హెచ్‌సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి విజయం | Ravinder Reddy victory as president of HCAA | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి విజయం

Published Fri, Mar 29 2024 2:35 AM | Last Updated on Fri, Mar 29 2024 2:35 AM

Ravinder Reddy victory as president of HCAA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్‌రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్‌రెడ్డి, మణికొండ విజయ్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్‌ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్‌పై రవీందర్‌రెడ్డి  33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్‌ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్‌ రావు, జిల్లెల సంజీవ్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్‌కుమార్, ట్రెజరర్‌గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చ రల్‌ సెక్రటరీగా ఎస్‌.అభిలాష్‌ విజయం సాధించారు.

హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్‌ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్‌ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 

న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్‌రెడ్డి  
బార్‌ అండ్‌ బెంచ్‌ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్‌ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement