జిన్నారం, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో త్వరలో బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, లెక్చరర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అన్నారు. జిన్నారం మండలం అన్నారంలోని ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం మండల స్థాయి టీఆర్‌ఎస్ శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏనుగు రవీందర్‌రెడ్డి, కత్తి వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన అంశాలు, గతంలో తెలంగాణను పాలించిన వారి వివరాలు, రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమాలు, తదితర విషయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమానికి టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్‌రెడ్డి, వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య వాదాన్ని భుజన వేసుకొని తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌పై కొర్రీలు పెడితే మరో ఉద్యమం తప్పదన్నారు. భద్రాచలం ముమ్మాటికి తెలంగాణదేనన్నారు.
అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి నాటి కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. రక్తం చుక్క చిందకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఘనత తమ పార్టీ అధినేత కేసీఆర్‌దే నన్నారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పరిశీలకులు గణేష్, తెలంగాణ ప్రైవేటు సెక్టార్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మధుసత్యం, పటాన్‌చె రు నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్, జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్‌గౌడ్, నాయకులు హన ్మంత్‌రెడ్డి, శంకర్‌గౌడ్, శంకరప్ప, దర్గ శ్రీనివాస్, నరహరి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ, వెంకటేశ్, మల్లేశ్, భిక్షపతి, రాజు, శ్రీను, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ
Published Mon, Nov 18 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement