- జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కిమ్మెన రత్నాకర్
శివమొగ్గ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కిమ్మెన రత్నాకర్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం ఆయన నగరంలోని జిల్లా అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వ ద్ద లింగ షూటింగ్‌కు అనుమతి ఎలా ఇచ్చారని విలేకరులు మంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వివరణ ఇస్తూ ఈ విషయం తనకు తెలియదని, సంబంధిత మంత్రితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
త్వరలో సిటీ బస్సులు : శివమొగ్గ-భద్రావతిలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను నడపటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంపై రవాణా శాఖ అధికారులకు కూడా పలు సూచనలు చేశామని మంత్రి చెప్పారు. మరో మూడు నెలల్లోపు బస్ డిపో, బసాండ్ నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే అధికారులు పనులు వేగవంతం చేశార ని మంత్రి కిమ్మెన తెలిపారు.