ది కేరళ స్టోరీ చిత్రాన్ని మతం కోణంలో కాకుండా ఉగ్రవాద కోణంతో చూడాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ది కేరళ స్టోరీ సినిమాను ఉచితంగా ప్రదర్శించగా నాయకులు ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదులు, తీవ్రవాదులు ఏ విధంగా హిందూ మహిళలు, యువతులను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఉగ్రవాద శిబిరాలకు తరలిస్తున్నారో ఈ చిత్రంలో చూపించారని తెలిపారు.
యువతులు, తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణశాఖ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్, నాయకులు గుర్రం రాము, జిట్టవేణి అరుణ్, ప్రభాకర్, నారాయణరెడ్డి, బిట్టు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
కేరళ స్టోరీ విషయానికి వస్తే.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రూ.250 కోట్లకు చేరువలో ఉంది.
చదవండి: ఇంటి పనంతా మాతోనే: స్నేహ
Comments
Please login to add a commentAdd a comment