వరంగల్ క్రైం : విధి నిర్వహణలో రవీందర్‌రెడ్డిని మిగతా సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు అన్నారు. మూడు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మాధవరెడ్డి రవీందర్‌రెడ్డిని స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది, అధికారులు ఘనంగా సన్మానించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, అదనపు ఎస్పీ ఎం.యాదయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొని ఎస్సై రవీందర్‌రెడ్డిని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు.
1979లో పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరిన రవీందర్‌రెడ్డి 1983లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2001లో ఏఎస్సైగా, 2009లో ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్సైగా రాయపర్తి, బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అర్బన్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. రవీందర్‌రెడ్డి పదవీ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవ, ఉత్తమ సేవ పతకాలను అందుకోవడంతోపాటు 50కిపైగా శాఖాపరమైన రివార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రవీందర్‌రెడ్డి సమయ పాలన పాటిస్తూ తనకు అప్పగించిన పనులను విజయవంతంగా నిర్వహించారన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీలు వాసుసేన, నాగరాజు, డీఎస్పీ జనార్దన్, సీఐ మదన్‌లాల్, ఎస్సైలు సత్యనారాయణ, రహమాన్, రవికుమార్, కరుణాకర్‌తోపాటు ఇతర స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసులే ప్రజలకు నిజమైన మిత్రులు
ప్రజలకు పోలీసులే నిజమైన మిత్రులని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా వరంగల్ అర్బన్ ఎస్పీ విద్యార్థులకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను కట్టడంతోపాటు చిన్నారుల చేత కట్టించుకున్నారు. విద్యార్థులు, ప్రజలు నిర్వహించుకునే ఫ్రెండ్‌షిప్ డే రోజున శాంతిభద్రతల కోసం నిరంతరం శ్రమించే పోలీసులను కూడా తమ మిత్రులుగా భావించాలని ఎస్పీ తెలిపారు. తమ కుటుంబం కన్నా ప్రజల రక్షణే తన లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులు అన్నివర్గాల ప్రజలకు మిత్రులన్నారు. తేజస్వీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు మన్నవ లక్ష్మీమహతి, మాధవశర్మ, లహరి అర్బన్ ఎస్పీకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టారు. అనంతరం విద్యార్థులకు తిరిగి ఎస్పీకి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టారు.
రవీందర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
Published Mon, Aug 4 2014 5:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement