుణేలో ఆదివారం నిర్వహించిన సత్తా పరివర్తన్ (అధికారంలో మార్పు) మేళావాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఓడించిన విధంగానే త్వరలో అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్పీఐకి 20 అసెంబ్లీ సీట్లను ఆగష్టు 15వ తేదీ లోపు కేటాయిచాలని, అదేవిధంగా ఏ ఏ అసెంబ్లీ సీట్లను కేటాయిస్తున్నారనే విషయాన్ని మహాకూటమి నేతలు ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వాలకు 15 ఏళ్లుగా తాము మద్దతు ఇచ్చామని, ఇకపై వారిని ఓడించేందుకు మహాకూటమిలో చేరుతున్నామన్నారు. సునీల్ తట్కరేను రాష్ర్ట ఎన్సీపీ అధ్యక్షుడిగా చేసిన్నంత మాత్రాన గెలవలేరని, అతని సత్తా గత పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. మాలిన్ గ్రామ ప్రజల పునరావాసానికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సహ్యాద్రి పర్వత ప్రాంతాల కింద ఉన్న ప్రమాదకర గ్రామాలను గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. కర్నాటకలో సరిహద్దుల్లో జరుగుతున్న కన్నడ మరాఠీల వివాదాన్ని రాజ్యసభలో ప్రశ్నించనున్నట్లు తెలిపారు. ఆర్పీఐ సీనియర్ నేత అవినాష్ మహాతేకర్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో రాందాస్ ఆటవలేకు చోటు కల్పించాలని ప్రధాన మంత్రి మోడిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ కార్యకర్తల విన్నపం మేరకు పుణేలోని కంటోన్మెంట్, వడగావ్ శేరి, పింప్రి అసెంబ్లీ స్థానాలను ఆర్పీఐకే కేటాయించాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తా పరివర్తన్ పశ్చిమ మహారాష్ట్ర విభాగ రాష్ట్ర కార్యదర్శి అవినాష్, రాజాభావు సరవణే, రాష్ర్ట కోశాధికారి ఎం.డి.శేవలే, పార్టీ కార్పొరేషన్ నాయకుడు సిద్దార్థ్ ఘోండే, యూత్ అధ్యక్షులు పరుశురాం వడేకర్, నగర అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. -
20 ఇచ్చినా చాలు!
అసెంబ్లీ సీట్లపై తగ్గిన ఆర్పీఐ ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు 47 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆఠవలె) వెనక్కు తగ్గింది. కనీసం 20 సీట్లు కేటాయించాలని భాగస్వామ్య పక్షాలను కోరింది. ఈ విషయమై ఆర్పీఐ నేత రాందాస్ ఆఠవలె మాట్లాడుతూ... ‘మా పార్టీకి 47 స్థానాలు కేటాయించాలని ముంబైలో సోమవారం జరిగిన మహాకూటమి సమావేశంలో డిమాండ్ చేశాం. అయితే భాగస్వామ్య పార్టీలను కూడా దృష్టిలో ఉంచుకొని కనీసం 20 కేటాయించాలని కోరుతున్నాం. ఇందులో విదర్భ ప్రాంతంలోని 13 సీట్లను ఆర్పీఐకి కేటాయించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. 20 స్థానాలను ఆర్పీఐకి కేటాయించినా కూడా శివసేన, బీజేపీలు తమ స్థానాల్లో కొన్నింటిని మాకోసం త్యాగం చేయక తప్పదు. సీట్ల కేటాయింపుపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గవర్నర్ పదవితోపాటు ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని, త్వరలో ఏర్పాటు కానున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో 15 శాతం అధికారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ పదవిని కూడా దళితులకు ఇవ్వాలని కోరతున్నామ’న్నారు. -
37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా
రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వీరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్, మురళీ దేవ్రా, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత రాందాస్ అథవాలే తదితరులు ఉన్నారు. అథవాలేకు బీజేపీ మద్దతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న పవార్ మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్న దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభలో భర్తీ చేయాల్సిన మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో సంజయ్ సిన్హ్(కాంగ్రెస్), మిథున్ చక్రవర్తి(తృణమూల్ కాంగ్రెస్), తదితరులు ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలు.. మహారాష్ట్ర: మురళీ దేవరా, హుసేన్ దల్వాయ్(కాంగ్రెస్), శరద్ పవార్, మజీద్ మీనన్(ఎన్సీపీ), రాజ్‌కుమార్ దూత్(శివసేన), సంజయ్ కాకడే(స్వతంత్ర అభ్యర్థి), రాందాస్ అథవాలే(ఆర్పీఐ) రాజస్థాన్: విజయ్ గోయెల్, రామ్ నారాయణ్ దూడీ, నారాయణ్ పచారియా(బీజేపీ) బీహార్: రామ్‌నాథ్ ఠాకూర్, హరివంశ్, కకాశా ప్రవీణ్(జేడీయూ. వీరు రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి), సీపీ ఠాకూర్, ఆర్కే సిన్హా(బీజేపీ) తమిళనాడు: ఎల్ శశికళ పుష్ప, విజిలా సత్యనాథ్, ముత్తుకురుప్పన్, ఏకే సెల్వరాజ్(అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే), టీకే రంగరాజన్(సీపీఎం) మధ్యప్రదేశ్: దిగ్విజయ్ సింగ్(కాంగ్రెస్), ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా(బీజేపీ) ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా(కాంగ్రెస్), రణవిజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్(బీజేపీ) హర్యానా: కుమారి సెల్జా(కాంగ్రెస్), రామ్‌కుమార్ కశ్యప్(ఇండియన్ నేషనల్ లోక్‌దళ్) గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్), శంభుప్రసాద్ తుండియా, చునీభాయ్ గోహిల్, లాల్సిన్హ్ వడోదియా(బీజేపీ.. ముగ్గురూ రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి). జార్ఖండ్: ప్రేమ్‌చంద్ గుప్తా(ఆర్జేడీ), పరిమళ్ నథ్వానీ(స్వతంత్ర అభ్యర్థి) మణిపూర్: అబ్దుల్ సలామ్(కాంగ్రెస్), మేఘాలయ: వాన్సుక్ సయీమ్(కాంగ్రెస్), హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్(కాంగ్రెస్) -
‘గ్రీన్‌హంట్’ పేరుతో గిరిజనులపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో గిరిజనులపై యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బొజ్జా తారకం ధ్వజమెత్తారు. అడవుల్లోని సైనిక బలగాలను తక్షణమే నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేత చిలకా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తారకం ముఖ్యవక్తగా ప్రసంగించారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని సైనిక శిబిరాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ప్రగతిశీల మహిళాసంఘం నాయకురాలు సంధ్య, టీఎస్ జాక్ నేత కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముంబై మెట్రోగా మార్చండి’
ముంబై: అత్యంత ప్రతిష్టాత్మకమైన సిటీ మెట్రోకి ‘రిలయన్స్ మెట్రో’గా నామకరణం చేయడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ ముంబై మెట్రోగా మార్చాలని డిమాండ్‌చేస్తూ బుధవారం స్థానిక అంధేరీ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రాందాస్ అథవాలే మాట్లాడుతూ మెట్రో రైళ్లు, ప్లాట్‌ఫాంలపై రిలయన్స్ మెట్రో అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు బదులు ముంబై మెట్రో అని రాయాలన్నారు. ఏడురోజుల్లోగా అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌తోపాటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధికారులను ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
సంజయ్ పెరోల్‌పై విచారణకు ఆదేశించిన హోం మంత్రి
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పెరోల్‌పై విడుదల చేయవద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆయనకు నెల రోజులు పాటు పేరోల్‌పై విడుదల చేయడాన్ని ఆర్పీఐ తప్పు పట్టింది. శనివారం ఎర్రవాడ జైలు వద్ద పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సంజయ్ దత్‌ను మిగిలిన ఖైదీలతో సమానంగా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. తన భార్య మన్యత అనారోగ్యంతో ఉందని, ఈ నేపథ్యంలో తనను నెల రోజులు పెరోల్‌పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను అభ్యర్థించారు. అయితే జైలు అధికారులు ఆ విషయాన్ని కోర్టుకు నివేదించారు. దాంతో సంజయ్ దత్తు పెరోల్‌పై విడుదల చేసేందుకు కోర్టు అనుమతించింది. అయితే సంజయ్‌కు పెరోల్ రావడం పట్ల పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాలీవుడ్ నటుడు అయినంత మాత్రాన ఎప్పుడు కోరితే అప్పుడు సంజయ్ దత్‌ను పెరోల్‌పై విడుదల చేస్తారా అంటూ ధ్వజమెత్తాయి. దాంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ అంశంపై విచారణకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఆదేశించారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఇప్పటికే సంజయ్ దత్ రెండు సార్లు ఎర్రవాడ జైలు నుంచి పెరోల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో సంజయ్ దత్ నిందితుడని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఆ కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. -
తూటాలకూ వెరవం
ఠాణే: ఇందుమిల్లు ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం ఏర్పాటు అంతకంతకూ ఆలస్యమవుతుండడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా (ఆర్పీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సెంట్రల్ మైదానంలో ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభను ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ స్మారకం కోసం తనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తూటాలను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధంగా ఉన్నామన్నారు. మూతపడిన ఇందుమిల్లు ఆవరణలో అంబేద్కర్ స్మారక నిర్మాణ ప్రక్రియను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయన్నారు. వచ్చే నెల ఐదో తేదీ లోగా ఇందుకు సంబంధించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించకపోతే ఆ మరుసటిరోజు ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తామని ఆయన హెచ్చరించారు. ‘మాపై తుపాకులతో ప్రభుత్వం తూటాల వర్షం కురిపించినా వెనక్కి తగ్గం. మిల్లు ఆవరణలోకి చొరబడి పనులను ప్రారంభిస్తాం. అంబేద్కర్ కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగానే ఉన్నాం’ అని అన్నారు. అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించడం కోసం జాతీయ టెక్స్టైల్ సంస్థ (ఎన్టీసీ) ఇందు మిల్లు స్థలమిచ్చేందుకు అంగీకరించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆర్పీఐ ఆందోళనకు దిగితే దీటైన జవాబిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ హెచ్చరించారని, అయితే తాము కూడా బలంగా ఉన్నామనే విషయాన్ని ఆయన గుర్తెరగాలన్నారు. సర్కారు సిద్ధమే : మాణిక్‌రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించేం దుకు ఆటంకాలన్నీ తొలగిపోయాయని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ముంబైలోని వాడా ప్రాంతంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుమిల్లు ఆవరణలో అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంబేద్కర్ స్మారకాన్ని నిర్మిస్తామన్నారు. కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు ఆందోళన చేస్తున్నా రని మాణిక్ రావ్ ఆరోపించారు. -
‘ఆరు’ కోసం ఆర్పీఐ పోరు!
సాక్షి, ముంబై:మహాకూటమిలో సీట్ల కోసం పోట్లాట జోరెక్కుతోంది. నిన్నమొన్నటిదాకా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య దాదర్, కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గాల విషయంలోనే భేదాభిప్రాయాలున్నాయని భావించారు. అయితే ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని స్థానాల కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) పట్టుబడుతోందని తెలిసింది. తమ పార్టీకి ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రతిపాదనలను కూడా శివసేన ముందుంచినట్లు తెలిసింది. అయితే శివసేన మాత్రం తామొక్కరమే నిర్ణయం తీసుకోలేమని, మహాకూటమి సమన్వయ సమితి సమావేశంలోనే సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఆర్పీఐ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం లేదని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. శివసేన ప్రాతినిథ్యం వహిస్తున్న సాతారా, బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న లాతూర్ నియోజకవర్గాలను ఆర్పీఐకి కేటాయించే అవకాశముందన్నారు. కాగా ఆర్పీఐ మాత్రం కల్యాణ్, దక్షిణ మధ్య ముంబై, పుణే, రామ్‌టేక్‌లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. ఇదిలాఉండగా... ఆర్పీఐ-శివసేనల మధ్య దూరం పెరుగుతోందంటూ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం కావడం ఈ మధ్యకాలంలో మరింత పెరగడంతో ఇరు పార్టీల నేతలు రాందాస్ ఆఠవలె నివాసమైన ‘సంవిధాన్’ బంగ్లాలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శివసేన తరఫున చెందిన గజానన్ కీర్తికర్, సుభాష్ దేశాయ్, లీలాధర్ డాకే, మిలింద్ నార్వేకర్‌లు పాల్గొనగా ఆర్పీఐ తరఫున అవినాశ్ మాత్రేకర్, అర్జున్ డాంగ్లే తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ స్థానంపై రాందాస్ అథవాలే పేరు ఖరారు చేసే విషయంపై పునరాలోలించాలని ఆర్పీఐ నాయకులు శివసేనకు సూచించగా ఈ అంశంపై బీజేపీ నాయకులతో చర్చించాలని శివసేన నాయకులు వారికి సలహా ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైతే ఢిల్లీలోని బీజేపీ శ్రేణులతో కూడా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శివసేన స్పష్టం చేసినట్లు సమాచారం. విభేదాల పరిష్కారానికి సమన్వయ సమితి దాదాపు ఇరవై సంవత్సరాలుగా కాషాయ కూటమి పేరుతో బీజేపీ, శివసేన కలిసే పోటీ చేస్తున్నాయి. వీరితో ఆర్పీఐ కూడా జతకూడడంతో కాషాయకూటమి కాస్తా మహాకూటమిగా మారిన విషయం తెలిసిందే. మూడో పార్టీ చేరికతో సీట్ల పంపకాలు తదితర విషయాల్లో అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలని ‘సంవిధాన్’లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమితిలో సభ్యులుగా శివసేన తరఫున గజానన్ కీర్తికర్, సుభాష్ దేశాయ్, లీలాధర్ డాకేలు సభ్యులుగా ఉంటారని, బీజేపీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డేలు, ఆర్పీఐ పార్టీ తరఫున ముగ్గురు సభ్యులు(ఇంకా పేర్లు ఖరారు చేయలేదు)గా ఉంటారని శివసేన సీనియర్ నేత ఒకరు తెలిపారు. -
పుణే సీటిస్తే పోటీ చేస్తా: అథవాలే
పింప్రి, న్యూస్‌లైన్: దళితుల సంఖ్య అధికంగా ఉన్న పుణే సీటును రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు కేటాయించాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలను కోరారు. అవకాశమిస్తే తానే పోటీచేస్తానని స్పష్టం చేశారు. పుణేలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 30 నుంచి 35, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు, ఐదు సీట్లను కేటాయించాలని మహాకూటమిలో మిత్రపక్షాలైన శివసేన, బీజేపీలను కోరుతామన్నారు. దీనిపై త్వరలో జరగబోయే మహాకూటమి సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని నిప్పులు చెరిగారు. దళితులపై నేటికి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అట్రాసిటి యాక్ట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. దళితులకు అన్యాయం జరుగుతోందని, అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలలో దళిత పరిషత్‌ను ఏర్పాటుచేయనున్నట్లు అథవలే పేర్కొన్నారు. ఈ సమావేశంలో నగర ఆర్పీఐ అధ్యక్షులు మహేంద్ర కాంబ్లే, ఎం.డి.శేవాలే, నగర కార్పొరేటర్లు డాక్టర్ సిద్ధార్థ్ దేండే, మహేష్ షిండే తదితరులు పాల్గొన్నారు.