హైదరాబాద్ : తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్ అడిషనల్ మెట్రోపాలిటన్ జడ్జి కె.రవీందర్ రెడ్డిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. రవీందర్ రెడ్డి సహా జనరల్ సెక్రటరీ వరప్రసాద్ను కూడా న్యాయస్థానం సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆప్షన్ విధానంపై తెలంగాణ న్యాయమూర్తులు ఆదివారం హైదరాబాద్లో ఛలో రాజ్భవన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ కోర్టు వ్యవహారాలు అడ్డుకోవటంతో క్రమశిక్షణ చర్యల కింద ఈ మేరకు చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ సస్పెన్షన్ను నిరసిస్తూ న్యాయమూర్తులు ఆందోళనకు దిగారు.
కాగా ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్దపడ్డారు. తెలంగాణ జడ్జీల రాజీనామా లేఖలను ఆదివారం జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌కు ఇచ్చారు. అనంతరం గన్‌పార్క్ నుంచి రాజ్భవన్ వరకు న్యాయాధికారులు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడానికి వెళ్లిన విషయం విదితమే.