వరంగల్ ఐఎంఏకు ప్రత్యేక స్థానం | IMA special place in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ ఐఎంఏకు ప్రత్యేక స్థానం

Published Sun, Nov 10 2013 2:08 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

IMA special place in Warangal

కేఎంసీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త నాలుగు విభాగాలుగా ఉన్న వైద్య, ఆరోగ్యశాఖను ఒకే గొడుగుకిందకు తెస్తామని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కేఎంసీలోని ఎన్నారై భవన్‌లో శనివారం జరి గిన ఐఎంఏ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ఐఎంఏకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.

హైదరాబాద్ తర్వాత ఐఎంఏలో అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నది వరంగల్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికకావడం అభినందనీయమన్నారు. డాక్టర్లపై దాడులు జరుగకుండా పోలీసులు, మీడియా, రాజ కీయ నాయకులు సహకరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్ డాక్టర్ల సేవలను కొనియాడారు. ఐఎంఏ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కంకల మల్లేషం మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఐఎంఏ అనేక సేవలందించిందని వివరించారు.

మాజీ కార్యదర్శి డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు మాట్లాడారు. సంవత్సర కాలంలో 62 సీఎంఈ ప్రోగ్రాంలను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించామని, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వరకు పాదయాత్ర నిర్వహించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువత ఆత్మహత్యలు చేసుకోకుండా సైకియాట్రిస్ట్‌ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సదంర్భంగా ఎర్ర శ్రీధర్‌రాజును హరీష్‌రావు, డాక్టర్లు సన్మానించారు.

అనంతరం నూతన అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, నూతన కార్యదర్శి కొత్తగట్టు శ్రీని వాస్ ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడుతూ పేద ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్యసేవలు అంది స్తామని చెప్పారు. డాక్టర్ల కోసం ప్రత్యేకంగా రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ఆదివారం నగరంలో సూపర్‌స్పెషలిస్టులు అందుబాటులో ఉండేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్‌ధరక్, డాక్టర్ రాజ్‌సిద్ధార్థ, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ రవీందర్‌రెడ్డి, డాక్టర్ కస్తూరి ప్రమీల, టీఆర్‌ఎస్ నాయకులు గుడిమళ్ల రవికుమార్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ కార్పొరేటర్లు బయ్య స్వామి, దూపం సంపత్‌కుమార్, మెడికోలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement