- కార్మికులకు తెలంగాణ కానుక
- ఈ నెల వేతనాలతో ఇంక్రిమెంట్
- బేసిక్‌పై 3 శాతం స్పెషల్ పేమెంట్
- సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం
కొత్తగూడెం(ఖమ్మం) : మూడు నెలలుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్‌ను కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూఏ కార్మికులు, ఎగ్జిక్యూటివ్ ర్యాంకు కార్మికులకు 3 శాతం ఇంక్రిమెంట్ అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల వేతనాల తోపాటు ఈ ఇంక్రిమెంట్ అందనుంది. అయితే, ఇది పీఎఫ్, డీఏ, పెన్షన్‌లకు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎంపీ కవితకు కృతజ్ఞతలు
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : తెలంగాణ ఇంక్రిమెంటుకు యాజమా న్యం అంగీకరించడంతో గుర్తింపు సంఘం నాయకులు.. యూని యన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వ కుంట్ల కవితను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరా జు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, డాక్టర్ శం కర్‌నాయక్ ఎంపీని గురువారం కలిసి.. ఇంక్రిమెంటు విషయమై మాట్లాడినట్లు ఉపాధ్యక్షుడు ఏనుగు రవీం దర్‌రెడ్డి తెలిపారు.
దీంతో ఎంపీ వెంటనే సింగరేణి సీఎం డీతో చర్చించారని, అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యా యని విలేకరులతో రవీందర్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న 62వేల మందికి ఈ ఇంక్రిమెంటు వర్తిస్తుం దని పేర్కొన్నారు. కాగా, ఈ ఇంక్రిమెంటుతో కంపెనీపై ప్రతీ నెల సుమారు రూ.5.31కోట్ల భారం పడనుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. యాజమాన్యం నిర్ణ యంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.