‘గ్రీన్‌హంట్’ పేరుతో గిరిజనులపై యుద్ధం | Government treats on Tribals War as named Green Hunt | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌హంట్’ పేరుతో గిరిజనులపై యుద్ధం

Jan 20 2014 12:42 AM | Updated on Apr 3 2019 6:20 PM

ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో గిరిజనులపై యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బొజ్జా తారకం ధ్వజమెత్తారు.

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో గిరిజనులపై యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బొజ్జా తారకం ధ్వజమెత్తారు. అడవుల్లోని సైనిక బలగాలను తక్షణమే నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేత చిలకా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తారకం ముఖ్యవక్తగా ప్రసంగించారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని సైనిక శిబిరాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ప్రగతిశీల మహిళాసంఘం నాయకురాలు సంధ్య, టీఎస్ జాక్ నేత కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement