Ram Gopal Varma Reaction On The Kerala Story Movie, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

RGV On The Kerala Story: కేరళ స్టోరీకి భారీగా పెరిగిన వసూళ్లు.. ఆర్జీవీ రియాక్షన్‌ చూశారా?

Published Mon, May 8 2023 2:37 PM | Last Updated on Mon, May 8 2023 3:09 PM

Ram Gopal Varma Reaction on The Kerala Story - Sakshi

ది కేరళ స్టోరీ.. దేశమంతటా ప్రకంపనలు రేపుతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దూసుకుపోతోంది. కొందరు సినిమా బాగుందని మెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఓ వర్గాన్ని కించపరిచిందని నొచ్చుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసలు కురిపించాడు. 'తమిళ/ మలయాళీ అమ్మాయి హీరోయిన్‌. గుజరాతీ నిర్మాత, బెంగాలీ డైరెక్టర్‌.. ఈ హిందీ సినిమా అన్ని భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇదీ అసలైన పాన్‌ ఇండియా చిత్రమంటే!' అని ట్వీట్‌ చేశాడు.

ఇది చూసిన నెటిజన్లు 'నువ్వు పాజిటివ్‌గా స్పందించావంటే ఆశ్చర్యంగా ఉంది', 'పాన్‌ ఇండియా సినిమా అంటున్నారు కానీ బాగుందా? బాలేదా? అని ఏమీ చెప్పట్లేదు ఏంటి?' అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 2018-19లో 32,000 మంది అమ్మాయిలు కనబడకుండా పోయారు.. వారు ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని పట్టించుకునేవాళ్లే లేరు. ఆ కథనే ది కేరళ స్టోరీ పేరిట సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్‌ సుదీప్తోసేన్‌.

బాలీవుడ్‌ హీరోయిన్‌ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మించారు. మొదటి రోజు రూ.8.02 కోట్లు, రెండో రోజు రూ.11.22 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఆదివారం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.35 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది.

చదవండి: తొక్క తీస్తా.. ఆర్‌ఆర్‌ఆర్‌ మాస్‌ వార్నింగ్‌.. క్షమాపణలు చెప్పిన రాజస్థాన్‌ రాయల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement