Ravinder reddy
-
మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్‌రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు తెలిపింది. రవీందర్‌రెడ్డిని తమ ముందు (హైకోర్టు) హాజరుపరచాలని ఆదేశిస్తే, పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే, ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)ని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్‌రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ పిటిషన్..తన భర్త వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్భంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యాజ్యం ఈనెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు, వర్ర రవీందర్‌రెడ్డిని తాము అరెస్టుచేయలేదని, అతను తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం, వర్రా రవీంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్‌రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈనెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, రవీందర్‌రెడ్డి తదితరులను అరెస్టుచేసినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీంద్రరెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.పోలీసులది కోర్టు ధిక్కారమే..ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈనెల 9న జరిగిన విచారణలో రవీంద్రరెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారని, కానీ 12న అతన్ని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించడమేకాక.. 12న రవీందర్‌రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీంద్రరెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి.. రవీందర్‌రెడ్డిని పోలీసులు ఈనెల 8నే తమ అదపులోకి తీసుకున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు ఓ మంచి ఉదాహరణనన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని.. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు.పోలీసులను ఇలాగే వదిలేస్తే..పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, వీటిని ఇలాగే వదిలిస్తే రేపు ఓ 100 మందిని అక్రమంగా నిర్బంధించి, వారిని కొట్టి, వారితో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, పోలీసులు తమ ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రవీంద్రరెడ్డిని అదుపులోకి తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్‌ప్లాజా జాతీయ రహదారుల సంస్థ అధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థను ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
‘‘టార్చర్ చేశారు సర్..’’ జడ్జికి గాయాలు చూపించి వాపోయిన వర్రా రవీంద్రారెడ్డి!
వైఎస్సార్ జిల్లా, సాక్షి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ ఏపీలో వేధింపుల పర్వం కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు.‘‘శుక్రవారం నన్ను అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి టార్చర్ చేశారు సర్(తనకు అయిన గాయాలను జడ్జికి చూపించారు). వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ ప్రోద్బలంతోనే షర్మిల, సునీతలపై పోస్టులు చేశానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. అందుకు ఒప్పుకోకపోవడంతో టార్చర్ చేశారు సర్. మేం ఏది చెప్పినా ‘యస్’ అనాలని వీడియో రికార్డు చేశారు సర్’’ అంటూ జడ్జి ఎదుట వాపోయారాయన. ఆ వివరాలన్నింటిని జడ్జి రికార్డు చేశారు. రవీంద్రారెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అదే సమయంలో.. రవీంద్రా రెడ్డి ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. మరోవైపు.. ఇదే కేసులో అరెస్ట్ అయిన సుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డికి 41-ఏ నోటీసులు ఇచ్చి వదిలేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. జడ్జి ఆదేశాల నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. అనంతరం మళ్లీ కడప జైలుకు తరలించారు. ‘‘వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడికి పారిపోలేదు. పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకుని టార్చర్ చేశారు. కర్నూలు టోల్ ప్లాజా సమీపంలో కళ్లకు గంతలు కట్టి వేధించారు. అరికాళ్లపై రాడ్లతో చితకబాదారు. మార్కాపురం తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. ఆయన మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి’’::: సాక్షితో రవీంద్రారెడ్డి తరఫు అడ్వొకేట్ ఓబుల్‌రెడ్డి -
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
హెచ్‌సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి విజయం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్‌రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్‌రెడ్డి, మణికొండ విజయ్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్‌పై రవీందర్‌రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్ రావు, జిల్లెల సంజీవ్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్‌కుమార్, ట్రెజరర్‌గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ విజయం సాధించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్‌రెడ్డి బార్ అండ్ బెంచ్ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
థియేటర్లో ఫ్రీగా కేరళ స్టోరీ ప్రదర్శన, ఎక్కడంటే?
ది కేరళ స్టోరీ చిత్రాన్ని మతం కోణంలో కాకుండా ఉగ్రవాద కోణంతో చూడాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ది కేరళ స్టోరీ సినిమాను ఉచితంగా ప్రదర్శించగా నాయకులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదులు, తీవ్రవాదులు ఏ విధంగా హిందూ మహిళలు, యువతులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఉగ్రవాద శిబిరాలకు తరలిస్తున్నారో ఈ చిత్రంలో చూపించారని తెలిపారు. యువతులు, తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్, నాయకులు గుర్రం రాము, జిట్టవేణి అరుణ్, ప్రభాకర్, నారాయణరెడ్డి, బిట్టు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కేరళ స్టోరీ విషయానికి వస్తే.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు చేరువలో ఉంది. చదవండి: ఇంటి పనంతా మాతోనే: స్నేహ -
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
Sagubadi: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి!
తాటాకు బుట్టలు బత్తాయి కాయలకు చుట్టడం, రసాయనిక ఎరువులకు బదులు చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం ద్వారా బత్తాయి సాగులో యువ రైతు కడసాని రవీందర్‌రెడ్డి బహుళ ప్రయోజనాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని తోపుచర్ల గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి మూడు ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రసాయనిక ఎరువులు వాడి భూమి నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో రవీందర్ రెడ్డి రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పిందె దశ నుంచే చీడపీడల బారి నుంచి పంటను కాపాడేందుకు అనేక రకాల రసాయనిక పురుగు మందులను బత్తాయి రైతులు పిచికారీ చేస్తుంటారు. రవీందర్ రెడ్డి మందుల జోలికి పోకుండా తాటాకు బుట్టలను కాయలకు తొడుగుతున్నారు. తద్వారా పేనుబంక, మంగు, దోమ తదితర చీడపీడల నుంచి కాయలను కాపాడుకోగలుగుతున్నారు. కాయ సైజు పెరగటం, బంగారు పసుపు రంగులోకి మారటం వల్ల కొనుగోలుదారులు ఈ కాయలను ఇష్టపడి అధిక ధర చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ఇలా చేస్తే అధిక లాభాలు! బత్తాయి రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మాడుగులపల్లి ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి సూచిస్తున్నారు. సేంద్రియ సాగులోకి మళ్లటంతో పాటు కాయలకు తాటాకు బుట్టలు తొడిగే పద్ధతిని ఆచరిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. మాడుగులపల్లి నుంచి బత్తాయిలను తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్లకు తరలిస్తుంటారు. అక్కడ కాయ రూ. 20–25లకు అమ్ముతున్నట్లు సమాచారం. బత్తాయి కాయలకు తొడిగే తాటాకు బుట్టలను సైతం రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. బుట్ట ఖరీదు రూ.5. రవాణా, కూలి ఖర్చులతో కలిపి బుట్టకు మొత్తం రూ.8 ఖర్చవుతున్నదని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. వేములపల్లి మండలంలోని మొల్కపట్నంలో కూడా మరో ఇద్దరు బత్తాయి రైతులు తాటాకు బుట్టలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 20–22 టన్నుల దిగుబడికి అవకాశం గతంలో రసాయనిక ఎరువుల వాడినప్పుడు ఎకరానికి బత్తాయి పండ్ల దిగుబడి 13–15 టన్నుల వరకు వచ్చేది. చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం వల్ల కాయల సంఖ్యతో పాటు కాయ సైజు గణనీయంగా పెరిగింది. ఈసారి ఎకరానికి 20–22 టన్నుల దిగుబడి వస్తుందనుకుంటున్నా. తాటాకు బుట్టల వాడకం వల్ల తెగుళ్లు సోకటం లేదు. కాయ బంగారు పసుపు రంగులోకి మారి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నది. – కడసాని రవీందర్ రెడ్డి, బత్తాయి రైతు, ఫోన్: 9392990998, తోపుచర్ల, మాడుగులపల్లి మం. నల్లగొండ జిల్లా – పండుగ శ్రీనివాస్, సాక్షి, మాడుగులపల్లి, నల్లగొండ జిల్లా చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ -
ట్రెసా డైరీని ఆవిష్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)రెవెన్యూ డైరీని సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతం కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మన్నె ప్రభాకర్, నిరంజన్, బోనాల రామ్‌రెడ్డి, శైలజ, నిరంజన్ తదితరులు పాలొన్నారు. -
'అఖండ'కు సీక్వెల్ తీయాలనుంది: నిర్మాత రవీందర్ రెడ్డి
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించి హిట్ సాధించిన చిత్రం అఖండ. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషనల్లో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో తమన్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా మారింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జయ జానకీ నాయక సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు రవీందర్ రెడ్డి. తర్వాత అఖండ చిత్రాన్ని నిర్మించిన ఆయన భారీ హిట్ అందుకుని అగ్ర నిర్మాతగా ఎదిగారు. డిసెంబర్ 29న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ఆ నమ్మకంతోనే 'అఖండ' చేశాను పెద్ద డైరెక్టర్, రేర్ కాంబినేషన్ అనే నమ్మకంతోనే అఖండ సినిమాను చేశాను. ఒకప్పుడు ఒక్క డైరెక్టరే పది సినిమాలు చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ దర్శకుడు ఒక సినిమాను చేయడమే కష్టం. స్టార్ హీరోలకు పది ప్లాఫులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే సెట్ అవుతుంది. స్టార్ హీరోకున్న అడ్వాంటేజ్ అదే. నేను అదే నమ్ముతా. బోయపాటి గారు మొదటి సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అన్నీ చెప్పారు. నాకు ముందే తెలుసు అఖండ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు ముందే తెలుసు. ఈ విషయాన్ని చెబితే నమ్మరేమో కానీ నాకు మాత్రం మొదటి నుంచి నమ్మకం ఉంది. హీరో, దర్శకుడు ఎక్కడా కూడా మాట్లాడలేదు. సినిమా విడుదల కంటే ముందు నుంచి నేనే మాట్లాడుతూనే వచ్చాను. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారి అభిమానులకు కావాల్సిన మాస్ సాంగ్ కూడా ఉంది. అఘోర పాత్ర అద్భుతంగా వచ్చింది. ఆ ఎంట్రీతో అందరూ ట్రాన్స్‌లోకి వెళ్లారు అఖండ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాం. ప్రతీ ఒక్క సీన్ అద్బుతంగా ఉంటుంది. నాలుగు రోజుల్లోనే బయ్యర్స్ బయటపడతారని అనుకున్నాను. ఓవర్సీస్లో ఆడుతుందా? లేదా? అని ఆలోచించలేదు. ఎప్పుడు విడుదల చేసినా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని నమ్మకంగా ఉండేది. ఇది కేవలం బాలకృష్ణ సినిమా అని అభిమానులు చూడలేదు. అఘోర పాత్ర ఎంట్రీతో అందరూ ఆ ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. అందరితో సినిమాలు చేస్తాను స్టార్ హీరోలతోనే అని కాదు అందరితోనూ సినిమాలు చేస్తాను. కథలు కుదిరితే అందరితో చేస్తాను. అఖండ సినిమా విషయంలో దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. మా సినిమా విడుదల విషయంలో ప్రభుత్వం కొంత సపోర్ట్ చేసింది. త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాం. సీక్వెల్ తీయాలనుంది బోయపాటి గారి రాబోయే సినిమాల్లో నేను భాగస్వామిని అవుతానా? లేదా? నేను చెప్పలేను. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాక్కూడా ఉంది. ఒక వేళ హిందీలో రీమేక్ చేయాలనుకుంటే.. ఇలాంటి పాత్రలకు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది. కొత్త హీరోతో సినిమా వచ్చే ఏడాది మార్చిలో ఓ సినిమాను ప్రారంభిస్తాను. అందులో ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతోన్నాను. ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. ఇంకా కన్ఫామ్ కాలేదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది. కానీ ఇప్పుడు అయితే నేను ఏ పాలిటిక్స్‌లో లేను. షూటింగ్ తర్వతా ఆయనతో మాట్లాడాను సినిమా షూటింగ్ ముగిసిన తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాను. చాలా సహకరించారు.. థ్యాంక్స్ సర్ అని అన్నారు. లేదు లేదు మీరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, బాగా చేశారు అని బాలకృష్ణ గారు అన్నారు. నా మైండ్‌లో తమనే ఉన్నారు అఖండ సినిమా కథ విన్నప్పటి నుంచి కూడా మా మైండ్‌లో తమనే ఉన్నారు. ఇలాంటి మ్యూజిక్ ఇస్తాడని నాకు ముందే తెలుసు. బాలకృష్ణ గారితో మనం చేస్తున్నాం.. నన్ను తొందరపెట్టొద్దు. పగలగొట్టేద్దామని తమన్ అన్నారు. తమన్ ఏం చెప్పారో దాని కంటే వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్‌లో తమన్ పాత్ర చాలా ముఖ్యమైంది. ఎలా మాట్లాడిన వివాదమవుతుంది ప్రభుత్వాలు అనేవి ప్రజలకు ప్రాతినిధ్యంగా వహిస్తాయి. వ్యక్తులు, సంస్థల కోసం ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వవు. మా సినమా విడుదల సమయంలో సినిమా పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. అలాంటి సమయంలో నేను ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాను. ఈ విషయం మీద ఎలా మాట్లాడినా కూడా వివాదంగానే మారుతుంది. ఆ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను పెట్టమని ఇండస్ట్రీ వాళ్లే అడిగారు. దాని వల పారదర్శకత ఉంటుందని అలా అడిగారు. బాలకృష్ణ కెరీర్ మొత్తంలో నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇదే బెంచ్ మార్క్ అయ్యేలా ఉంది. దాదాపు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. రీటేక్స్ ఉండవు.. నేను సెట్‌కి వెళ్తే మానిటర్ పక్కన కూర్చుని చూస్తుంటాను. బాలకృష్ణ గారు అక్కడే కూర్చుంటారు. మేం ఇద్దరం మాట్లాడుకుంటాం. కానీ ఆయన ఏదో పెద్ద హీరో అన్నట్టుగా ప్రవర్తించరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఒక్కసారి షాట్లోకి వెళ్తే మారిపోతారు. పక్కన ఉన్నప్పుడు బాలకృష్ణ వేరేలా ఉంటారు.. సెట్స్ మీదకు వెళ్తే వేరేలా ఉంటారు. బాలకృష్ణ గారు ఒకసారి చేస్తే రీటేక్స్ అనేవే ఉండవు. అలా చేయడం నాకు తెలీదు అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్ చేసుకోవడం నాకు తెలీదు. ఎవరైనా కథ చెబితే.. నచ్చితే.. దానికి తగ్గట్టు హీరోలకు వినిపించడమే అలవాటు. మున్ముందు నాకు కూడా అలా అడ్వాన్స్‌లు ఇచ్చేది అలవాటు అవుతుందేమో చూడాలి. -
ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది. ►ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి. ►45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి. n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి. ►రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించాలి. ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. ♦పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. ♦డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలి. ♦సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్ఏలకు స్కేల్ వర్తింప చేయాలి. -
Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ఈవీఎం గల్లంతవలేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి ఓ ఈవీఎంను అక్రమంగా తరలించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం, ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్ ఆర్ కళాశాల వద్ద వీవీప్యాట్ యంత్రాన్ని బస్సు నుంచి కారులోకి మారుస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి అది ఈవీఎం కాదని, వీవీప్యాట్ యంత్రమని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్–200లో మాక్ పోలిం గ్ సమయంలో ఒక వీవీ ప్యాట్ యంత్రం పనిచేయలేదని, అందుకే రిజర్వ్‌లో ఉన్న మరో యంత్రాన్ని వినియోగించామని తెలిపారు. మొరాయించిన యంత్రాన్ని బస్సులో బందోబస్తు మధ్య కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించామన్నారు. అయితే అప్పటికే అక్కడ 150 బస్సులు పార్కు చే యడంతో స్థలాభావం వల్ల కాలేజీ ఆవరణకు ముం దే ఆ బస్సును నిలిపివేశారని తెలిపారు. సెక్టోరియ ల్ అధికారి సూచనల మేరకు ఆయన డ్రైవర్ వీవీప్యాట్ యంత్రాన్ని బస్సులోంచి కారులోకి మార్చా రని రవీందర్‌రెడ్డి వివరించారు. దీన్ని గుర్తుతెలి యని వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాధ్యమా ల్లో తప్పుగా ప్రచారం చేశారన్నారు. అయినప్పటికీ దీనిపై విచారణ జరుపుతున్నామని, ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జమ్మికుంటలో ఈవీఎంలు తరలిస్తున్న బస్సు విషయంలోనూ వదం తులు వచ్చాయని విలేకరులు ప్రశ్నించగా బస్సు టైరు పంక్చర్ అయితే దాన్ని మార్చారే తప్ప ఈవీఎంలను మార్చలేదని రవీందర్‌రెడ్డి వివరించారు. రికార్డు స్థాయిలో పోలింగ్.. 135 కేసులు నమోదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 86.64% పోలింగ్ నమోదైందని ఆర్డీవో రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 135 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో నిందితులంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. అయితే ఇందులో రాజకీయ నాయకులు, ఓటర్లు ఎందరో చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద విపక్షాల ధర్నా.. ఎస్ఆర్ఆర్ కాలేజీ వద్ద భద్రపరిచిన ఈవీఎంలను అధికారులు మార్చారని ఆరోపిస్తూ శనివారం రాత్రి కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ అనుచరులతో కలసి కాలేజీ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏసీపీ తులా శ్రీనివాసరావు.. బల్మూరి వెంకట్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈవీఎంను కారులో ఎలా తరలిస్తారంటూ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఏసీపీ తుల శ్రీనివాసరావుతో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈవీఎంల తరలింపులో అక్రమాలు జరిగాయని, ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నేత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ఆధ్వర్వంలో బీజేపీ కార్యకర్తలు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదుట బైఠాయించారు. ఇదే విషయమై ఆదివారం కూడా నిరసనలు కొనసాగాయి. నియోజకవర్గంలోని జమ్మికుంట, వీణవంక మండలాలు, కరీంనగర్ పట్టణంలోనూ బీజేపీ జిల్లా నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగరావును ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఆయన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బల్మూరి వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా... 2015, 2018లో జరిగిన ఎన్ఎస్యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన వెంకట్‌ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధినాయకత్వానికి ధన్యవాదాలు: వెంకట్ హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులకు వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
పదోన్నతులు ఇవ్వాలి.. జాబ్‌చార్ట్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు ఇవ్వాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ఉద్యోగుల జాబ్‌చార్ట్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట లో ట్రెసా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చినప్పటికీ.. రెవెన్యూ శాఖలో మాత్రం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా పలు అంశాలపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించారు. రవీందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పూల్‌సింగ్, రాజ్‌కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి, ఎల్బీ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలివే.. ♦కేడర్ స్ట్రెంగ్త్ వెంటనే నిర్ధారించి అన్ని తహసీల్ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. ♦సుదూర జిల్లాలకు పోస్టింగులు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లను ముఖ్యంగా మహిళా ఉద్యోగినులను వారి ఆప్షన్ల ప్రకారం జిల్లాలకు కేటాయించాలి ♦ఉద్యోగుల బదిలీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. దీర్ఘకాలంగా ఒకే ప్రాం తంలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఇతర ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు అనుమతించాలి ♦వీఆర్వోలను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయాలి. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!
ఆహారం... ఆవాసం... ఆహార్యం... మనిషికి ఈ మూడూ ఎప్పుడూ తప్పనిసరే. కరోనా నేపథ్యంలో ఆయా రంగాల్లో ఏర్పడ్డ అనిశ్చితి తాత్కాలికమేనని... అది నేర్పిన పాఠంతో జనమంతా ఆహారం, వైద్య అవసరాల తర్వాత ఖర్చు పెట్టేది ఇళ్ల మీదేనని చెప్పారు జనప్రియ ఫౌండర్ అండ్ చైర్మన్ రవీందర్‌రెడ్డి. రియల్టీ రంగంలో తాజా పరిస్థితులు, భవిష్యత్‌ను ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ఇంటర్వూ్యలో ప్రత్యేకంగా పంచుకున్నారాయన. సాక్షి, హైదరాబాద్: నిజం చెప్పాలంటే రెసిడెన్షియల్ విభాగంలో కూడా కరోనాకు ముందు.. తర్వాత.. అనే విభజన తప్పనిసరి. కరోనా ప్రభావంతో రిటైల్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి రంగాల్లో ఉద్యో గాల కోత ఉంది. దీంతో గృహ కొనుగోలుదారు ల సంఖ్య తగ్గుతుంది. లాక్డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు క్రమంగా సాధారణ జీవనంలోకి వస్తున్నారు. వచ్చే 3–4 నెలలూ... గతంలో మా దిరి ఖర్చులు చేయరు. తిండి, విద్య, వైద్యం గు రించి సేవింగ్స్ చేస్తారు. ఆ తర్వాత కావాల్సింది ఇల్లు. రియల్టీ మార్కెట్ జోష్‌లో ఉన్నప్పుడు అం దరూ కొంటారు. డిమాండ్ ఉంటుంది కనుక ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఇలాం టి అనిశ్చితి పరిస్థితుల్లో ఇళ్లు కొనడమే మంచిది. డెవలపర్లతో బేరం ఆడొచ్చు. నగదు లభ్యత కోసం డెవలపర్లు కూడా మార్జిన్లను తగ్గించుకొని విక్రయించే అవకాశం ఉంటుంది. (కరోనాకు ప్రైవేట్ వైద్యం) భవిష్యత్‌లో గృహ నిర్మాణాలు ఎలా? కరోనా భయంతో గతంలో మాదిరిగా సినిమాల కు, షికార్లకు విచ్చలవిడిగా వెళ్లరు. ఇంట్లో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది కనుక కొత్తగా చేపట్టే ఇళ్ల నిర్మాణాలు కూడా అందుకు తగ్గట్టుగా మార్చాలి. గతంలో నలుగురు సభ్యులున్న కు టుంబానికి టూ బీహెచ్‌కే సరిపోయేది. భవిష్య త్లో కష్టం. ఇంట్లో గడిపే సమయం పెరగడం, ఆఫీస్ పని కూడా ఇంట్లోనే చేస్తుండటంతో ఇంటి విస్తీర్ణం కూడా పెరగాలి. ప్రైవసీ, ప్రశాంత వాతా వరణం, వర్క్ చేసుకునేందుకు ఇంటర్నెట్, సీటిం గ్, డెస్క్ వంటి ఆఫీస్ స్పేస్ వసతులూ ఇంట్లోనే కల్పించాల్సి ఉంటుంది. గతంలో 750 చదరపు అడుగుల్లో కూడా నిర్మించే టూ బీహెచ్‌కేలకు ఇకపై మరో 100 చ.అ. ఎక్కువ కావాలి. (అన్నదాతకు..భరోసా కేంద్రాలు) గృహ కొనుగోలుదారుల అభిరుచులు..? కరోనాతో ప్రజలకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. నగరం నడిమధ్యలో కాకుండా శివారు ప్రాంతాల కు, పచ్చని పరిసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ప్రజా రవాణా సౌకర్యాలుండే శివారు ప్రాం తాలలో ఇళ్లను ఎంచుకోవచ్చు. కార్యాలయాలకు దగ్గరగా ఉండాలని భావించే వాళ్లు.. వర్క్ ఫ్రం హోమ్ ప్రాజెక్ట్‌లకు, శాటిలైట్ టౌన్షిప్లకు ప్రాధాన్యమిస్తారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్స్ వంటి వాణిజ్య ప్రాంతాల్లో కాకుండా హై స్ట్రీట్ మార్కెట్ల వైపు జనం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇళ్ల రేట్లు ఏమైనా తగ్గుతాయా? ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి, కొత్తగా ప్రారంభమయ్యే ప్రాజెక్ట్‌లలో ధరలు తగ్గకపోవచ్చు. ఎం దుకంటే నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతున్నా యి. కూలీల కొరత కూడా ఉంది. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాకపోతే ఇప్పటికే పూర్త యి అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) ధరలు కొంత తగ్గొచ్చు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య సంప్రదింపుల మేరకు ఈ ధరలుంటాయి. గతంలో రూ.50–60 లక్షలు పెట్టి ఇల్లు కొందామనుకున్న వాళ్లు ఇప్పుడు రూ.40 లక్షల లోపు బడ్జెట్ పెడతారు. హైదరాబాద్‌లో రూ.35–40 లక్షల గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. -
మద్దతు కోరనప్పుడు ఎలా ఇస్తాం?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు మద్దతు కావాలని ఉద్యోగ జేఏసీని ఎన్నడూ కోరలేదని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. మద్దతు కావాలని అడగనప్పుడు తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించింది. ఉద్యోగ జేఏసీలో ఆర్టీసీ జేఏసీ భాగం కాదని, వారి ఉద్యోగ నిబంధ నలు కార్మిక చట్టాలకు లోబడి ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు సీసీఏ నిబంధనల ప్రకారం ఉంటా యని పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటో ఉద్యోగ జేఏసీ దృష్టికి తీసుకొస్తే వాటిపై చర్చించిన తర్వాతే మద్దతుపై ప్రకటన చేయనున్నట్లు తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆదివారం ఉద్యోగ జేఏసీ నేతలు టీఎన్జీవో భవన్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి.మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొందరు పనిగట్టుకుని ఉద్యోగ జేఏసీని, టీఎన్జీవో, టీజీవోలను బదనాం చేస్తున్నారని, ఆర్టీసీ జేఏసీ మద్దతు కోసం ఇప్పటివరకు తమను సంప్రదించలేదన్నారు. సమ్మెకు మద్దతు కోరేందుకు ఆదివారం టీఎన్జీవో భవన్‌కు వస్తామని సమా చారం ఇచ్చిందని.. కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చెప్పిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 16 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు తమను సంప్రదిస్తే వారి సమస్యను 17వ అంశంగా ప్రస్తావిస్తామని, కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై బురద జల్లితే సహించేది లేదన్నారు. తప్పుడు ప్రచారం తగదు.. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ తమను ఆహ్వానించారని, భోజన సమయం కావడంతో అందులో తాము పాల్గొన్నామని రవీందర్‌రెడ్డి, మమత పేర్కొన్నారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలకు చర్చల తోనే పరిష్కారం దొరుకుతుందని, ఇందులో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో సమ్మెను నడిపిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగ జేఏసీ ఎన్నడూ రాజకీయ పార్టీల మద్దతు కోరదని, ఆర్టీసీ కార్మికులు కూడా రాజకీయ పార్టీలతో కాకుండా జేఏసీ తరఫున ఉద్యమించాలని సూచించారు. తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కార్మికులకు సూచించారు. -
రండి..చేరండి.. ఇప్పుడే కాదు ఆగండి.. రిటైర్డ్ జడ్జికి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ‘అయ్యా మీ సేవలు పార్టీకి అవసరం..మీలాంటి వారిని మేము ఆహ్వానిస్తున్నాం’ఇదీ ఎన్ఐఏ రిటైర్డ్ జడ్జి రవీందర్‌రెడ్డికి భారతీయ జనతాపార్టీ నేతల బృందం కొద్దిరోజుల కిందట వ్యక్తిగతంగా కలసి చేసిన విన్నపం.దీనికి అంగీకరించిన ఆయన ఈ నెల 15న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశారు. ఆ తర్వాత ఓ అయిదు రోజులకు ఎంపీ బండారు దత్తాత్రేయ ఫోన్‌చేసి ‘మీరు, మీ అనుచరులు కలసి పార్టీలో చేరడానికి జిల్లా బీజేపీ నాయకుల సాయంతో పార్టీ కార్యాలయానికి రండి ’అంటూ పిలిచారు. దత్తన్న నుంచి ఆహ్వానాన్ని అందుకున్న మరుచటి రోజే రవీందర్ రెడ్డి బీజేపీ రాష్ట్రకార్యాలయానికి తన అనుచరులతో వచ్చారు. తీరా అక్కడికి వచ్చాక తనను ఆహ్వానించిన దత్తన్న కానీ, పార్టీ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ గానీ కనిపించలేదు. ఆందోళన చెందిన ఆయన విషయంపై ఆరా తీశారు. అప్పటికే సమాచారం రాబట్టిన అనుచరులు ‘మిమ్మల్ని ఇప్పుడే పార్టీలో చేర్చుకోవద్దని, రెండు రోజులు ఆగాలని అమిత్‌షా బండారు దత్తాత్రేయకు ఫోన్ చేశారట’అని రవీందర్ రెడ్డికి విషయం చెవిన వేయడంతో ఆయనకు కొద్దిసేపు ఏమీ పాలుపోలేదు. చివరకు సర్దుకొని విషయాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడి విషయం చెప్పారు. ఈ సందర్భంగా ‘పార్టీలో చేరేందుకు రమ్మని.. వారెవరూ రాకుండా మిమ్మల్ని చేర్చుకోకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారా..?’అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తానేమీ అవమానంగా భావించడం లేదన్నారు. తనను రమ్మని పిలచిన వారికి ఇది అవమానమన్నారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీలో చేరాలని తనకు ఉందనీ అందుకే వచ్చానన్నారు. అయితే అధ్యక్షుడు అమిత్‌షా కొద్ది రోజులు ఆగమన్నారని చెప్పినట్లు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ‘తరువాత రమ్మని పిలిస్తే చేరుతారా..’అని మీడియా అడగ్గా సమాచారం వచ్చాక నిర్ధారించుకొని పార్టీలో చేరుతానని సమాధానం ఇచ్చారు. బ్రేకులు ఎవరు వేశారో... బీజేపీలో వివిధ వర్గాలకు చెందిన వారు పార్టీలో చేరుతున్నప్పటికీ, కొంచెం ప్రాముఖ్యత ఉన్నవారూ, మేధావి వర్గానికి చెందిన వారూ పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచన ఇటీవల ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే రిటైర్డు జడ్జి రవీందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కొందరు రంగంలోకి దిగారు. ఆ మేరకు ఆయనను పిలిచారు. చివరి నిమిషంలో ఆ చేరికకు ఎందుకు బ్రే కులు పడ్డాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన చేరికను అడ్డుకున్నదెవరు? నిజంగా అమిత్‌షానే వద్దన్నారా? అనే విషయంలో పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర నేతల మధ్య సమన్వయలోపం వల్లే ఆయన్ని పార్టీలో చేర్చుకోలేదన్న వాదనలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశంపై బండారు దత్తాత్రేయను మీడియా ప్రశ్నించగా చిన్న సమాచార లోపం వల్ల అలా జరిగిందని పేర్కొనడం గమనార్హం. -
రాజీనామా కాదు.. వీఆర్ఎస్ తీసుకుంటా
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల తీర్పునిచ్చి, అనంతరం తన పోస్టు కు రాజీనామా చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కె.రవీందర్‌రెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. రాజీనా మా విషయంలో పునరాలోచనలో పడ్డ ఆయన, సన్నిహితులతో చర్చించి.. తాను ఇచ్చిన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. రాజీనామా లేఖ స్థానంలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం తాజాగా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు నిబంధనల మేర లేకపోవడంతో హైకోర్టు దానిని వెనక్కి ఇచ్చేసింది. నిర్దిష్ట ఫార్మాట్ ప్రకారం దర ఖాస్తు చేసుకోవాలని రవీందర్‌రెడ్డికి స్పష్టం చేసింది. వీఆర్ఎస్ నిర్ణయం దృష్ట్యా ఆయన గురువారం విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రవీందర్‌రెడ్డి, సాయంత్రం కల్లా రాజీనామా చేయడం సంచలనం సృష్టించిం ది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ బహిర్గతం కాలేదు. అవినీతి ఆరోపణల వల్లే రాజీనామా చేశారని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. 2 రోజుల పాటు తర్జనభర్జన అనంతరం, రాజీనామా చేస్తే, ఇన్నేళ్ల సర్వీసు వృథా అవుతుందని, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడం తో ఆయన పునరాలోచనలో పడ్డారు. అనంతరం రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని, దాని స్థానంలో వీఆర్ఎస్కు అనుమతించాలని హైకోర్టును కోరారు. నిబంధనల ప్రకారం వీఆర్ఎస్కు 3 నెలల నోటీసు తప్పనిసరి. దీంతో ఆయన స్వయంగా హైకోర్టుకు వెళ్లి వీఆర్ఎస్ దర ఖాస్తును సమర్పించారు. పదవీవిరమణ (58 ఏళ్లు)కు సమీపంలో ఉన్న తనకు మరో రెండేళ్ల పొడిగింపు వచ్చే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. 58 నుంచి 60 ఏళ్లకు పొడిగింపునిచ్చే విషయంలో హైకోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పొడిగింపును ఇవ్వదలచిన న్యాయాధికారి పనితీరు, నీతి నిజాయితీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుంది. -
జడ్జి రవీందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు!
హైదరాబాద్: మక్కా మసీదులో బాంబు పేలుడు కేసులో సంచలన తీర్పు చెప్పిన జడ్జి రవీందర్‌రెడ్డికి సంబంధించి అనూహ్య కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జిగా మక్కా పేలుళ్ల కేసును కొట్టివేసిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో పదవీ విరమణ పొందాల్సిన ఆయన హఠాత్తుగా వైదొలగడం, రాజీనామాకు గల కారణాలు స్పష్టంగా వెల్లడికాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రవీందర్ రెడ్డి రాజీనామాపై ఇటు నాంపల్లి కోర్టులో, అటు హైకోర్టులో ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. కాగా, సదరు జడ్జిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు కూడా సాగుతున్నదని ‘ఇండియా టుడే’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పలువురు జడ్జిలు లంచాల కేసుల్లో అరెస్టై జైలుపాలైన నేపథ్యంలో తాజా కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత) -
మక్కా పేలుళ్ల తీర్పునిచ్చిన జడ్జి రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పును వెలువరిచిన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఐదుగురు నిర్దోషులు అంటూ సోమవారం ఉదయం తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రవీందర్ రెడ్డి రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే తీర్పు తరువాత బెదిరింపు కాల్స్ వచ్చాయని రవీందర్ రెడ్డి తన మిత్రులకు చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్ అయిన 11 మందిలో ఆయన ఒకరు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం గతంలో రాజీనామా సైతం చేశారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. ఎన్ఐఏ జడ్జిగా రాజీనామా చేసిన రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జల్లా. ప్రస్తుతం ఆయన తెలంగాణ జ్యుడీషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ రాజీనామాకు కారణం ఒత్తిల్లేనని భావిస్తున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర మనోవ్యధతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నా అసలు కారణం మాత్రం తెలియరాలేదు. -
భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఇంట పెళ్లి సందడి
-
సిమెంటుకు రవాణా వ్యయమే అడ్డంకి
♦ వ్యయాలు తగ్గితే ఎగుమతులకు ఊతం ♦ భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని సిమెంటు కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.1 టన్నులకు చేరుకుంది. వినియోగం 28.5 కోట్ల టన్నులుంది. ఇందులో పొరుగునున్న దేశాలకు ఏటా 60 లక్షల టన్నుల సిమెంటు ఎగుమతి అవుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల వినియోగం 50 శాతం ఉండడంతో ఎగుమతులపై ఇక్కడి కంపెనీలు దృష్టిపెట్టాయని తెలియజేశారు. అయితే పరిశ్రమకు రవాణా వ్యయమే పెద్ద అడ్డంకిగా అభివర్ణించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతయ్యే సిమెంటు విక్రయ ధరలో రవాణా వ్యయం 44 శాతం ఉంటోందని గుర్తు చేశారు. రైలు మార్గంలో నౌకాశ్రయాలకు నల్లగొండ క్లస్టర్ నుంచి దూరం 461 కిలోమీటర్ల వరకు, కడప క్లస్టర్ నుంచి 652 కిలోమీటర్ల వరకు ఉందని తెలియజేశారు. కంటైనర్ కార్పొరేషన్, రైల్వేల వంటి సంస్థలు రవాణా వ్యయం తగ్గేందుకు కృషి చేయాలని కోరారు. తద్వారా సిమెంటు ఎగుమతులకు ఊతమిచ్చినట్టు అవుతుందని చెప్పారాయన. ఆలస్యమవుతున్న ఎగుమతులు.. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాలకు ఔషధ ఎగుమతులకు హైదరాబాద్ నుంచి 60 రోజుల దాకా సమయం పడుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ మదన్ మోహన్‌రెడ్డి తెలిపారు. సమీప నౌకాశ్రయాల నుంచి పశ్చిమ దేశాలకు నేరుగా కనెక్టివిటీ లేకపోవడం, ముంబై పోర్టు రద్దీ దృష్ట్యా కొలంబో మీదుగా నౌకల్లో సరకు ఎగుమతి చేయాల్సి వస్తుండడం ఇందుకు కారణమన్నారు. తయారీ 30 రోజుల్లో పూర్తి అయినప్పటికీ, కంపెనీలు సమయానికి సరుకు డెలివరీ చేయలేకపోతున్నాయని గుర్తు చేశారు. పరోక్షంగా ఇక్కడి పరిశ్రమపై ఇది ప్రభావం చూపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లోని ఔషధ కంపెనీలకు ఎగుమతులకుగాను రవాణా వ్యయం 10–11 శాతం అవుతోంది. దీనిని 5–6 శాతానికి చేర్చడం సాధ్యమేనని ఆయన అన్నారు. కస్టమ్స్ అనుమతులకు గతంలో 7–11 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు సరుకు దిగే సమయానికే అన్ని క్లియరెన్సులు ఇస్తున్నట్టు హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.కె.రామన్ తెలిపారు. సమ్మిట్‌లో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జయంత్ టాగోర్, మారిటైమ్ గేట్‌వే పబ్లిషర్ రామ్‌ప్రసాద్ మాట్లాడారు. -
రామ్‌చరణ్ చాన్స్ ఇస్తే...
‘‘హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమకు ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడనేది మా సినిమా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘దర్శకుడు కావాలని వచ్చా. కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా చేశా. దర్శకులు శ్రీవాస్‌తో మంచి అనుబంధం ఉంది. ‘డిక్టేటర్’ షూటింగ్లో ఆయనను కలసినప్పుడు కోన వెంకట్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ గురించి చెప్పారు. కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫస్టాఫ్‌లో అందమైన ప్రేమకథ, సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ యాక్షన్ ఉంటాయి. ‘ప్రేమమ్’ హిట్ తర్వాత చైతూ నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుంది. రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనేది నా కోరిక. ఆయన చాన్స్ ఇస్తే కచ్చితంగా చేస్తా. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా నిర్మిస్తున్నా. ఫిబ్రవరిలో గోపీచంద్‌తో ఓ సినిమా ఉంటుంది. విజయ్ ఆంటోని ‘యమన్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. తమిళ ‘ఈట్టి’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం’’ అన్నారు. -
పోలీసులకు యువత సాయం
ఏడాదికి ఓసారి వచ్చే గణేష్ నిమజ్జనంలో ఎంజాయ్ చేయడమే కాదు... పోలీసులకు సహకరిస్తామంటూ ముందుకు వచ్చారు గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన బాడీబిల్డర్స్. సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు ఇచ్చిన స్ఫూర్తితో ‘ది ఇండియన్ జిమ్’ నిర్వాహకుడు కె.రవీందర్‌రెడ్డి స్థానిక యువతను కూడగట్టారు. ఆయన నేతృత్వంలో 40 మంది యువకులు నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించడానికి ముందుకు వచ్చారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేసిన పోలీసులు సరూర్‌నగర్ ట్యాంక్ వద్ద సేవలకు వినియోగించారు. ప్రధాన నిమజ్జనానికి రెండు రోజుల ముందు నుంచీ పోలీసులతో పాటు డ్యూటీ చేసిన ఈ యూత్ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణ, విగ్రహాలను లారీల నుంచి దింపి క్రేన్లలోకి ఎక్కించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకూ తోడ్పడ్డారు. రవీందర్‌రెడ్డి సారథ్యంలో ఆరేళ్ల నుంచి ప్రతిసారీ నిమజ్జనం నేపథ్యంలో ఈ తరహా విధుల్లో పాలుపంచుకుంటున్నాయి. -
అప్పుల బాధ తాళలేక..
పాతాళగంగ కోసం భగీరథ ప్రయత్నాలు చేసిన అన్నదాత అప్పుల పాలై వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి(42) తనకున్న నాలుగెకరాల భూమిలో ఎనిమిది బోర్లు వేసిన నీరు రాలేదు. బోర్లు వేయడానికి చేసిన అప్పు తీర్చడానికి నగరానికి వచ్చిన లాభం లేకపోవడంతో.. తిరిగి స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో అప్పుల వారి బాధ పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజశేఖరుడు'ప్రజా శేఖరు'డైన వేళ
"మంచి వాడికి మరణం సాక్షి" అని మన పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత అనుపమానమైన తన ఆరేళ్ల పాలనలో అక్షర సత్యంగా నిరూపించుకుని మంచి పాలకునిగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో శాశ్వత స్థాన్నాన్ని పొందిన ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి (ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి) వర్తించినంతగా బహుశా కడచిన యాభై నాలుగేళ్ళ రాష్ట్ర చరిత్రలో మరెవరికీ వర్తించదంటే అతిశయోక్తి కాదు! భారతీయుల సగటు ఆయుః ప్రమాణం 70 ఏళ్ళకు మించబోతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళ వయస్సు అనేది క్రియాశీలుడైన నాయకునిలో ఎదిగి వచ్చిన పరిణతికి నిదర్శనమేగానీ అతని వయస్సు మీరిపోవడానికి ఆనవాలు కాదు. జ్ఞాన దీక్షతో, వివేచనతో అనేక ఢక్కామొక్కీలు తింటూనే స్వయంశక్తితో, స్వయంప్రకాశంతో అంచెలంచెలుగా దూసుకు వచ్చినవాడు, రాష్ట్ర శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయక స్థానం నుంచి జాతీయ స్థాయిని అందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి హోదాకు అర్హత పొందినవాడు డాక్టర్ వై.ఎస్. ఇలా అమితమైన తెగువతో తన ప్రత్యేక వ్యక్తిత్వ ముద్రతో ముందుకు సాగుతూ వచ్చిన రాజశేఖరుడి జీవితమూ, రాజకీయ జీవితమూ అకస్మాత్తుగా అత్యంత విషాదకరంగా (హెలీకాఫ్టర్ దుర్ఘటన కారణంగా) అంతిమ యాత్రకు చేరుకోవడం - ప్రజల దృష్టిలో దుర్భరం, దుస్సహం! రాష్ట్ర చరిత్రలోని అయిదు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివిధ ముఖ్యమంత్రుల పాలనలో వివిధ రంగాలలో చవిచూసిన ప్రగతి ఒక ఎత్తు కాగా, అతి స్వల్పకాలంలోనే "ప్రజాశేఖరుడి"గా రూపమెత్తిన రాజశేఖరుడి పాలనలో కళ్లారాచూసి, ఆచరణలో, పరిమిత స్థాయిలోనే అయినా ప్రజలు అనుభవించిన అభ్యుదయం మరొక ఎత్తు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఆయన అనుకున్నట్లుగానే, పరిపూర్తిగా ప్రజల అనుభవంలోకి యింకా రావలసి ఉన్నప్పటికీ - ఒక ముఖ్యమంత్రిగా ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఆయనలోని చిగురు తొడిగిన తపననూ, చిత్త శుద్ధినీ ప్రజాబాహుళ్యం గుర్తించింది. ఆయన పాలన పట్ల విశ్వసం పెంచుకుంది. రేపు తమ భవిష్యత్తు మరింత మెరుగుకానున్నదన్న ఆత్మవిశ్వాసాన్ని రాజశేఖరుడు కల్గించగలిగాడు. రాజశేఖరుడిది ఆహార్యంలో తెలుగుదనం, ఆచరణలో సేవాతత్పరత, రాజనీతికి సరికొత్త నిర్వచనం. మనస్సు ప్రణాళికాబద్ధం, ప్రవర్తన సుశిక్షితం, మడమ తిప్పని నడత, మాట తప్పని నిబద్ధత, నిండైన వ్యక్తిత్వం, మెండైన ఆత్మీయత, కడుపునిండించే దరహాసం, పలకరింపులో ఆదరణ, పనిలో పట్టుదల, పట్టుదలలో తిరుగు లేని కార్యదీక్ష - ఇన్ని లక్షణాల సమాహారమే సందింటి రాజశేఖరరెడ్డి! ప్రజాసేవకు అతణ్ణి పురిగొల్పిన ఈ తపనే 2004 ఎన్నికల్లో సుమారు 1500 కిలోమీటర్ల మేర రాష్ట్రం ఆ కొసనుంచి ఈ కొసదాకా విడుపు లేని పాదయాత్ర చేయించింది. సరిగ్గా అదే తపన రాష్ట్రాధినేతగా పదవీ స్వీకారం చేసిన వెంటనే బహుముఖీనంగా - కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు కేసిన పలు వాగ్దానాలకు తోడుగా, ఇవ్వని హామీలను కూడా అతని చేత రూపకల్పన చేయించింది, చాలావరకూ ఆచరణలో పెట్టించింది! రాజశేఖరుడిలో పెల్లుబికిన ఈ తపనే తాను తలపెట్టిన పథకాలు, కార్యక్రమాలూ సచివాలయ స్థాయికి మాత్రమే కుదించుకుపోకుండా సామన్య ప్రజల జీవనానికి అద్దం పట్టే గ్రామాల స్థాయిలో ఆచరణలో, ఏ మేరకు అమలుకు నోచుకుంటున్నాయో తెలుసుకోవడానికి "పల్లెబాట" పట్టాడు, "రచ్చబండ" వద్దకు చేరాడు. నేరుగా ప్రజలనుంచి, ప్రజల నోళ్ళ ద్వారా తెలుసుకోవాలన్న ఆబకొద్దీ ఆయన చేత ఈముందడుగు వేయించింది. చివరికి అదే తపన, అదే నిబద్ధత ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా అతణ్ణి మొండిగా ముందుకునెట్టి, అతని జీవితాన్ని అర్థాంతరంగా విషాదాంతంగా మార్చింది. అలా ప్రజా సేవాతత్పరతలోముందుకు సాగిపోతూ, తలపెట్టిన కొన్ని పథకాలు అంచనాలకు మించి విజయపరంపర సాగిస్తూ, ఆ పథకాలు ప్రజాయత్తం కాబోతున్న శుభఘడియలలో ఈ విషాదం రాష్ట్ర ప్రజల్ని దుఃఖసాగరంలో ముంచెత్తింది. రాజశేఖరుడు తన ఆరేళ్ళ పాలనా వ్యవధిలో తలపెట్టిన పనులు ఒకటీ అరా కాదు, ఎన్నో! నిష్కామంగానేకాదు, నిశ్చలబుద్ధితో, అతను ఒక వర్గానికి కాదు, సేవలందుకోవలసిన ప్రజాబాహుళ్యం లోని పేద, మధ్య తరగతి వర్గాలకు, బడుగు వర్గాలకు, రైతాంగానికీ, వృత్తిదారులకూ, మహిళలకూ, విద్యార్థులకూ, ఉపాధ్యాయులకు, కిందస్థాయిలోని ఉద్యోగవర్గాలకు రకరకాల పథకాలు ప్రకటించాడు. ఈ ప్రకటించడంలో, అమలు జరిపించడంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పెంచిపోషిస్తున్న ధనికవర్గ సమాజం అనుమతించిన పరిధులనూ, పరిమితులనూ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొనక తప్పలేదు. ఆ పరిమితుల్లోనే పేదవర్గాల అనుభవంలోకి కొన్ని నిర్దిష్టమైన పథకాలనయినా తేవాలని కృషి చేశాడు. "స్వాతివానకు ముచ్చెపు చిప్ప ఎదురుచూసి"నట్టుగా, పెక్కేండ్లుగా అనావృష్టికి గురవుతూ రైతాంగ ప్రజల నడ్డివిరుస్తున్న పరిస్థితులకు పరిష్కారంగా, గతంలో రాష్ట్రం అనుభవించిన వర్షాభావ పరిస్థితుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాగునీటి పథకాలను రాజశేఖరుడు తలపెట్టాడు. తన పాలనా వ్యవధికి ఉన్న పరిమితుల దృష్ట్యా కూడా ముందస్తు చర్యగా ఆయన 70 సేద్యపునీటి(ఇరిగేషన్) ప్రాజెక్టులకు రూపకల్పన చేయించాడు. కాగా అందులో 17-20 ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతిని కేంద్రంతో మాట్లాడి, పోట్లాడి మరీ సాధించాడు. తన తపనకు కార్యరూపంలో 9-10 ప్రాజెక్టుల్ని రైతాంగం అనుభవంలోకి అక్షరాలా నిర్మించి కూర్చున్నాడు! పెరిగి పోతున్న ధరల మధ్య పేదవాడికి కేజీ బియ్యం రూ.2లకే అందించే పథకాన్ని "రాజర్షి"గా రాజశేఖరరెడ్డి తన హయాములో కొసకంటా అమలు జరుపుతూ వచ్చాడు. తెల్లకార్డుల మీద ఏడాదికి దాదాపు రూ.2,000 కోట్ల మేర ఇందుకయ్యే సబ్సిడీని రాజశేఖర్ ప్రభుత్వం భరించింది. అంతేగాదు, పేదవాడికి బియ్యం ఇస్తే చాలదు, వంటావార్పులకు నెలవారీ సరుకులు(రూ.103 కిమ్మతుగలవి) కూడా సరఫరా చేయించాడు. ఈ తపన వెనక ఆయనకున్న ప్రత్యేక లక్షణం, ఇతరులలో మనం చాలా చాలా అరుదుగా మాత్రమే చూడగల్గిన ఆ గుణం - సమస్యల్ని నాన్చకుండా తక్షణ నిర్ణయాలు చేయగలగడం! పనిమంతుడైన డాక్టర్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన పెక్కు పథకాలలో ఒకటి మహిళలకు ఆచరణలో సాధికారత కల్పించడం. స్వయం సహాయక సంస్థలలో సుమారు 1 కోటి 25లక్షల మందికి పింఛను సౌకర్యం కల్పించాడు. ఈ సంస్థల సభ్యులలో 60 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.500 - 2000 దాకా పింఛను ఏర్పాట్లు చేశాడు. విద్యారంగంలో బడుగుస్థితిలో ఉన్న పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్య వరకూ స్వయం సహాయ సంస్థల సభ్యుల బిడ్డలకు ఏటా ఉపకారవేతనాలు అందించే ఏర్పాట్లు చేశాడు. ఇంజనీరింగ్ విద్యాదశకు చేరిన పేద(ఎస్.సి., ఎస్.టి., బి.సి)విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించే ఏర్పాట్లు చేశాడు. అసలు 2004 మే 14 తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘడియలలోనే ప్రజల కిచ్చిన మాటకు నిలబడి రైతాంగానికి "ఉచిత విద్యుత్" అందించాలన్న ఆదేశపత్రంపై సంతకం చేశాడు. రూ.1,300 కోట్ల మేరకు పాత విద్యుత్ బకాయిలను ఒక్క కలంపోటుతో రద్దు చేసి రైతాంగం తలపై బరువును దించి, రైతాంగ ప్రజల అభినందనలు అందుకున్నాడు. దీనికి తోడుగా పేద, నిరుపేద కుటుంబాల అనుభవంలోకి రాని సంస్కరణలను, ప్రభుత్వాల విధానాలలోని లొసుగులు ఆధారంగా న్యాయస్థానాలలో మూలుగుతున్న భూ పంపిణీ వివాదాలను పక్కన పెట్టి, నాలుగు విడతల్లో దాదాపు 6లక్షల ఎకరాలు, అయిదవ విడతలో మరో లక్ష ఎకరాలు(2010 ఏప్రిల్ లో) పంపిణీ చేసింది కూడా వై.ఎస్ ప్రభుత్వమే. అయిదవసారి భూపంపిణీ కార్యక్రమంలో విశేషం - రాజశేఖర్ ఏ కారణం చేతనైనా లేదా ఏ సాకు పైనయినా మహిళలకు అన్యాయం జరగకుండా ఉండేందుకుగాను మహిళల పేరనే భూస్వాధీన పట్టాలు యివ్వాలని ఆదేశించడం. ఆ ఆదేశం ప్రకారమే అయిదవసారి భూపంపిణీ జరిగింది. కాగా, అన్ని సంక్షేమ పథకాలకి తలమానికమైన అంశం - ప్రజారోగ్య రక్షణలో ప్రథమస్థానం పేద, బడుగు వర్గాల ప్రయోజనాలకు యిచ్చే "ఆరోగ్య శ్రీ" పథకం. అపర "ధన్వంతరి"గా మారిన రాజశేఖరుడు తలపెట్టిన ఈ"రాజ"వైద్యం, ఉచిత వైద్యం, ఆపరేషన్లతో సహా, 942 రకాల వ్యాధులకు వర్తింపచేయాలన్న సంకల్పంతో "ఆరోగ్య శ్రీ" కింద కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రెండున్నర లక్షల మంది పేదలకు, కొందరు మధ్యతరగతి వ్యాధిగ్రస్తులకు చికిత్స సమకూడింది. ఈ బృహత్ కార్యక్రమానికి సైదోడుగా కీలక పాత్ర వహించిన ప్రభుత్వ సేవావ్యవస్థలు పట్టణాలలో "108" , గ్రామీణకేంద్రాలలో "104" సంఖ్యలతో సంచార ఆరోగ్య కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ పథకం దాదాపు అరడజనుకు పైగా పరాయి రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా రూపొందింది! ఇదే తపనతో డ్వాక్రా మహిళలకు అంతకు ముందు యిచ్చే12శాతం వడ్డీ స్థానే"పావల వడ్డీ "కే రుణాలు అందేలా చూశాడు. అలా డ్వాక్రా సామాన్య మహిళలకు బ్యాంకులిచ్చిన రుణాలలో దాదాపు 99శాతం రుణాలు సకాలంలో తీరుమానమయ్యాయి. రాజశేఖర్ ప్రభుత్వం, ఆచరణలో పంపిణీకి అనుకూలమైన భూమి యింకా ఎంత ఉందో సర్వేజరిపి, లెక్కలు తీసేందుకు, అవి ఆధారంగా భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కోనేరు రంగారావు కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులను ఆధారం చేసుకుని రాజశేఖర్ తన కుటుంబానికి సంబంధించి సీలింగ్ చట్ట పరిమితులకు లోబడి యింకా మిగిలిన 310 ఎకరాలను (ఎసైన్డ్ ల్యాండ్) ప్రభుత్వానికి దఖలు పరచడమే గాక, సుమారు మరో వెయ్యి ఎకరాలను కూడా పంపిణీకి సుకరం చేసి ఆదర్శంగా నిలిచాడు. అందుకే, సుప్రసిద్ధ రచయితలు, కళాకారులు బెస్ స్టీన్, సాల్ బెల్లో, సాల్వడార్ డాలీలు విభిన్న కోణాల నుంచి యిలా అని ఉంటారు: "ఈ జీవితాన్ని నీవనుకున్న సన్మార్గంలోకి మరల్చడానికి నీవు తిరుగులేని నిర్ణయం తీసుకోవాలి. ఆ మార్పును సాధ్యం చేయడానికి నీవు అసలు ఏం చేయాలనుకుంటున్నావో అందుకు తగిన స్పష్టత, లక్ష్యశుద్ది అవసరం"అని బెన్ స్టీన్ అంటే, "అనుకున్న సుదోర లక్ష్యాన్ని చేరుకోవాలంటే, ముందు చిన్న చిన్న పనులతోనే ప్రారంభించి జయప్రదం కావాలి"అని సాల్ బెల్లో అనగా- "ఆబ, తపన లేని మేధ, తెలివీ రెక్కలు లేని పక్షిలాంటిద"ని సాల్వడార్ డాలీ అన్నాడు! డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి తపన ఉంది, దానికి మించిన పట్టుదల ఉంది, మేధ ఉంది, దానికి ఆకాశమే హద్దుగా ఉంది, వీటన్నింటికీ మించిన ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన చిరంజీవి! చేసిన పనులతో ధన్యజీవి! చైతన్యవంతమైన ఆరేళ్ళ పాలనా వ్యవధిలో రాజశేఖర్ పదవీ స్వీకార శుభఘడియల నుంచి తన అకస్మిక మరణం వరకూ అవిశ్రాంతంగా, అనితర సాధ్యంగా వివిధ సందర్భాలలో ప్రజల మధ్య కదలాడుతూ, కార్యవాదిగా చేసిన పనులకు సాక్షీభూతంగా, సుప్రసిద్ధ చిరంజీవి రవీందర్ రెడ్డి తన కెమెరాలో ఎన్నో ఘట్టాలను బంధించాడు. వీటిలోతన చిత్రాలతో పాటు ఇతర సోదర ఛాయాగ్రాహకులు తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని మిత్రుడు రవీందర్ సంకలన పరిచాడు. అతను కెమెరాతో సంధించిన అంగుళీ విన్యాసాలతో రాజశేఖర్ రెడ్డి వైవిధ్యభరితమైన జీవన సమర చిత్రచయనిక ఒక విశిష్ట నివాళి. - డాక్టర్ ఏబీకే ప్రసాద్ -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం
తెలంగాణ న్యాయమూర్తుల అసోసియేషన్ నేతలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు న్యాయవాదులు బార్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో కోర్టుల నుంచి ర్యాలీ నిర్వహించారు. రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామకంలో అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయమూర్తులంతా రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో నాయకత్వం వహించిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాద్‌లను సస్పెండ్ చేశారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా న్యాయమూర్తులను తెలంగాణకు కేటాయించడాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్యాతం సిద రాములు, సీనియర్ న్యాయవాదులు వీఎల్ నర్సింహారెడ్డి, మంద వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గన్నారు. -
ఇద్దరు న్యాయమూర్తులను సస్పెండ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్ అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జి కె.రవీందర్ రెడ్డిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. రవీందర్ రెడ్డి సహా జనరల్ సెక్రటరీ వరప్రసాద్‌ను కూడా న్యాయస్థానం సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆప్షన్ విధానంపై తెలంగాణ న్యాయమూర్తులు ఆదివారం హైదరాబాద్‌లో ఛలో రాజ్‌భవన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ కోర్టు వ్యవహారాలు అడ్డుకోవటంతో క్రమశిక్షణ చర్యల కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ సస్పెన్షన్‌ను నిరసిస్తూ న్యాయమూర్తులు ఆందోళనకు దిగారు. కాగా ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్దపడ్డారు. తెలంగాణ జడ్జీల రాజీనామా లేఖలను ఆదివారం జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌కు ఇచ్చారు. అనంతరం గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు న్యాయాధికారులు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడానికి వెళ్లిన విషయం విదితమే. -
టీఎన్జీఓ అధ్యక్షునిగా రవీందర్‌రెడ్డి
గౌరవ అధ్యక్షునిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా హమీద్ హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీఓ) రాష్ట్ర అధ్యక్షునిగా కారెం రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన కేంద్ర కార్యవర్గ కమిటీ అత్యవసర సమావేశంలో రవీందర్‌రెడ్డితోపాటు దేవీప్రసాద్‌ను గౌరవ అధ్యక్షునిగా, ఎంఏ హమీద్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. రవీందర్‌రెడ్డి గతంలో ఐదేళ్లపాటు వరంగల్ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షునిగా, 2012 నుంచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటివరకు టీఎన్జీఓ అధ్యక్షునిగా ఉన్న దేవీప్రసాద్, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంఘం అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. దీంతో సంఘం అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు. కాగా, దేవీప్రసాద్ సేవలు సంఘానికి, ఉద్యోగులకు అవసరమని ఆయనను గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గసభ్యులు పాతవారే కొనసాగుతారు. -
హనీమూన్ అనే ఆగాం..!
* ప్రజా సమస్యలపై పభుత్వాన్ని ఎండగడతాం.. * కట్టుతప్పిన ఎమ్మెల్యేలపై కఠినంగా ఉంటాం * షబ్బీర్‌పై విమర్శలు సరికాదు మీడియాతో ప్రతిపక్షనేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన టీఆర్ఎస్పై వెంటనే విమర్శలు చేస్తే తొందరపడుతున్నామనే భావన రాకుండా ఉండడానికే హనీ మూన్ సమయం ఇచ్చాం... అంతేకానీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నామని భావించడం సరికాదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రమశిక్షణ తప్పిన పార్టీ ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షపాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ సీనియర్‌నేత షబ్బీర్ అలీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను జానారెడ్డి ఖండించారు. టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యవ్యవస్థకు మంచిది కాదని, వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరామన్నారు. జాతీయగీతాలాపన సమయంలో జరి గిన ఘర్షణలకు సంబంధించిన వీడియో సీడీల పుటేజీలను పూర్తిగా చూపించాలని స్పీకర్‌కు గతంలోనే లేఖ రాసినట్టు చెప్పారు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపైనా స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. టీపీసీసీ, సీఎల్పీ మధ్య ఎలాంటి విభేదాల్లేవని, అలా ఉన్నాయని ఎవరైనా చెబితే వా రి వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కు ఏది ఉపయోగమో, వాటికోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకుని రావడమే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. సీఎల్పీలతో విభేదాలున్నాయని చెప్పే నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించినట్టేనన్నారు. క్రమశిక్ష ణ లేకుండా మాట్లాడడం తనకు చేతకాదన్నారు. ‘జానా’నే సీఎం చేస్తారేమో.. ‘ మా నాయకుడు జానారెడ్డి మాటనే శిరోధార్యం అంటూ సీఎం అంటున్నరు. సీఎం కేసీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదని అంటున్నరు. ఆయన చికిత్సకోసం అమెరికా పోతున్నారని, కేటీఆర్‌ను సీఎం చేస్తారని కూడా అంటున్నరు. అయితే కేటీఆర్నో, హరీశ్‌రావునో కాకుండా జానారెడ్డినే సీఎం చేస్తారే మో? ఆయనను సీఎం చేస్తే అడిగేవారు కూ డా ఉండరు’ అంటూ అసెంబ్లీ లాబీల్లో తన ను కలసిన విలేకరులతో చిన్నారెడ్డి పిచ్చా పాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
జాయింట్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
ప్రగతినగర్ : జిల్లా సంయుక్త కలెక్టర్‌గా రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో ఎస్టేట్ సెక్రెటరీగా ఉన్న ఆయనను జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. తహశీల్దార్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన రవీందర్‌రెడ్డి డీఆర్ఓ, జడ్పీ సీఈఓ, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ తదితర విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కొత్త జేసీకి బాధ్యతలను అప్పగించారు. ఏడు నెలలుగా జేసీ బాధ్యతలను కలెక్టరే చూస్తున్నారు. బాధ్యతలు స్వీక రించిన అంతనరం జేసీకి పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. -
'రోబోటిక్ టెక్నాలజీతో సిమెంట్ తయారీ'
-
తొలి అడుగే ధీమాగా
‘‘ఇంతియని చింతించవలదు... ఘనములెన్నియో చేసి చూపింతుము’’ అన్న ఓ కవి వాక్కులను వారు నిజం చేశారు. పాలనలో తొలి అడుగే అయినా ధీమాగా వేశారు. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, అటు ఆఫీసు పనులను చక్కబెట్టారు. తమ మీద నమ్మకముంచి అందలమెక్కించిన జనం సమస్యల పరిష్కారంలోనూ ముందుంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు అవుతోంది. తొలిసారిగా ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను అధిరోహించిన పలువురు మహిళా నేతలు ఈ ఆరు నెలల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వేలమైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు కాస్త తడబడినా.. ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోగలిగితే ఇక ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా ఎదురుండదు. అందులోనూ ఆడవాళ్లు ఒక్కసారి తమ మనసును లగ్నం చేస్తే ఏపనినైనా విజయవంతం చేసేదాకా వదలరు. ఆరునెలల కిందటి దాకా వంటింటికే పరిమితమై.. ఇంటి బాధ్యతలను పంచుకున్నారు వీరంతా. కనీసం పక్క ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక మండలాఫీసు, జిల్లా పరిషత్తు అంటే.. అవేంటి, ఎక్కడుంటాయి అనేవారు. కానీ ఇప్పుడు.. ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా గెలుపొందారు. తమ మండలంలో ఏ ఊరిలో ఏ సమస్య ఉంది.. దాని పరిష్కారానికి ఏం చేయాలి.. ఏ అధికారి ఏం పనిచేస్తాడు.. ఇలా అన్ని విషయాలపై పట్టు సాధించారు. ఆడవాళ్లు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎంపీపీలు, జడ్పీటీసీలుగా దాదాపు ఆరునెలల పదవీకాలం పూర్తిచేసుకున్న పలువురు మహిళా ప్రజాప్రతినిధుల ‘వాయిస్’ ఇది... ప్రజాసమస్యలపై అవగాహన నాగిరెడ్డిపేట : ఎంపీపీ పదవి చేపట్టి ఆరునెలలవుతోంది. ఇప్పటిదాకా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనవచ్చింది. ప్రజాప్రతినిధుల, అధికారుల విధులు, బాధ్యతలు తెలుసుకున్నాను. అంతకుముందు ఇంటికే పరిమితమైన నాకు కొత్తలో కొంత కష్టమైంది. రిజర్వేషన్ కారణంగా ఎంపీపీనైన నాకు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి సహకరిస్తున్నారు. మండలంలో పలు సమస్యల పరిష్కారానిక ప్రతిపాదనలు చేశాం. నిధుల వస్తే అభివృద్ధి పనులను చేపడతాను. -ఊశమ్మ, ఎంపీపీ, నాగిరెడ్డిపేట కొత్త విషయాలు తెలుసుకోవడం.. సదాశివనగర్ : మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త విషయాలను నేర్చుకున్నా. రాజకీయ అనుభవం కూడా వచ్చింది. ప్రజలు, అధికారులతో పరిచయాలు పెరిగాయి. ప్రతీ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తున్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఉద్దేశం. - బంజ విజయ, ఎంపీపీ, సదాశివనగర్ -
ఇగో టీ.. ఇనాం..
కార్మికులకు తెలంగాణ కానుక ఈ నెల వేతనాలతో ఇంక్రిమెంట్ బేసిక్‌పై 3 శాతం స్పెషల్ పేమెంట్ సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం కొత్తగూడెం(ఖమ్మం) : మూడు నెలలుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్‌ను కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూఏ కార్మికులు, ఎగ్జిక్యూటివ్ ర్యాంకు కార్మికులకు 3 శాతం ఇంక్రిమెంట్ అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల వేతనాల తోపాటు ఈ ఇంక్రిమెంట్ అందనుంది. అయితే, ఇది పీఎఫ్, డీఏ, పెన్షన్లకు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీ కవితకు కృతజ్ఞతలు శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : తెలంగాణ ఇంక్రిమెంటుకు యాజమా న్యం అంగీకరించడంతో గుర్తింపు సంఘం నాయకులు.. యూని యన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వ కుంట్ల కవితను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరా జు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, డాక్టర్ శం కర్నాయక్ ఎంపీని గురువారం కలిసి.. ఇంక్రిమెంటు విషయమై మాట్లాడినట్లు ఉపాధ్యక్షుడు ఏనుగు రవీం దర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఎంపీ వెంటనే సింగరేణి సీఎం డీతో చర్చించారని, అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యా యని విలేకరులతో రవీందర్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న 62వేల మందికి ఈ ఇంక్రిమెంటు వర్తిస్తుం దని పేర్కొన్నారు. కాగా, ఈ ఇంక్రిమెంటుతో కంపెనీపై ప్రతీ నెల సుమారు రూ.5.31కోట్ల భారం పడనుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. యాజమాన్యం నిర్ణ యంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రొ.జయశంకర్ విగ్రహావిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని నాన్ టీచింగ్ హోంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లేష్‌తో పాటు ఉద్యోగ సంఘాల నేతలు పార్థసారథి, మల్లేష్, జ్ఞానేశ్వర్, అవినాష్, దీపక్‌కుమార్, మహమూద్, అక్బర్‌బేగ్, ఓం ప్రకాష్, ఖాజమోహినుద్దీన్, ఎల్లమయ్య, భూమారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ఈద్ మీలాఫ్ ఉత్సవాలను నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అమరుల కుటుంబాల కోసం ఓయూ ఉద్యోగులు సేకరించిన రూ.14.50 లక్షల చెక్‌ను టీఎన్జీఓస్ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కు వారు అందించారు. విద్యార్థుల ఆందోళన ఓయూలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు వస్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రులను అడ్డునేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని పది మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిని లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితిని తెలుసుకున్న మంత్రులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. -
రవీందర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి
వరంగల్ క్రైం : విధి నిర్వహణలో రవీందర్‌రెడ్డిని మిగతా సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అన్నారు. మూడు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై మాధవరెడ్డి రవీందర్‌రెడ్డిని స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది, అధికారులు ఘనంగా సన్మానించారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, అదనపు ఎస్పీ ఎం.యాదయ్య ముఖ్యఅతిథులుగా పాల్గొని ఎస్సై రవీందర్‌రెడ్డిని సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. 1979లో పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరిన రవీందర్‌రెడ్డి 1983లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2001లో ఏఎస్సైగా, 2009లో ఎస్సైగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్సైగా రాయపర్తి, బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు. అర్బన్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. రవీందర్‌రెడ్డి పదవీ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవ, ఉత్తమ సేవ పతకాలను అందుకోవడంతోపాటు 50కిపైగా శాఖాపరమైన రివార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రవీందర్‌రెడ్డి సమయ పాలన పాటిస్తూ తనకు అప్పగించిన పనులను విజయవంతంగా నిర్వహించారన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీలు వాసుసేన, నాగరాజు, డీఎస్పీ జనార్దన్, సీఐ మదన్‌లాల్, ఎస్సైలు సత్యనారాయణ, రహమాన్, రవికుమార్, కరుణాకర్‌తోపాటు ఇతర స్పెషల్ బ్రాంచ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులే ప్రజలకు నిజమైన మిత్రులు ప్రజలకు పోలీసులే నిజమైన మిత్రులని వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అన్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వరంగల్ అర్బన్ ఎస్పీ విద్యార్థులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టడంతోపాటు చిన్నారుల చేత కట్టించుకున్నారు. విద్యార్థులు, ప్రజలు నిర్వహించుకునే ఫ్రెండ్షిప్ డే రోజున శాంతిభద్రతల కోసం నిరంతరం శ్రమించే పోలీసులను కూడా తమ మిత్రులుగా భావించాలని ఎస్పీ తెలిపారు. తమ కుటుంబం కన్నా ప్రజల రక్షణే తన లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులు అన్నివర్గాల ప్రజలకు మిత్రులన్నారు. తేజస్వీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు మన్నవ లక్ష్మీమహతి, మాధవశర్మ, లహరి అర్బన్ ఎస్పీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. అనంతరం విద్యార్థులకు తిరిగి ఎస్పీకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారు. -
కాంగ్రెస్‌లో ‘కొత్త’ ముసలం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి టౌన్/గాంధారి, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొత్త చిక్కొచ్చిపడింది. పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్టు ఇస్తే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని మండల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎల్లారెడ్డి టికెట్టు నల్లమడుగు సురేందర్‌కు ఖరారైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం ఎల్లారెడ్డిలో ఏఎంసీ చైర్మన్ కృష్ణాగౌడ్, సొసైటీ చైర్మన్ దామోదర్, గాంధారిలో ఏఎంసీ చైర్మన్, మండల కమిటీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, మాజీ చైర్మన్ తాన్సింగ్, లింగంపేట్‌లో డీసీసీబీ డెరైక్టర్ సంపత్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నవారిని పక్కనబెట్టి, చివరి నిమిషం లో టీఆర్ఎస్నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నల్లమడుగు సురేందర్‌కు టికెట్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను సాకుగా చూపుతూ వేరే పార్టీలోంచి వచ్చిన వ్యక్తికి టికెట్టు ఇవ్వడం భావ్యం కాదన్నారు. షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్‌లు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీపై పలుమార్లు దుమ్మెత్తిపోసిన వ్యక్తికి టికెట్టు ఇచ్చి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. సురేందర్‌కు పార్టీ బీఫాం ఇస్తే ఆరు మండలాల్లోని పార్టీ నాయకులమంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కొత్తవారికి కాకుండా ఎవరికి టికెట్టు ఇచ్చినా కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సురేందర్‌కే పార్టీ టికెట్టు ఇస్తే రెబల్ అభ్యర్థిని బరిలో నిలుపుతామని హెచ్చరించారు. సురేందర్ వర్గీయుల్లో ఆందోళన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిపై వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నల్లమడుగు సురేందర్ మూడు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనపై సానుభూతి ఉంది. దీనిని సొమ్ము చేసుకోవాల ని భావించిన కాంగ్రెస్.. ఆయనను పార్టీలో చేర్చుకొంది. ఆయనకే టికెట్టు ఖరారు చేసిం దని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోని నేతల తిరుగుబాటుతో ఎల్లారెడ్డి టికెట్టు ఖరారవనుందన్న ఆనందం సురేందర్ వర్గీయుల్లో లేకుండా పోయింది. మండల స్థాయి నాయకులు, కార్యకర్తల తీరుతో వారిలో ఆందోళన మొదలైంది. సీనియర్లు రెబల్ అభ్యర్థిని నిలిపితే పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. -
డీఈఓ బదిలీ..?
ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్‌రెడ్డి బదిలీ అవుతున్నట్లు తెలిసింది. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రాజీవ్ విద్యామిషన్ పీఓగా నియమించేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా రాష్ట్ర విద్యాశాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా పని చేస్తున్న బుచ్చన్నను నియమిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావడం, ఏలూరు ఆర్వీఎం పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో తనను అక్కడికి బదిలీ చేయాలని డీఈఓ నెల రోజుల క్రితం ఉన్నతాధికారులకు విన్నవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. -
చెల్లని కార్డులు 1,27,936
చిగురుమామిడికి చెందిన నారాయణపురం హన్మంతు అనే నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. హౌసింగ్ ఏఈ రవీందర్‌రెడ్డి రేషన్‌కార్డు చూపించాలని కోరారు. హన్మంతు ప్రభుత్వం తనకు ఇచ్చిన రేషన్‌కార్డు (నంబర్ ట్యాప్ 205320608864)ను అందించాడు. ఏఈ ఆన్లైన్లో పరిశీలిస్తే సదరు కార్డు నంబరు కనిపించలేదు. దీంతో హన్మంతుకు మంజూరైన ఇల్లు రద్దవుతుందని చెప్పారు. గత్యంతరం లేక హన్మంతు డెప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తామేమీ చేయలేమని డీటీ బదులిచ్చారు. ఇలాంటి కార్డుల గురించి పై అధికారులకు నివేదించామని, తిరిగి ఉత్తర్వులు వచ్చేంత వరకు వేచిచూడాలని సూచించారు. ఇది ఒక్క హన్మంతు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా 1,27,936 కుటుంబాలదీ ఇదే వ్యథ. - న్యూస్‌లైన్, చిగురుమామిడి చిగురుమామిడి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నవంబర్‌లో జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో 1,27,936 మందికి కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేసినట్లు ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పగా ప్రచా రం చేసుకున్నారు. కానీ కార్డుల స్థానంలో తాత్కాలిక కూపన్లు జారీ చేయడంతో అవి ఎందుకూ కొరగావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూపన్లపై కొన్ని చోట్ల రేషన్ సరుకులు ఇస్తుండగా, మరికొన్ని చోట్ల వాటికీ దిక్కులేదని ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులతో లంకె పెట్టిన విషయం తెలిసిందే. సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాలు, సబ్సిడీగ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు కొత్త రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు వర్తిం చడం లేదు. రేషన్‌కార్డులను తాత్కాలింకగా పనికి వచ్చేలా జారీచేయడంతో కార్డులు పొందిన కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కార్డులు కేవలం రేషన్ సరుకుల కోసం తప్ప మరే అవసరానికీ ఉపయోగపడడం లేదని వాపోతున్నారు. కార్డులపై ఉన్న నంబర్లు ఆన్లైన్లో కనిపించడంలేదని తిరస్కరిస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల్లో చుక్కెదురవుతోంది. జిల్లావ్యాప్తంగా మొదటి, రెండో విడత రచ్చబండ కార్యక్రమాలతోపాటు జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేశామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పుకున్నారు. ఇలాంటి కార్డులు జిల్లాలో 1,27,936 మంజూరు చేయగా, చిగురుమామిడి మండలంలో 1,074 కుటుంబాలకు అందించారు. తాత్కాలికంగా ఆయా కుటుంబాలకు అందించిన కార్డులు సంక్షేమ పథకాలకు వర్తించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జీవనోపాధికోసం మరో రాష్ట్రం నుంచి వచ్చిన ఓ కుటుంబం రామచంద్రాపురంలో స్థిరపడింది. ఈ కుటుంబంలోని 15 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించగా, బెల్ విద్యుత్‌నగర్‌కు చెందిన మతిన్ డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలోనే బాలికపై కన్నేసి అతను మాటల్లో దింపి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. తరచూ బాలికతో ఫోన్లో మాట్లాడుతూ అప్పుడప్పుడూ కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తన మిత్రులైన రామచంద్రాపురానికి చెందిన ఆటోడ్రైవర్ సుల్తాన్, జవహర్‌నగర్‌కు చెందిన టెన్నీస్ కోచ్ మహేశ్‌లను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా బాలికను అప్పుడప్పుడూ పాఠశాల నుంచి ఆటోలో తీసుకెళ్లి ఇంటివద్ద దింపేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న మతిన్, సుల్తాన్, మహేశ్‌లు హైదరాబాద్ చూపిస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు. అనంతరం హైదరాబాద్ నుండి ఆ బాలిక ను బీదర్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బాలిక బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు శనివారం బీదర్‌కు వెళ్లి బాలికతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం నిందింతులను తమదైనశైలిలో విచారించిన పోలీసులు వారు తెలిపిన వివరాల మేరకు వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. -
కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ
జిన్నారం, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో త్వరలో బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. జిన్నారం మండలం అన్నారంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం మండల స్థాయి టీఆర్ఎస్ శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగు రవీందర్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన అంశాలు, గతంలో తెలంగాణను పాలించిన వారి వివరాలు, రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమాలు, తదితర విషయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్‌రెడ్డి, వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య వాదాన్ని భుజన వేసుకొని తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే మరో ఉద్యమం తప్పదన్నారు. భద్రాచలం ముమ్మాటికి తెలంగాణదేనన్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి నాటి కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. రక్తం చుక్క చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఘనత తమ పార్టీ అధినేత కేసీఆర్‌దే నన్నారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పరిశీలకులు గణేష్, తెలంగాణ ప్రైవేటు సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మధుసత్యం, పటాన్‌చె రు నియోజకవర్గ ఇన్చార్జి గాలి అనిల్‌కుమార్, జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్‌గౌడ్, నాయకులు హన ్మంత్రెడ్డి, శంకర్‌గౌడ్, శంకరప్ప, దర్గ శ్రీనివాస్, నరహరి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ, వెంకటేశ్, మల్లేశ్, భిక్షపతి, రాజు, శ్రీను, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ ఐఎంఏకు ప్రత్యేక స్థానం
కేఎంసీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త నాలుగు విభాగాలుగా ఉన్న వైద్య, ఆరోగ్యశాఖను ఒకే గొడుగుకిందకు తెస్తామని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కేఎంసీలోని ఎన్నారై భవన్లో శనివారం జరి గిన ఐఎంఏ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ఐఎంఏకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత ఐఎంఏలో అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నది వరంగల్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికకావడం అభినందనీయమన్నారు. డాక్టర్లపై దాడులు జరుగకుండా పోలీసులు, మీడియా, రాజ కీయ నాయకులు సహకరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కంకల మల్లేషం మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఐఎంఏ అనేక సేవలందించిందని వివరించారు. మాజీ కార్యదర్శి డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడారు. సంవత్సర కాలంలో 62 సీఎంఈ ప్రోగ్రాంలను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించామని, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు పాదయాత్ర నిర్వహించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువత ఆత్మహత్యలు చేసుకోకుండా సైకియాట్రిస్ట్‌ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సదంర్భంగా ఎర్ర శ్రీధర్‌రాజును హరీష్‌రావు, డాక్టర్లు సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, నూతన కార్యదర్శి కొత్తగట్టు శ్రీని వాస్ ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడుతూ పేద ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్యసేవలు అంది స్తామని చెప్పారు. డాక్టర్ల కోసం ప్రత్యేకంగా రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ఆదివారం నగరంలో సూపర్‌స్పెషలిస్టులు అందుబాటులో ఉండేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్‌ధరక్, డాక్టర్ రాజ్‌సిద్ధార్థ, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ కస్తూరి ప్రమీల, టీఆర్ఎస్ నాయకులు గుడిమళ్ల రవికుమార్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ కార్పొరేటర్లు బయ్య స్వామి, దూపం సంపత్‌కుమార్, మెడికోలు పాల్గొన్నారు. -
‘వెలుగుబంటి’ కేసులో మరో నిందితుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మత్స్యశాఖ మాజీ కార్యనిర్వాహక ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ప్రవాసభారతీయురాలు విజయలక్ష్మికి ఒడిశాతో పాటు రాష్ట్రంలోని కృష్ణపట్నంలో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనుమతి లభించింది. వీటికి రూ.400 కోట్లు సమీకరించుకోగా, మరో రూ.200 కోట్లు అవసరమవటంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ వెలుగుబంటి ఆమెను చెన్నైలో ఒక సమావేశానికి తీసుకువెళ్లారు. సుందర్రాజన్, సూర్యనారాయణ తదితరులు తాము రుణం ఇప్పిస్తామంటూ విజయలక్ష్మి నుంచి ముందస్తు చెల్లింపుల పేరుతో రూ.65 లక్షల వరకు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సుందర్రాజన్ను అరెస్టు చేయగా ఆయన న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది విడుదలయ్యాడు. మిగిలిన నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. సుందర్ రాజన్ నుంచి నేరానికి సంబంధించిన రూ.4 లక్షల నగదు సైతం రికవరీ చేశారు.